పవన్‌కళ్యాణ్‌కు ఇప్పటి వరకు ఏం చేస్తే అదే మీడియాలో వచ్చేది…పవన్ ఇప్పటి వరకు కేవలం సినిమా హీరో మాత్రమే. పవన్‌కు అన్ని వర్గాల్లో క్రేజ్ ఉంది. అయితే పవన్ ఇకపై పూర్తిస్థాయి పొలిటికల్ స్టార్‌గా మారనున్నాడు.. ఈ క్రమంలోనే పవన్ పాలిటిక్స్‌లోకి వస్తే మీడియాలోను అనుకూల మీడియా, వ్యతిరేక మీడియా రెండూ ఉంటాయి. ఈ క్రమంలోనే పవన్ రాజకీయంగా ఎదిగేందుకు పవన్ కూడా అనుకూల మీడియా ఉండాల్సిందన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ ఇప్పుడు […]
Category: Politics
2019లో గ్రేటర్ బరిలో కేటీఆర్…రెండు నియోజకవర్గాలపై కన్ను
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మంత్రి కేటీఆర్ ఎక్కువుగా గ్రేటర్ హైదరాబాద్ మీదే తన ఫోకస్ అంతా పెడుతున్నారు. గ్రేటర్‌లో చిన్న చెత్త సమస్య మీద అయినా కూడా తనకు సోషల్ మీడియాలో ఎవరైనా కంప్లైంట్ చేస్తే చాలు వెంటనే ఆ సమస్య పరిష్కారం అయ్యేలా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మంత్రి కేటీఆర్ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అక్కడ ప్రజలు ఇచ్చిన రిజల్ట్‌కు బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్ 2019 ఎన్నికల్లో గ్రేటర్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ […]
కుడి, ఎడమైన నారాయణ, గంటా ప్లేస్‌లు
ఏపీలో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, నారాయణ ఇద్దరూ స్వయాన వియ్యంకులే. గత ఎన్నికల్లో గంటా పార్టీ మారి భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం గంటాకు మంత్రి పదవి వచ్చింది. నారాయణకు మాత్రం చాలా లక్‌గా కేబినెట్‌లో బెర్త్ దక్కింది. ఆయనకు అప్పటి వరకు ఎన్నికలంటే ఏంటో కూడా తెలియదు. విద్యాసంస్థల అధినేతగా ఉన్న నారాయణ ఒక్కసారిగా మంత్రి అయిపోయారు. నారాయణ మంత్రి అవ్వడం ఆలస్యం…చంద్రబాబుకు […]
మాణిక్యాలరావు మంత్రి పదవికి బీజేపీ ఎమ్మెల్యే ఎర్త్
ఏపీలో ఏప్రిల్ 6న సీఎం చంద్రబాబు తన కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్షాళనలో ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో పాటు కొత్తగా నలుగురైదుగురు కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఐదుగురు మంత్రులకు ఖచ్చితంగా ఉద్వాసన ఉంటుందని కూడా టాక్. ఇదిలా ఉంటే బాబు కేబినెట్‌లో బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులుగా కొనసాగుతున్నారు. వీరిలో కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కామినేని శ్రీనివాస్‌తో పాటు […]
ప్రజాక్షేత్రంలోకి జనసేన .. చివరి రోజున పవన్ బహిరంగ సభ
ఏపీలో 2019 ఎన్నికల్లో పోటీ చేస్తోన్న జనసేన అధినేత పవన్ ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు ప్రజాక్షేత్రంలోకి దూకనున్నాడు. ఈ క్రమంలోనే వివిధ జిల్లాల్లో సమస్యలతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే నాలుగైదు సభలు పెట్టిన పవన్ ఇక ఇప్పుడు సీమలో కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా మీద తన ఫోకస్ పెట్టాడు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఇదే జిల్లాలో ఏదో ఒక నియోజకకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో ఈ జిల్లా మీద రోజు రోజుకు […]
ఎస్పీ ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఒక్కసారిగా యూపీలో బీజేపీ జెండా రెపరెపలాడిన దగ్గర నుంచి..ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు జరుగుతున్నాయి. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం రోజున.. బద్ధ శత్రువులైన ఎస్పీ అధినేత ములాయంసింగ్, ప్రధాని మోదీ చాలాసేపు మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది జరిగిన కొద్దిరోజులకే ములాయం చిన్న కొడుకు, కోడలు పార్టీని వీడతారనే ప్రచారం అక్కడి మీడియాలో జోరందుకుంటోంది. వీరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, ఈ మేరకు బీజేపీ […]
అసెంబ్లీలో టీడీపీ సెల్ఫ్ డిఫెన్స్
ఏపీ అసెంబ్లీలో సభ్యుల మధ్య వింత ధోరణి కనిపిస్తోంది. ఇది వరకు జరిగిన సమావేశాల్లో సభ్యుల మధ్య పరస్పర విమర్శలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు సవాళ్లు, రాజీనామాల వరకూ విషయం వెళ్లింది. అగ్రిగోల్డ్, స్పీకర్ కోడెల వ్యాఖ్యలపై జరిగిన చర్చ ఆసాంతం వాడివేడిగా జరిగింది. ప్రతిపక్ష నేత జగన్, సీఎం చంద్రబాబు మధ్య సవాళ్లు తారస్థాయికి చేరాయి. ఈ విషయంలో జగన్ కొంత పై చేయి సాధించగా.. టీడీపీ మాత్రం కొంత అభద్రతా భావనికి లోనైందని […]
కోడెల మధ్యలో అసెంబ్లీ `సాక్షి`గా టార్గెట్ ..దీని వెనుక వ్యూహం ఏంటి ?
ప్రతిపక్ష నేత జగన్‌కు చెందిన మీడియా సంస్థలపై టీడీపీ తన అధికార దండాన్ని ప్రయోగిస్తోంది. ముఖ్యంగా `సాక్షి`ని టార్గెట్ చేస్తూ.. శాసనసభలో మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి! మహిళా పార్లమెంటు జరుగుతున్న సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇందుకు సాక్షి మీడియాపై చర్చలు తీసుకోవాలని మంత్రుల అసెంబ్లీలో సూచించారు. అయితే ఎప్పుడో జరిగిన విషయాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక కూడా అసలు వ్యూహం వేరే ఉందని తెలుస్తోంది. ఇందులో కోడెలను […]
జగన్ తప్పుడు నిర్ణయం… అక్కడ టీడీపీ గెలుపు పక్క అంటున్న వైసీపీ క్యాడర్
నంధ్యాల ఉప ఎన్నికలో పోటీచేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ నేతలు అయోమయంలో పడిపోతున్నారు. పైకి చెప్పలేక పోయినా.. లోలోపలే తీవ్ర మథన పడుతున్నారు. అంతేగాక ఉన్న కాస్తో కూస్తో క్యాడర్ కూడా టీడీపీ వైపు వెళ్లిపోవచ్చనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక పార్టీకి లాభించక పోగా… నష్టం కలిగించవచ్చని ఆందోళన చెందుతున్నారు. సానుభూతి పవనాలు వీస్తున్న వేళ, టీడీపీ గురించి కాకపోయినా తమ నాయకుడి కుటుంబానికి వ్యతిరేకంగా ఎలా ప్రచారం […]
