కేసీఆర్‌ కూడా ‘జై ఆంధ్రా’ అంటారేమో 

తెలంగాణకు జై కొట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి జై కొట్టడం తప్పేమీ లేదు. ఎందుకంటే, అందరం భారతదేశంలో ఉన్నాం. పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్రాలు, అందులో జిల్లాలు, వాటిల్లో మండలాలు, గ్రామాలు తప్ప, దేశమంతా ఒక్కటే. ఓ ప్రాంతంపై విమర్శలు చేయడం, ఇంకో ప్రాంతానికి అనుకూలంగా నినాదాలు చేయడం అంత శుభపరిణామం కాదు . దేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య సున్నితమైన భావోద్వేగాలున్నాయి. ఉద్యమ వేడిలో సీమాంధ్రులపై కొంత విద్వేషం రగిలినమాట వాస్తవం.ఇప్పుడంతా […]

చంద్రన్నా ఏంది నీ తొందర

ఆంధ్రప్రదేశ్‌ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నమాట వాస్తవం. ఆర్థిక సమస్యలతో ఆంధ్రప్రదేశ్‌ సతమతమవుతోంది. రాజధాని నిర్మించుకోవడం ఆంధ్రప్రదేశ్‌ ముందున్న తక్షణ కర్తవ్యం. కానీ అది శక్తికి మించిన పని. అయినా తప్పదు, రాజధానిని నిర్మించుకోవాల్సిందే. ఇంకో వైపున ముఖ్యమంత్రి చంద్రబాబు నేను నిద్రాహారాలు మాని కష్టపడుతున్న అని ఎంత మొత్తుకున్నా ఏ పనీ సకాలంలో పూర్తి కావడంలేదు. ఆంధ్రప్రదేశ్‌కి అపారమైన వనరులన్నాయి, అలాగే అపాయాలు కూడా ఉన్నాయి. ప్రకృతే ఆంధ్రప్రదేశ్‌కి బలం, బలహీనత. సముద్ర తీరం ఎంత అందమైనదో, […]

గుడి కొట్టు-అభివృద్ధి సోట్టు:చంద్రోపదేశం

ఎక్కడైనా తుఫానుకి ముందు ఏదయినా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే జరిగే నష్టాన్నై తగ్గించవచ్చు.తుఫాను బీభత్సం సృష్టించేసాక అందరూ ధైర్యంగా ఉండండి,ఇలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి లాంటి సూక్తులు ఎందుకు పనికొచ్చేవి?సరిగ్గా ఇలాగే ఉంది విజయవాడలో గుళ్ళు కూల్చివేతపై మన చంద్రబాబు గారి వ్యవహారం కూడా. ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ తుఫాను చెప్పకుండా వచ్చింది కాదు,తెలీకుండా వచ్చింది అంతకంటే కాదు.బాబు గారు కనుసైగల్లో వచ్చిందే.లేకుంటే బాబు గారికి తెలీకుండా రాష్ట్ర రాజధాని అమరావతికి ఆనుకుని వున్న విజయవాడలో […]

వాళ్ళ టార్గెట్ లిస్ట్ లో స్టీల్ సిటీ కూడా!

ఇన్నాళ్లూ తెలంగాణకే పరిమితమైన ఉగ్రవాదుల కదలికలు ఇప్పుడు ఆంధ్రా ప్రాంతానికి కూడా విస్తరిస్తున్నాయి. తాజాగా పోలీసులు సేకరిరచిన సమాచారం అనేక ప్రాంతాల్లో బహిర్గతమవుతున్న కదలికలు చూస్తే ముష్కర మూకలు ఏపీలోనూ పాదం మోపుతున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌లో పోలీసుల నిఘా ఎక్కువవుతుండడంతో వారు ఆంధ్రాలో తలదాచుకుని, తమ కార్యక్రమాలను కొనసాగించేదుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబా, ఆల్‌ ఖైదా, ఐసిస్‌, పిఎఫ్‌ఐ వంటి సంస్థలు రాష్ట్రంలో పాగా వేసేరదుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు సందేహిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలు […]

