నేరస్థులు జైలుకెళ్లడం మాములే,నేరస్థులకు సహకరించిన వారూ జైలుకెళ్లడం మనం చూస్తుంటాం.కానీ ఇక్కడ పందెం రాయుళ్ళకి సహకరించింది ఎవరో కాదు ఓ పందెం కోడి.ఇంకేముంది పందెంకోడి కటకటాల పాలైంది! పందెంరాయుళ్లు పారిపోవడంతో అక్కడ దొరికిన ఓ పందెం కోడిని పోలీసులు సెల్ లో వేశారు. ఖమ్మం నగరంలోని మమత వైద్యశాల రోడ్డులో ఆదివా రం కోడిపందేలు జరుగుతుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఓ కోడిపుంజును వదిలి పందెంరాయుళ్లు పరారయ్యూరు. దీంతో పోలీసులు కోడిని తీసుకొచ్చి సెల్‌లో […]
Category: Politics
బాబుకు మోడీ ర్యాంక్ ఎంతో తెలుసా?
కేంద్రం నుంచి..ఆశించిన నిధులు రావడం లేదు…పోనిలో ఏదో చేసి నిధులు కోసం వెతుకుతున్న మోడీ సర్కార్ నుంచి ఆశించిన ఫలితం రావడం లేదని సీఎం బాబు తెగ ఫీలైపోతున్నారు…ఇంతకీ…కధ ఏంటంటే… సీఎం ర్యాంక్స్ లో బాబుపని తీరుకు ప్రధాన మంత్రి ఐదో ర్యాంక్ ఇచ్చినట్టు సమాచారం. అయితే దీనిపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా అధికారుల వద్ద ప్రస్తావిస్తూ తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసిరది. ఇది అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రుల పనితీరు […]
ఆ 21 మంది అక్కడికే వెళ్ళారా?
కేరళ నుంచి ఆచూకీ తెలియకుండా పోయిన 21 మంది ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్టు తెలుస్తున్నది. రాష్ట్రం నుంచి 21 మంది అదృశ్యమైన మాట నిజమేనని సీఎం పినరై విజయన్ అంగీకరించారు. అదృశ్యమైన వారిలో ఇద్దరు యువకులకు తండ్రియైన ఓ క్రైస్తవుడు తన కుమారులు ముస్లిం మత ప్రచారకుడు జకీర్ నాయిక్‌తో నిత్యం సంప్రదింపులు జరిపే వారని చెప్పారు. దీంతో కేరళలో ఐస్ కార్యకలాపాలపై అనుమానాలు బలపడుతున్నాయి. సీఎం విజయన్ రాష్ట్రం నుంచి 21 మంది అదృశ్యమయ్యారని, […]
మొక్కే కదా అని పీకేస్తే..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఇంద్ర’ సినిమాలోని పాపులర్ డైలాగ్ ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా..’. తెలుగు రాష్ట్రాల్లో మొక్కల పెంపకం గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంటే అందరూ ఈ డైలాగ్‌ని స్మరించుకుంటున్నారు. సినిమాలోని సన్నివేశం వేరు, ఇప్పటి సందర్భం వేరు. కానీ, మొక్కలు నాటడం కాదు – వాటిని పీకకుండా పెంచగలగాలని ప్రజలు కోరుకోవడం తప్పు కాదు కాబట్టి ఈ డైలాగ్ బాగా వినవస్తోంది. గత ఏడాది నాటి మొక్కల్లో సగం కూడా […]
యువరాజ్, హర్భజన్ లను కొట్టిన అక్తర్
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. భారత క్రికెటర్లపై దాడి చేశాడా..? ఆగ్రహానికి కేరాఫ్ అడ్రస్ అయిన యువీ, భజ్జీలను అక్తర్ ఎందుకు కొట్టాడు? అసలేం జరిగిందనేగా మీ డౌట్. అయితే ఈ స్టోరీ చదవండి. దాదాపు 12ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను తాజా హర్భజన్ సింగ్ బయటపెట్టాడు. అప్పుడు జరిగిన వివాదం తాలూకు వివరాలను చెప్పాడు. 2004లో పాకిస్తాన్ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు హర్భజన్ తెలిపాడు. తనను, యువరాజ్ […]
హరీష్, కేటీఆర్‌లలో ఎవరికి దక్కేనో!
మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ల మధ్య విపరీతమైన పోటీ ఉంది. వీరిలో హరీష్‌రావు స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌కి మేనల్లుడు. కేటీఆర్ అయితే కెసియార్ తనయుడే. ఇద్దరూ మంత్రులే. తెలంగాణ రాష్ర సమితి పార్టీకి వీరిద్దరూ ముఖ్యమైన వ్యక్తులు, మూలస్తంభాల్లాంటివారు. ఇద్దరిలో కెటియార్ ఒకింత ఎక్కువ. ముఖ్యమైన శాఖలన్నీ కెటియార్ వద్దనే ఉన్నాయి. కానీ కెటియార్‌కి ఇంకో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాలని చూడటం ద్వారా హరీష్‌రావుని ఇంకా తక్కువ చెయ్యాలనుకుంటున్నారట ముఖ్యమంత్రి కెసియూర్. అదెలాగంటే బాధ్యతలు పెరిగే కొద్దీ […]
మోడీ చుట్టూ అంతమంది కోటీశ్వరులా!
తాజా మంత్రివర్గ విస్తరణతో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కోటీశ్వరుల సంఖ్య 72కు చేరుకుందని, అలాగే క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించిన మంత్రుల సంఖ్య 24కు పెరిగిందని ఢిల్లీకి చెందిన ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పేర్కొంది. లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎన్నికల కమిషన్‌కు అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌లలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఆ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకున్న మంత్రుల […]
బాబు సంపాదన ఎంతో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వార్షికాదాయం రూ. 36 లక్షలు. సిఎంతో సహా ఆయన ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్, ఓటర్ ఐడీ అన్నీ హైదరాబాద్‌లో ఉండగా స్థిర, చరాస్తులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. తొలిరోజు స్మార్ట్ పల్స్ సర్వేను ముఖ్యమంత్రి ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రారంభించారు. తొలుత ఎన్యుమరేటర్లు ముఖ్యమంత్రికి సంబంధించిన వివరాలు సేకరించారు. సిఎంగా తనకు వచ్చే ఆదాయం అన్నింటితో కలుపుకుని రూ. 36 లక్షలని చంద్రబాబు ఎన్యుమరేటర్లకు వివరించారు. తన స్వగ్రామం చిత్తూరుజిల్లా […]
టీడీపీ వాళ్ళనూ వదలొద్దు:బీజేపీ
ఏపిలో పార్టీని శరవేగంగా విస్తరించేందుకు బిజెపి తన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసింది.ఆరుగంటల పాటు ఢిల్లీలోని ఏపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నివాసంలో జరిగిన కోర్ కమిటీ భేటీలో, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేశారు. ”రాష్ట్రంలో ఏ పార్టీ నాయకులు వస్తామన్న వద్దనకండి. చేర్చుకోండి. చివరికి టిడిపి వాళ్లనైనా వదలవద్దు. పార్టీ తలుపులు బార్లా తెరవండి. బిజెపిని బలోపేతం చేయ్యండి” అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర నేతలకు సూచించారు. శుక్రవారం నాడిక్కడి […]