కనకపు సింధూరం

బంగారం గెలవలేదు కానీ బంగారం కంటే గొప్ప ఆటే ఆడింది.అందుకే ఇంటా బయటా ప్రశంశల జల్లులు కురుస్తున్నాయి.యావత్ భారతావనిని మంత్రముగ్దుల్ని చేసింది సింధు పోరాటం.ఓ వైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే మరో వైపు కనక వర్షం మొదలయింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు..అనేక సమాఖ్యలు ప్రభుత్వ, ప్రభుత్వేతరులు సింధుకి నజరానాలు ప్రకటిస్తున్నారు.ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించింది.ఇక తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మూడు కోట్ల రూపాయిలు, అమరావతిలో వెయ్యి గజాల స్థలం, గ్రూప్ […]

నీ ఆటకు సలాం..నీ పోరాటానికి గులాం

తెలుగింటి ఆడపడుచు..భరతమాత ముద్దుబిడ్డ పూసర్ల వెంకట సింధు బంగారు పతాక వేటలో ఓటమిని చవి చూసింది.అయితేనేం బంగారు పథకం కంటే విలువైన పోరాటాన్ని స్ఫూర్తి ని కనబరిచి మా బంగారం నువ్వే అనే లా 100 కోట్ల మందిచే నిందింపచేసింది. ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది మన సింధు.హోరాహోరీగా సాగిన ఫైనల్ లో సింధూ 21-19, 12-21, 15-21 తేడాతో స్పెయిన్ నెంబర్ వన్ కరోలిన మారిన్ చేతిలో పోరాడి […]

బాబు ప్లీజ్: సింధు కూడా నా

అందరిలా మాట్లాడితే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.ప్రపంచానికి పాఠాలు చెప్పింది ఆయనే..సెల్ ఫోన్ ని ఇండియాకి తెప్పించింది ఆయనే..సాఫ్ట్ వేర్ ని కనిపెట్టింది ఆయనే..వినే ఓపిక ఉంటే ఇలాంటివి ఇంకా చాలా లిస్ట్ వుంది కానీ ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.అంతటి ఘనాపాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ గా నియమితులయితే దానిక్కూడా బాబే కారణమని ఆ మధ్య నవ్వులపాలయ్యాడు.అమరావతికి ఒలింపిక్స్ తెస్తానని ఇంకోసారి అభాసుపాలయ్యాడు.ఇలా సీజనల్ గా ట్రెండ్ ని […]

కేసీఆర్‌కి పవర్‌ పాయింట్‌ దెబ్బ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి తెలంగాణలోని నీటి ప్రాజెక్టులపై కాంగ్రెసు పార్టీ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంస్థలను ఆహ్వానించి తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఈ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న విషయాలన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. కానీ గడచిన రెండేళ్ళలో తెలంగాణలోని కెసియార్‌ ప్రభుత్వం సాధించినదేమీ లేదని కాంగ్రెసు […]

నిజమే తెరాస బాలయ్యే

బాలయ్య రూటే సపరేటు..అది సినిమా అయినా..రాజకీయమైనా.ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడతారో ఆయనకే తెలీదు.ఎక్కడ మొదలుపెట్టాలో తెలుసు కానీ ఎక్కడ ముగించాలో తెలీదు.స్టార్ట్ చేసాడంటే మాత్రం డబిడ దిబిడే.అదీ బాలయ్య స్టైల్ మరి.అదే బాలయ్యకు అప్పుడప్పుడు చిక్కులు కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది.ప్రెస్ మీట్ లలో బాలయ్య ఇలానే నోరు జారి ఇటు వ్యక్తిగతంగాను అటు టీడీపీ పార్టీ పరంగాను ఇబ్బదుల్ని ఎన్నో సార్లు ఎదుర్కొన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే బాలయ్య నిన్న కృష్ణ పుష్కరాల సందర్బంగా మహబూబ్ […]

కవిత కూడా ఏపీ వైపే

ఇంతలో ఎంత మార్పు..రాజకీయం అంటే ఇదే నేమో..రెండేళ్ల క్రితం వరకు ఛీ..తూ అన్నవారే ఇప్పుడు బాసటగా నిలుస్తున్నారు..తెలంగాణాలో ఆంధ్ర విద్యా సంస్థల్ని నిషేదిస్తాం..తెలంగాణలో ఆంధ్ర హోటళ్లు నడవనివ్వం..ఇంకా మాట్లాడితే ఆంధ్రోళ్ళను తరిమి కొడతాం అన్న తెరాస నాయకులే ఇప్పుడు హైదరాబాద్ లో ఆంధ్ర సెట్ట్లెర్స్ కి రెడ్ కార్పెట్ పరుస్తాం..ఆంధ్రోళ్ల కాళ్ళో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తాం అనే స్థాయికి వచ్చేసారు.అదే మరి రాజకీయం అంటే. ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా […]

మోడీ ఎర్రకోట ఎఫెక్ట్:పాక్ పరేషాన్

స్వాతంత్ర దినోత్సవాన ఎర్రకోటపై భారత ప్రధానులు చేసే ప్రసంగానికి ఓ ఆనవాయితీ ఉంది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలేంటి? తమ ప్రభుత్వ ప్రాధాన్యాలేంటి? తామేం చేస్తాం? ఇప్పటి వరకు తామేం చేయగలిగాం అన్నది వివరించేవారు. దేశ ప్రజలకు సందేశాలు ఇచ్చే వారు. ఎన్నెన్నో సందేహాలను మిగిల్చే వారు. అదే ఎర్రకోట నుంచి నరేంద్రమోడీ చేసిన ప్రసంగం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కంటిలో రాయిలా మారిన పొరుగు దేశంపై నేరుగా ఆయన అస్త్రం ఎక్కుపెట్టారు. కొత్త సంప్రదాయానికి తెరలేపారు.ప్రధాని […]

పొన్నం ఈ ఛాన్స్ మిస్ అవ్వడేమో!

రాజకీయాల్లో కొందరి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది.వాళ్లు ఫలానా పని చేయబోతున్నారని ముందుగా వాళ్లే లీకులిస్తారు.తీరా ఆ టైం వచ్చేసరికి వాళ్లే తూచ్ అదేం లేదు అదంతా ఉత్తినే అని మాట మార్చేస్తారు.ఈ కోవలో ముందుగా ఉండేది మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ ఒకరు ఇంకొకరు దానం నాగేందర్. ఒకటి కాదు రెండు కాదు తెలంగాణా ఏర్పడ్డాక చాలా సార్లు వీరిద్దరూ కారెక్కి తెరాస తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వినిపించాయి.అయితే చివరి నిమిషం లో […]

మంత్రి భార్యనీ వదల్లేదు

ఆమె స్వయానా కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్‌ వీకే సింగ్‌ భార్య భారతీ సింగ్‌.అయితేనేం ఆమెనే బెదిరిస్తున్నాడో ప్రబుద్దుడు.వివరాల్లోకెళ్తే ఢిల్లీకి చెందిన ప్రదీప్‌ చౌహాన్ మంత్రి గారి కుటుంబానికి తెలిసినవాడే.ఆ మధ్య ఆగష్టు 6 న భారతి సింగ్ ప్రదీప్ తో ఫోన్ లో మాట్లాడింది.అయితే ఆ మాటలని ప్రదీప్ రహస్యంగా రికార్డు చేసాడని రూ 2 కోట్లు ఇవ్వకపోతే ఆ సంభాషణల్ని సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని భారతీ సింగ్‌ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]