వారసులను తీర్చి దిద్దే పనిలో చంద్రులు

రెండు తెలుగు రాష్ట్రాలు…ఇద్దరు సీఎంలు… వారికి ఇద్దరు పుత్రరత్నాలు… రాజకీయంగా, ముఖ్యమంత్రులుగా పాలనలో తమదైన ముద్రవేస్తూ, ఇప్పటికిప్పుడు ఢోకాలేని ప్రభుత్వాలను నడుపుతూ దూసుకు వెళుతున్న ఇద్దరు చంద్రులూ, తమ వారసులకు… ఫుల్ లెంగ్త్ లో ట్రైనింగ్ ఇస్తూ…. దూసుకుపోతున్నారు. ఇటు కేసీఆర్ అయితే అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తుంటే…. ఇటు చంద్రబాబు పార్టీ వ్యవహారాలు చక్క దిద్దే పని అప్పగించారు. మీ కుమారుడుని 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిచయం చేస్తారా? అంటూ ఇటీవల […]

బావ, బావమరదుల మధ్య… కోల్డ్ వార్ నడుస్తోందా!

విజయవాడలో కనకదుర్గగుడి ఈవో నియామక వ్యవహారం ఎమ్మెల్యే బాలకృష్ణకు అవమానం మిగిల్చింది. ఆయన సూచించిన వారి కి కాకుండా, వేరే వారిని ఆ పదవిలో నియమించడం, తాను సిఫారసు చేసిన తర్వాత కూడా ఐఏఎస్‌ను నియమించే పద్ధతికి శ్రీకారం చుట్ట డం బాబు వియ్యంకుడికి మనస్తాపం కలిగించిందని పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది…ఇప్పటి వరకు దుర్గగుడిలో నాన్ ఐఏఎస్ అధికారిని నియమించేవారు… కానీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఒకరు కనకదుర్గ గుడికి సమర్థులు, […]

రజనీకాంత్‌ విజయ్ ఒప్పుకుంటారా!

మాజీ ఐపీఎస్‌ అధికారి, ఇప్పుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పనిచేస్తున్న కిరణ్‌ బేడి, సినీ నటుడు రజనీకాంత్‌ని తమ రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాలని విజ్ఞప్తి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘ప్రోస్పరస్‌ పుదుచ్చేరి’ అనే మిషన్‌తో పుదుచ్చేరి అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కిరణ్‌ బేడి, రజనీకాంత్‌ని ఇందు కోసం బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండమని ట్విట్టర్‌ ద్వారా కోరారు. తన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందిస్తారని కూడా ఆమె ఆశిస్తున్నారు. అయితే రజనీకాంత్‌కి రాజకీయాల పట్ల అంత ఆసక్తి […]

కోడెల కామెడీ:జనం నోటితో నవ్వరు

అనర్హత పిటిషన్లను తిప్పి కొట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీకి పెద్ద షాక్‌ ఇచ్చారట.ఇదే బాబు భజన మీడియా మొత్తం ఊక దంపుడు నిన్నటి నుండి.విడ్డూరానికి ఒక హద్దు పద్దు ఉండాలి.లేకపోతే ఏంటి స్పీకర్ కోడెల ఫిరాయింపు MLA లపై అనర్హత వేటేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు.అనుకున్నట్టే పక్కాగా TDP పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ నే ఆయన ఎంచక్కా అసెంబ్లీ లోను బయట ఫాలో అవుతుంటారు.ఇప్పుడూ అదే చేశారు […]

దేవుడి జోలికెళ్లారు:అనుభవిస్తారు

అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, తాము ఏ సాంప్రదాయాల పరిరక్షణ కోసమయితే పోరాడుతున్నామో, ఆ సాంప్రదాయాలకు కేంద్రమైన దేవాలయాలను ప్రభుత్వమే కూల్చివేస్తుంటే కళ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి దయనీయమే. సర్కారు నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించలేక, అలాగని ఊరుకోలేక మధనపడుతున్న కమలనాథుల తీరు… ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా మారింది. విజయవాడలో ఇటీవలి కాలంలో శరపరంపరగా జరుగుతున్న ఆలయాలను కూల్చివేస్తూ తెదేపా సర్కారు దూకుడుగా వ్యవహరిస్తుంటే, భాగస్వామ్య పక్షంగా కనీసం అడ్డుకోలేని దుస్థితి తమ నాయకత్వంలో కనిపిస్తోందని బిజెపి శ్రేణులు […]