నారాయణ పెత్త‌నంతో టీడీపీ కొంప కొల్లేరేనా..!

ఏపీలో మునిసిప‌ల్ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయ‌ణ త‌న జిల్లాల్లో చ‌క్రం తిప్పుతున్నార‌ట‌! ఈ కామెంట్లు గ‌త కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. మునిసిప‌ల్ శాఖ‌తో పాటు రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలోనూ కీల‌కంగా ఉన్న సీఆర్‌డీఏకి ఉపాధ్య‌క్షుడుగా కూడా నారాయ‌ణ చ‌క్రం తిప్పుతున్న విష‌యం తెలిసిందే. దీంతో అధికారులు అంద‌రూ ఈయ‌న‌కు జీ హుజూర్ అంటున్నారు. అయితే, ఈ ప‌రిణామం ఇప్పుడు విక‌టిస్తోంద‌ని అంటున్నారు టీడీపీ త‌మ్ముళ్లు. ముఖ్యంగా నారాయ‌ణ త‌న సొంత జిల్లా నెల్లూరులో రెచ్చిపోతున్నార‌ని, […]

ఆ విష‌యంలో టీడీపీ సూప‌ర్ హిట్ – వైకాపా అట్ట‌ర్ ప్లాప్‌

రాజ‌కీయ పార్టీ అన్నాక అది ప్రాంతీయ‌మైనా, జాతీయ‌మైనా.. అధినేత‌లు, నేత‌లతోపాటు దిగువ స్థాయిలో జెండా మోసే కార్య‌క‌ర్త‌లూ ఉండాలి! ఈ విష‌యంలో దేశంలోని ఏ పార్టీ విభేదించే అవ‌కాశమే లేదు. వీలు దొరికిన‌ప్పుడల్లా పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేస్తున్నాం అనే మాట‌లు నేత‌ల నుంచి మ‌నకు త‌ర‌చు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో ప‌రిస్థితిని చూసుకుంటే.. ఏకైక విప‌క్షంగా ఉన్న వైకాపా.. 2019లో ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి వ‌చ్చి తీరాల‌ని నిశ్చ‌యించుకుంది. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ […]

తెలంగాణ మంత్రికి ఇంత నిర్ద‌యా..!

మాయ‌మై పోతున్న‌డ‌మ్మా మ‌నిష‌న్న‌వాడు.. మ‌చ్చుకైనా లేడు చూడు మాన‌వ‌త్వం ఉన్న‌వాడు- ఇది తెలంగాణ‌కి చెందిన ఓ క‌వి ఆవేద‌న‌! నానాటికీ మ‌నిషిలో మాన‌వ‌త్వం చ‌చ్చిపోతోంద‌ని, పాపం.. అనే మాట‌ను సైతం మ‌రిచిపోయే ప‌రిస్థితికి మ‌నిషి దిగ‌జారి పోతున్నాడ‌ని క‌వి కార్చిన క‌న్నీటి బిందువులు.. ఇలా అక్ష‌రాలై.. వేద‌న‌ను పంచాయి. ఇప్పుడు ఈ అక్ష‌రాల‌ను నిజం అని నిరూపించారు తెలంగాణ‌కే చెందిన మంత్రి ఒక‌రు. త‌న క‌ళ్ల ముందు ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతున్న వారిని సైతం ప‌ల‌క‌రించేందుకు ఆయ‌నకు మ‌న‌సు […]

ఆ యుద్ధ‌క్షేత్రంపై జ‌గ‌న్ గురి..!

ఏపీ రాజ‌ధాని జిల్లా గుంటూరు ల‌క్ష్యంగా వైకాపా అధినేత జ‌గ‌న్ భారీ ఎత్తున రాజ‌కీయానికి తెర‌దీస్తున్నారా? ఈ జిల్లాను టార్గెట్ చేయ‌డం ద్వారా టీడీపీకి పెద్ద షాక్ ఇవ్వాల‌ని భావిస్తున్నారా? ప‌్ర‌స్తుతం రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం అయిన వైకాపాను జిల్లా మొత్తం విస్త‌రించాల‌ని ప‌క్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారా? అంటే తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఔన‌నే అనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజ‌కీయాల్లో గుంటూరు జిల్లా గుండెకాయ వంటిది. అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు స‌హా మంత్రులు ప‌త్రిపాటి […]

రూ.650 కోట్ల కుంభ‌కోణంలో ఏపీ మంత్రి

ఏపీ మంత్రిపై భారీ ఎత్తున కుంభ‌కోణం ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రూ.650 కోట్ల కుంభ‌కోణంలో మంత్రి గంటా శ్రీనివాస‌రావు కూరుకుపోయార‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ ఆరోపించారు. అంతేకాదు, దీనిని నిరూపించేందుకు త‌మ వ‌ద్ద సాక్ష్యాలు సైతం ఉన్నాయ‌ని ఆయ‌న చెప్ప‌డం రాష్ట్రంలో సంచ‌ల‌న సృష్టిస్తోంది. నిజానికి రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న గంటాపై గ‌తంలోనూ అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. విద్యాశాఖ‌లో బ‌దిలీల సంద‌ర్భంగా పెద్ద ఎత్తున లాబీయింగ్ జ‌రిగింద‌ని, ఉపాధ్యాయులు తాము కోరుకున్న […]

టీడీపీలో దేవినేనిని తొక్కేస్తున్నారా..!

