మల్లన్నసాగర్… ఈ పేరింటేనే ఇపుడు టీఆర్‌ఎస్ సర్కార్‌కు గొంతపట్టేస్తోంది. జీవో 123 ప్రకరాం మంచినీళ్ల ప్రాయంగా భూములు సేకరిస్తున్న ప్రభుత్వానికి ‘ 2013 భూసేకరణచట్టం’ ఎక్కిళ్లు తెప్పిస్తోంది. ఇక ముందు సేకరించబోయే భూములతోపాటు.. ఇప్పటిదాకా సేకరించిన భూములకూ 2013 చట్టాన్నే వర్తింపజేయాల్సిన పరిస్థితి వచ్చింది. కుర్చీమీద కూర్చున్నది మొదలు… తనకు ఎదురేలేదన్నట్టు వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తొలిషాక్ మల్లన్నసాగర్ రూపంలో తగిలింది. తాము అనుకున్నదే చేస్తామని మొండిపట్టుదలకు పోయిన సర్కారు హైకోర్టులో మెత్తబడింది. నిర్వాసితుల కోరిన విధంగా […]
Category: Politics
టీడీపిలో అంతర్గతపోరు!
ఆపరేషన్ ఆకర్ష్‌తో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అలజడికి గురిచేసిన అధికార టిడిపిలోనూ ఈ వలసల వల్ల అంతర్గత పోరు తీవ్రమవుతోందన్న వాదనలు ఆ పార్టీలోనే వినవిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ఏకైక లక్ష్యంగా సాగిన ఈ వలసలు తమ పార్టీకి కూడా మున్ముందు పెద్ద సవాల్‌గా మారే ప్రమాదాలు కనిపిస్తున్నాయని టిడిపి నేతలు కొందరు వ్యాఖ్యనిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసవచ్చిన ఎమ్మెల్యేలకు టిడిపిలో ఒకప్పుడు తనకు ప్రత్యర్థిగా ఉన్న […]
జగన్ కూడా ఛలో విజయవాడ
ఆంధ్రప్రదేశ్ ఇక నుంచి అమరావతి కేంద్రంగా పరిపాలించబడనుంది. అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాలు పరిపాలనా కేంద్రాలు అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని గుంటూరుకి తరలించడం జరిగింది. విజయవాడలోనూ ఆ పార్టీ ముఖ్య కార్యాలయం ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందుగా తన రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా విజయవాడలో కార్యాలయం ఉన్నా, అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అమరావతికి తరలి […]
హైదరాబాద్‌కి టెర్రర్ టెన్షన్
చారిత్రక నగరం హైదరాబాద్ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా వర్ధిల్లుతోంది. దేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద ఘటన వెలుగు చూసినా దానికి హైదరాబాద్‌తో లింకులుంటున్నాయి. ఇదివరకటితో పోల్చిచూసినప్పుడు ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గినట్లే అనిపిస్తున్నప్పటికీ ప్రపంచానికి పెను సవాల్ విసురుతున్న ఐసిస్‌తో హైదరాబాద్‌కి లింకులున్నట్లుగా బయటపడుతుండడం ఆందోళన కలిగించేదే. తాజాగా హైదరాబాద్‌లో ఐసిస్ తీవ్రవాద సంస్థ సానుభూతిపరుల్ని ఎన్‌ఐఏ గుర్తించింది. పలువురు అనుమానితుల్ని అరెస్ట్ చేసింది. ఐసిస్ సానుభూతిపరులు నగర శివార్లలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో […]
అనంతలో ఆ ఇద్దరి రచ్చ మళ్ళీ మొదలు
అనంతపురం టౌన్ లోని సప్తగిరి సర్కిల్‌లో డివైడర్ల ఏర్పాటు టీడీపీలో చిచ్చురేపుతోంది. మొన్నీమధ్యే జరిగిన కౌన్సిల్‌మీట్‌లో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిలు మాటల యుద్ధమే సాగింది. తాజాగా సప్తగిరి సర్కిల్‌లో డివైడర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ధర్నాకు దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు నగరంలో ధర్నాకు దిగుతానన్న ఎంపీ హెచ్చరికలతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ముగ్గురు సీఐలతో పాటు అధిక సంఖ్యలో పోలీసులు సప్తగిరి సర్కిల్, నగరపాలక సంస్థకు […]
స్విస్ ఛాలెంజ్: కేంద్రానికి ఇష్టంలేదా?
అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్ ఛాలెంజ్‌కి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన మొదటి నుంచీ ఆ పద్ధతిలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెబుతూ వచ్చారు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే సమయంలో స్విస్ ఛాలెంజ్‌పై వివాదాలు తెరపైకొస్తున్నాయ్. అది ఏమాత్రం శుభపరిణామం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం కూడా దానికి సానుకూలం కాదని ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా, రాజధాని నిర్మాణంలో పారదర్శకత అవసరమని విదేశీ కంపెనీలకు భూములను కట్టబెట్టడం సబబు కాదనే అభిప్రాయం […]
కేసీర్ లోని ఉద్యమనేత నిద్రలేస్తున్నాడా!
ఎవరితోనైనా పెట్టుకోవాలంటే వారి వెనుక ఎవరున్నారో చూసి పెట్టుకోవాలి అనే నానుడి మనం వినే ఉంటాం. కేంద్రం పోయి పోయి కొరివితో తల గోక్కోవడానికి సిద్దపడుతోంది. అసలేదైనా చిన్న అంశం దొరికితేనే అవతలివాళ్ళని కబడ్డీ ఆడుకునే రకం కేసీర్ ది. కావాలంటే ఈ విషయం రోశయ్యనడగండి చెప్తారు. హైద్రాబాద్ స్పెషల్ జోన్ అన్న అంశాన్ని పట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే ఒక ఊపు ఊపేసారు ఆయన. ఒకటేమిటి తెలంగాణకి ఏ చిన్న విషయంలో అయినా అన్యాయం జరుగుతోందనిపిస్తే […]
స్వామీ ఇక చాలు:మోడీ
ఎట్టకేలకు ప్రధాని మోడీ సుబ్రహ్మణ్య స్వామివ్యాఖ్యలపై స్పందించాడు.ఇప్పటికే స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ కి చాలా నష్టం జరిగిన మాట వాస్తవం.మోడీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి ఝలక్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఆర్బీఐ గవర్నర్ రాజన్, ఆర్థకశాఖ అధికారులపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్న స్వామిపై ఇక చాలు ఇప్పటికి చేసిన నిర్వాకం చాలు అన్నరీతిలో వ్యాఖ్యలు చేశారు. వారిపై ఆరోపణలు చేయడం సరికాదని తేల్చిచెప్పారు. దేశంలో వ్యవస్థే గొప్పదని […]
ఎపిలో బి.కాం కంప్యూటర్స్ క్లోజ్!
బికాం కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుకు మంగళం పాడేయడానికి ఎపి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ ప్రణాళిక సిద్దం చేసింది. ఉన్నత విద్యావిధానంలో మార్పుల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఇతర కోర్సులపై ప్రభావం ఎలా వున్నా బి.కాం కంప్యూటర్స్ మాత్రం షేపులు మారిపోతున్నాయి. అసలు ఆ కోర్సు పేరే ఇకపై వినబడడం కష్టమేననిపిస్తుంది. కంప్యూటర్ ప్రభంజనంతో అకౌంటెన్సీలో పట్టు సాధించడం కోసం డిగ్రీలో బి.కాం చదివే విద్యార్థులకు కంప్యూటర్ అకౌన్సీమీద పట్టుండాలన్న లక్ష్యంతో ప్రవేశ పెట్టిన కోర్సు […]