తమిళనాడు రాజకీయాలు దాదాపు ఇప్పుడు స్తబ్దతలో ఉన్నాయి. మాజీ సీఎం జయ లలిత మృతి. ఆమె స్థానంలో ఆయన అత్యంత విశ్వాసపాత్రుడు పన్నీర్ సెల్వం.. గద్దెనెక్కడం.. తెలిసిందే. అయితే, పన్నీర్ సెల్వం ఆశించినంత దూకుడుగా పాలనను ప్రారంభించలేకపోవడం, ప్రస్తుతం కూడా ఆయన ఆశించిన విధంగా పాలన చేయలేకపోతుండడంపై సర్వత్రా చర్చనడుస్తోంది. నిజానికి ఇప్పుడు రాష్ట్రంలో జయ అంత సమర్ధంగా పాలన సాగడం లేదనే అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరైన టైంలో సరైన నేత అన్నట్టుగా తమిళ […]
Category: Politics
ప్రగతి భవన్.. పార్టీ కార్యాలయమా.. సీఎం గారూ!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు అందరికీ భిన్నంగా కనిపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం అహరహం శ్రమించి బీదా బిక్కీని సైతం ఆకర్షించి.. ఉద్యమం దిశగా నడిచిన నేత.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక.. సీఎం అంటే ఏమిటో చూపిస్తున్నారు. అయిందానికీ, కానిదానికీ.. తన పంతమే నెగ్గాలన్నట్టు వ్యవహరిస్తుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఏదైనా సొంత అభిప్రాయలు ఉంటే.. అవి తన కుటుంబానికో.. తనకో పరిమితం కావాలి. కానీ, కేసీఆర్ అలా చేయడం లేదని అనిపిస్తోంది. తన వ్యక్తిగత అభిప్రాయాలను […]
రేవంత్‌పై ఆంధ్రా టీడీపీ ఫైర్
తెలంగాణ టీడీపీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో తెలంగాణ సర్కారుని ఇరుకున పెట్టే రేవంత్.. తన వాగ్ధాటిని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూనే ఉంటారు. సమయానికి తగ్గట్టుగా ఆయన మాట్లాడుతుంటాడు కూడా. అయితే, ఇటీవల కాలంలో రేవంత్ చేస్తున్న కొన్ని ప్రసంగాలు, కొన్ని డైలాగులు ఆంధ్రా నేతలను ఇరుకున పెడుతున్నాయట. ముఖ్యంగా రాష్ట్ర విభజనకు ముందు ఉన్న వాతావరణాన్నే రేవంత్ ఇంకా కొనసాగిస్తుండడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. […]
మరో అస్త్రంతో వస్తున్న జనసేనాని
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్! అందుకోసమే జనసేన పార్టీ పెట్టానని చెప్పాడు!! చెప్పినట్టుగానే ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమయ్యాడు. టీడీపీ, బీజేపీలకు తొత్తుగా వ్యవహరిస్తున్నాడంటూ విమర్శించిన వారికి.. ఉద్దానం సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి తగిన సమాధానమిచ్చాడు. అంతేగాక ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పుడు ఒంగోలులో మరో పోరాటానికి సిద్ధమవుతున్నాడు. ప్రభుత్వంపై మరో అస్త్రం సంధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ సమస్య […]
చంద్రబాబుకు మోడీ చేసింది తక్కువ… చేయాల్సింది ఎక్కువ
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి మూడేళ్లు కావొస్తోంది. శక్తివంచన లేకుండా శ్రమిస్తూ.. కేంద్రంతో సఖ్యత పాటిస్తూనే ఏపీకి రావాల్సినవన్నీ రాబడుతున్నారు. ఇప్పటికే పోలవరానికి నాబార్డు రుణం ఇచ్చేలా ప్రధాని మోడీపై ఒత్తిడి తెచ్చి సఫలమయ్యారు. అలాగే ముంపు మండలాలను ఏపీలో కలిపేలా చేసే ఆర్డినెన్స్‌ను కూడా తెచ్చేలా చర్చలు జరిపారు. అయితే వీటితోనే అయిపోయిందేమీ లేదంటున్నారు విశ్లేషకులు. మోడీని అడగాల్సినవి, ఆయనతో చేయించాల్సినవి చాలానే ఉన్నాయంటున్నారు. అవేంటో ఒక్కసారి చూద్దాం… కడప జిల్లా పులివెందులలో జరిగిన […]
జగన్ రోల్‌లో పవన్ హిట్
`ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పాత్రను వైసీపీ సమర్థంగా నిర్వహించలేకపోతోంది`.. ఇది చాలా రోజుల నుంచి మంత్రుల నుంచి విశ్లేషకులందరూ చెబుతున్న మాట. అయితే ఈ విమర్శలు తప్పని ఎప్పుడూ నిరూపించలేకపోయారు ప్రతిపక్ష నేత జగన్. అయితే ఇప్పుడు ప్రతిపక్ష పాత్రను జనసేనాని సమర్థంగా నిర్వహిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రజాసమస్యపై పోరాటాలు చేస్తూ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ ఆ సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తున్నారు. అలాగే ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో పోటీకి పక్కా ప్రణాళికతో […]
టీడీపీ కంచుకోటలో ఎన్ని కుమ్ములాటలో
ఏపీ అధికార పార్టీ టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల పదవుల కోసం కుమ్ములాటలు జరుగుతున్నాయి. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలిచిన వారు ఒప్పందం మేరకు రెండున్నరేళ్లలో వేరేవారికి పదవులు అప్పగించాల్సి ఉన్నప్పటికీ.. పదవీ వ్యామోహంతో ఆ ఒప్పందాన్ని తోసిపుచ్చుతున్నారు. దీంతో జిల్లా అంతటా వివాదాలుగా మారింది. జిల్లాలో పలు ఎంపీపీ, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల మార్పు విషయంలో టీడీపీ తమ్ముళ్ల మధ్య రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయంలో రెండున్నరేళ్ల పదవి […]
మంత్రి సుజాతపై బాలయ్య ఫాన్స్ ఫైర్
నటరత్న నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి` ప్రదర్శిస్తున్న థియేటర్ సీజ్ చేయడం ఇప్పుడు రాజకీయంగా వివాదానికి దారితీసింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి పీతల సుజాత ఇందులో చిక్కుకున్నారు. ప్రోటోకాల్ అంశంలో తలెత్తిన వివాదం అనేక మలుపులు తిరిగి రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా పశ్చిమగోదావరిలో ఈ వివాదం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో పీతల సుజాతపై బాలయ్య అభిమానులు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో పండగ ముందు […]
టీఆర్ఎస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
పాలిటిక్స్‌లో ఎవరూ ఎవరికీ శాశ్వత మిత్రులు కారు. శాశ్వత శత్రువులు కారు! అది నేతలు ఒకే పార్టీలో ఉన్నా.. లేక రెండు పార్టీల్లో ఉన్నా. ఇప్పుడు ఇలాంటి వాతావరణమే తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యమాల జిల్లా ఓరుగల్లులో టీఆర్ ఎస్ కీలక నేతలుగా సీఎం కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేసిన ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌లు ఇద్దరూ ఇప్పుడు ఉప్పు నిప్పులా తయారయ్యారట! ప్రజల్లో అభిమానం చూరగొన్న ఇద్దరు […]