రాజ‌కీయ‌ల్లో తొక్కేయ‌డాలు… అణిచేయ‌డాలు.. జూనియ‌ర్ల‌కే కాదు.. సీనియ‌ర్ నేత‌ల‌కూ ఉంటాయ‌ని చెప్ప‌డానికి తానే ఓ ఉదాహ‌ర‌ణ అని ఇటీవల కాంగ్రెస్ నుంచి చంద్ర‌బాబు చెంత‌కు చేరిన విజ‌య‌వాడ సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌, మాజీ మంత్రి దేవినేని రాజ‌శేఖ‌ర్ ఉర‌ఫ్ నెహ్రూ తెగ ఇదైపోతున్నార‌ట‌!! తాను త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌న‌ని ప‌లుమార్లు చెప్పుకొనే ఆయ‌న‌కు.. కొంద‌రు జూనియ‌ర్లు సెగ పెడుతున్నార‌ట‌. దీంతో ఆయ‌న ఏదో ఆశించి చేరిన టీడీపీలో ఏదీ నెర‌వేర‌డం లేద‌ని నెహ్రూ త‌న అనుచ‌రుల వాపోతున్నారు. కాంగ్రెస్‌లో […]

టీడీపీలోకి వైకాపా మ‌హిళా ఎమ్మెల్యే జంప్‌!

వైకాపా అధినేత జ‌గ‌న్‌కి షాక్ మీద షాక్ త‌గులుతోందా? వైకాపాలో జంపింగ్‌లకు ఇంకా ఫుల్ స్టాప్ ప‌డ‌లేదా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది! వైకాపాలో కీల‌కంగా ఉన్న ఓ మ‌హిళా ఎమ్మెల్యే జంపింగ్ బాట ప‌డుతున్నార‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. వాస్త‌వానికి వైకాపా నుంచి అధికార టీడీపీలోకి జ‌రిగిన జంపింగ్‌లు అంద‌రికీ తెలిసిందే. క్యూ క‌ట్టుకుని మ‌రీ వైకాపా నేత‌లు టీడీపీలోకి వెళ్లిపోయారు. దాదాపు నాలుగు నెల‌ల కింద‌ట జ‌రిగిన ఈ వ‌రుస జంపింగ్‌లు రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర […]

న‌యీం ఆస్తుల రిజిస్ట్రేష‌న్ విలువ ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రంలో చెల‌రేగిపోయి.. అటు పొలిటీషియ‌న్ల‌ని, ఇటు కాంట్రాక్ట‌ర్ల‌ని ముప్పుతిప్ప‌లు పెట్టిన గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీం హ‌త‌మ‌య్యాడు. కానీ, అత‌ను సృష్టించిన నేర‌సామ్రాజ్యం మాత్రం ఇంకా కొన‌సాగుతోంది. ఇక‌, ఈ నేర‌సామ్రాజ్యాన్ని ఆస‌రాగా చేసుకుని న‌యీం సంపాదించిన ఆస్తుల‌పై ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌టన అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. న‌యీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 143 కోట్లట‌! ఈ విష‌యాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వ‌యంగా ప్రకటించారు. ప్ర‌స్తుతం శీతాకాల స‌మావేశాలు […]

వ‌ల్ల‌భ‌నేని వంశీపై వైకాపా ప్రెజ‌ర్‌

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌డం క‌ష్టం. ముఖ్యంగా ఎన్న‌క‌లు స‌మీపిస్తుంటే.. పాలిటిక్స్‌లో వ‌చ్చే మార్పులే డిఫ‌రెంట్‌గా ఉంటాయి. విష‌యంలోకి వెళ్తే.. 2014లో కొంచెం మెజారిటీ తేడాతో అధికార పీఠాన్ని కోల్పోయిన వైకాపా అధినేత జ‌గ‌న్‌.. 2019లో ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి రావాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎన్నిక‌ల‌కు దాదాపు రెండున్న‌రేళ్లు స‌మ‌యం ఉన్నాకూడా ఇప్ప‌టి నుంచే గెలుపు మంత్రి పఠిస్తూ.. గెలుపు అవ‌కాశాల‌పై దృష్టి పెట్టారు. త‌న పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా […]