సిద్దూ: బిపాషా బసుతోనా యోగా- హవ్వ

కన్నడ సీఎం… ఏ విషయంలోనూ ఎక్కడా తగ్గరు…అది కారైనా కావచ్చు…  చేతి వాచ్ అయినా కావొచ్చు… కాంట్రావర్శీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే సిద్ధప్ప మరో వివాదానికి తెరతీశారు…  ఏకంగా బెంగుళూరులో జరిగిన యోగాడేలో బిపాసా కోసం కోటిన్నర ఖర్చఉ చేశారట… ఇటీవలే కేంద్ర ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది వివిధ రాష్ట్రాల్లో ఈ యోగా కార్యక్రమాలు జరిగాయి. ఇక యోగాలో పలువురు సీఎంలు..తారలు..అధికారులు పాల్గొన్నారు. కర్నాటకలో నిర్వహించిన యోగాపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ […]

మళ్ళీ టీం ఇండియా ని నడపనున్న పంచ పాండవులు!

ఒకనాటి టీమ్మేట్స్.. స్నేహితులు.. పాంచ్ పటాకా లాంటి ఆ స్టార్స్ టీమిండియాను మరోసారి ముందుండి నడిపించడానికి రెడీ అయ్యారు. 20వ శతాబ్దంలో పుట్టి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇండియన్ క్రికెట్ కు జోష్ ఇచ్చిన మేటి క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, సౌరభ్ గంగూలీ, ద్రావిడ్, కుంబ్లే, లక్ష్మణ్. ఈ ఐదుగురు సుమారు దశాబ్దన్నర కాలం పాటు ఇండియన్ క్రికెట్ ను ఒక్కటిగా నడిపించారు. తాజాగా ఇండియన్ క్రికెట్ కు చీఫ్ కోచ్ గా కుంబ్లేను ఎంపిక చేయడంతో […]

కాల్ మనీలోచక్రం తిప్పుతున్న ఆ మహిళ ఎవరు?

కాల్‌మనీ కేసులు కొత్త రూట్‌లోకి మళ్లుతున్నాయి. ఇప్పటి వరకు పోలీసులు కాల్‌మనీ కేసుల్లో నిందితులకు చుక్కలు చూపించారు. ఇప్పుడు రివర్స్‌లో నిందితులు టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా డబ్బులు వసూలు చేశారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి తీవ్రత పెరిగి మళ్లీ కాల్‌మనీ కేసులు చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల క్రమంలో కొత్త లాబీయింగ్ మొదలైంది. అటు పోలీసులకు, ఇటు కాల్‌మనీ నిందితులకు మధ్యే మార్గంగా వారి మధ్య సయోధ్య కుదర్చటానికి ఒక మహిళ రంగంలోకి దిగింది. […]

దావూద్ ఏడ్చిన వేల!!

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషాదంలో మునిగిపోయాడు. జాలి, దయ, కరుణ లాంటివేమి లేని దావూద్ లాంటి డాన్ కూడా ఏడుస్తాడా.. అతనికీ విషాద ఘటనలుంటాయా అని అశ్చర్యపోకండి. ఎన్ని మర్డర్లు చేసినా దావూద్ కు కుటుంబ సభ్యులంటే చచ్చేంత ఇష్టం. అందుకు చాలా మందిని తనతోపాటే పాకిస్తాన్ తీసుకెళ్లిపోయాడు. దావూద్ కు ఎంతో ఇష్టమైన అతని చిన్న తమ్ముడు హుమాయున్ కస్కర్ చనిపోయాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న కస్కర్ ఇటీవలే మరణించడంతో దావూద్ ఇంట […]

రేవంత్ రెడ్డి దీక్షకు KCR కౌంటర్-ఇష్యూ క్లోజ్!!

మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఎలా కోరుకుంటే అలా పరిహారం చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు రెండు దారులు ఉన్నాయని.. ఒకటి 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే రెండోది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 123జీవో. వీటిల్లో బాధితులు దేన్నైనా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాదు ఒక్క బాధితుడికి కూడా అన్యాయం జరగకుండా పరిహారం చెల్లిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్లన్నసాగర్ బాధితుల కోసం దీక్ష చేస్తున్నట్లు నాలుగు […]

సింగ’పూర్‌’ లో మనకి మిగిలేది పూరే నా?

సింగపూర్‌ చాలా చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని అభివృద్ధి బాట పట్టిన సింగపూర్‌ని చూసి ప్రపంచం గర్వపడుతుంది. ఆ సింగపూర్‌ని చూసి నేర్చుకోవాలంటూ వివిధ దేశాల ప్రముఖులు చెబుతారు. ఆ సింగపూర్‌ని మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సృష్టించాలని కలలుకంటున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడో ముఖ్యమైన అంశం ఉంది. సింగపూర్‌కి, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణ బాద్యతలు అప్పగించడం తప్పు కాదు. కానీ సింగపూర్‌ ప్రభుత్వం వేరు, అక్కడి కంపెనీలు వేరు. ఏ […]

చలో అమరావతి-అన్నీ కన్నీటి గాధలే

ఊద్యోగుల తరలింపు ప్రక్రియ భావోద్వేగాల మధ్య ప్రారంభం అయింది. ఎన్నో ఎళ్లుగా హైదరాబాద్ లో స్థిరపడిన ఊద్యొగులు అమరావతికి వెళ్లాల్సి రావడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ జీవన శైలిలో భాగమైన ఏపి ఉద్యోగులు, అకస్మాత్తుగా తమ కుటుంబ సభ్యులు, బందువులను వదిలి అమరావతికి వెళ్లాల్సి రావడంతో తమ సొంత రాష్ట్రానికి వెళుతున్నామన్న సంతోషం కన్నా ఇన్నేళ్లుగా కలిసి ఊన్న మహనగరాన్ని వదిలి వెళ్తున్నామన్న వేదన వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తరలింపు డెడ్ […]

పులిచింతల పంచాయితీ షురూ

విడిపోయినా అన్నదమ్ములుగానే కలిసుందాం అన్నది ఒట్టి మాటే..లోలోపల రెండు తెలుగు రాష్ట్రాలు జల జగడాలతో సతమతమౌతున్నాయి.తెలాంగాణా వాటాలో చుక్కనీరు కూడా మాకు అవసరంలేదు అని ఆంద్రప్రదేశ్ చెప్తోంటే మాకు రావాల్సిన వాటాకు మించి మేము ఒక్క చుక్క నీటి బొట్టును కూడా తీసుకొం అని తెలంగాణా వాదిస్తోంది.మరి సమస్యేంటా అనుకుంటున్నారా,అదేనండి ఈగో అండి ఈగో..మేమెందుకు ఒప్పుకోవాలి..మేమెందుకు దిగిరావాలి..కుదిరిన కాడికి సమస్యస్యల్ని జటిలం చేసేసి ఎవరికి వారు హీరోలమైపోదామనే తప్ప రాష్ట్ర ప్రయోజానాగురించి ఆలోచించేదెవరు?ప్రజలమధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టేద్దాం పబ్బం […]

బలవంతపు సర్వేలు…. రైతుల్లో కలకలం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు సర్వేలు రైతుల్లో కలకలం రేపుతోంది. రైతులు అనుమతి లేకపోయినా వారి భూముల్లో అధికారులు సర్వేలు చేస్తున్నారు. రికార్డులు సరిచేస్తామని నమ్మబలికి రెవెన్యూ అధికారులు సంతకాలు చేయించుకున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు.భైరెడ్డిపాలెంకు చెందిన బోయి గురమ్మకు సర్వే నెంబర్‌ 58లోని 1లో 4 ఎకరాలు భూముంది. ఎయిర్‌పోర్టుకు తన జిరాయితీ భూమిని ఇవ్వనని ఖరాఖండిగా చెప్పింది. అయితే అధికారులు వ్యూహాత్మకంగా గురమ్మ భూ రికార్డులు సరి చేస్తామని చెప్పి సంతకాలు […]