ఓటుకు నోటు కేసుని వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ కదిలించింది. ఆ పార్టీకి చెందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై పునర్‌విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ‘దే బ్రీఫ్డ్ మీ’ అని ఈ కేసులో చంద్రబాబు వాయిస్‌తో వెలువడ్డ ఆడియో టేపులకు సంబంధించి పోరెన్సిక్ నుంచి వచ్చిన నివేదికను వైసిపి నేత తరఫు లాయర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో సెప్టెంబర్ 29 లోపు కేసు విచారణ పూర్తి చేయవలసిందిగా న్యాయస్థానం […]
Category: Politics
థాంక్స్ పవన్ కళ్యాణ్:నాని
జనసేన అధ్యక్షుడు ఎప్పుడూ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినా లేకపోతే మీడియా ముందుకొచ్చినా కొంతమందిని వ్యక్తుగతంగా టార్గెట్ చేస్తుంటారు.వాళ్లలో ముక్యంగా ఉండేది టీడీపీ విజయవాడ ఎంపీ,కేశినేని ట్రావెల్స్ ఓనర్,కేశినేని నాని.మొన్నామధ్య తిరుపతి బహిరంగ సభలో కూడా పవన్ కేశినేని పేరును ప్రస్తావించారు.మన ఎంపీలందరూ బాగా డబ్బున్నోళ్లే,కోటీశ్వరులు,వాళ్లలో ముక్యంగా అంటూ కేశినేని పేరుని పవన్ ప్రస్తావించడం తెలిసిందే. అయితే ఈ విషయంపై నాని స్పందిస్తూ..పవన్ కి ఇదేం కొత్తేమి కాదు..పాపం ఎప్పుడూ తనని తలుస్తునే ఉంటాడు.దీనిపై నాకేం కోపం […]
పవన్ కాళ్ళు చేతులు తీసేస్తారు
పవర్ స్టార్ , జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో ప్రసంగించిన తరువాత ఇంకా రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి.పవన్ కళ్యాణ్ దాటికి ఆయన ప్రసంగించేసి వెళ్లిపోయారు..ఇంకేముంది అటు మీడియా కి ఇటు మిగిలిన పొలిటిషన్స్ కి మళ్ళీ పవన్ ప్రశ్నించే వరకు ఫుల్ టైంపాస్ అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎవరికీ తోచినట్టు వాళ్ళు పవన్ స్పీచ్ ని విశ్లేషిస్తూ విమర్శిస్తూనే వున్నారు.తాజాగా కర్నూల్ నుండి ఈ మధ్యనే టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన మాజీ కాంగ్రెస్ నాయకుడు […]
పయ్యావులా? పరిటాలా?
పయ్యావుల కేశవ్! టీడీపీలో అనంతపురానికి చెందిన సీనియర్ నేత! అన్న నందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుంచి పయ్యావుల సైకిల్‌పైనే తిరుగుతున్నారు. తన తోటి వారు ఒకరిద్దరు ఇతర పార్టీల్లోకి జంప్ చేసి మళ్లీ వచ్చి సైకిలెక్కినా.. ఈయన మాత్రం అలాంటి జంప్‌లేవీ చేయకుండా పార్టీలోనే ఉన్నారు. ఇక, పదేళ్లపాటు టీడీపీ విపక్షంగా ఉన్న సమయంలోనూ పయ్యావుల పార్టీని వీడలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క కామెంట్ కూడా చేయలేదు. దీనికితోడు ఉరవకొండ నియోజకవర్గం సహా అనంతపురంలోనూ పయ్యావులకు […]
జనసేన ఇకపై హైపర్ యాక్టివ్!
తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఏం సంకేతాలు పంపుతున్నట్టు? ఇకపై జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు ఆయన నిర్ణయించుకున్నారా? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే, పవన్‌కళ్యాణ్ గత రాజకీయ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సభ తర్వాత మళ్ళీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళకుండా ఉంటారా? అనే అనుమానాలు కలగడం సహజం. ప్రత్యేక హోదా విషయంలో బిజెపిని ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పిన పవన్‌కళ్యాణ్, కాకినాడ వేదికగా ఇంకో బహిరంగ […]
మాట తప్పను మడమ తిప్పను: పవన్
‘ఇంకో పాతికేళ్ళపాటు ప్రజల కోసం పోరాడతాను..’ అని జనసేన అధిపతి పవన్‌కళ్యాణ్, తిరుపతి వేదికగా నినదించారు. కేంద్రానికి సీమాంధ్రుల సత్తా ఏంటో చూపిస్తేగానీ, ప్రత్యేక హోదా వచ్చేలా లేదని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో తిరుపతి వేదికగా నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడం దారుణమని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కి ఓటేయలేం, ఉన్నది ఒకటే అవకాశం అదే భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీని కూడా […]
కవిత కౌంటర్ అదిరింది
నిజామాబాద్ ఎంపీ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి కుమార్తె కవిత ఈ మధ్య రాష్ట్ర రాజకీయాల్లో అంతా చురుగ్గా పాల్గొనడం లేదన్నది వాస్తవం.హస్తిన రాజకీయాలతోనే కవిత బిజీ బిజీ గా గడుపుతోంది.ఎప్పుడో అడపా దడపా తెలంగాణా జాగృతి తరపున ఇక్కడ కనిపిస్తోందంతే. దీనికి కారణం లేకపోలేదు.రాష్ట్రంలో తన తండ్రి ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారు.ప్రతిపక్షం అనేదే లేకుండా నిర్వీర్యం చేసేసారు.ఏదయినా చిన్న చితకా ఇబ్బందులుంటే అన్న కేటీర్,బావ హరీష్ రావు లు చక్కదిద్దేస్తున్నారు.ప్రభుత్వం పై వ్యతిరేకత బాగా ఎక్కువయినా..ప్రతి పక్షాలకు […]
కెసియార్ స్పీడ్‌కి విపక్షాలు బేజార్!
కొత్త జిల్లాలతో తెలంగాణ వైశాల్యమేమీ పెరగదు. కానీ 10 జిల్లాల తెలంగాణ ఇకపై 27 జిల్లాల తెలంగాణగా కొత్త రూపు సంతరించుకోనుంది. సెంటిమెంట్ పరంగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఇదో అడ్వాంటేజ్. తెలంగాణ ఉద్యమంలోనే కెసియార్ జిల్లాల విభజన గురించి ప్రస్తావించారు. ఇప్పుడు ఆయన ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. సరిగ్గా సమయం చూసి, మహారాష్ట్రతో నీటి ఒప్పందాల అంశాన్ని కెసియార్ తెరపైకి తెచ్చారు. మ హారాష్ట్ర నీటి ఒప్పందాల గొడవలో విపక్షాలు ఉండగానే, జిల్లా విభజన వ్యవహారాన్ని […]
పవన్ – అభిమానమా? రాజకీయమా?
పవన్‌కళ్యాణ్ తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ కోసం మైదానాన్ని ఇప్పటికే ఎంచుకోగా, ఆ మైదానం పవన్ అభిమానులకు సరిపోతుందా? అన్న అనుమానాలున్నాయి. పోలీసు సిబ్బంది, తగినంత ఫోర్స్ లేకపోవడంతో సభకు అనుమతి విషయంలో మల్లగుల్లాలు పడింది. అయితే తమ వాలంటీర్లు సభను సజావుగా నిర్వహించేందుకు సహకరిస్తారని పవన్ చేసిన సూచనతో పోలీసులు సభకు అనుమతిచ్చారు. ఎలాగూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పవన్‌కళ్యాణ్ ‘మిత్రపక్షం’ కావడంతో సభకు ఇలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. అయితే అకస్మాత్తుగా పవన్‌కళ్యాణ్ […]