చిన్న వయస్సులోనే స్టార్ హీరో అయిన నందమూరి హీరో ఎన్టీఆర్…మూడు పదుల వయస్సు కూడా రాకుండానే పొలిటికల్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. రెండు పదుల వయస్సులోనే సింహాద్రి లాంటి బ్లాక్‌బస్టర్ మూవీతో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ తర్వాత 2009లో టీడీపీకి ప్రచారంలో స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు అటు నందమూరి ఫ్యామిలీతోను, ఇటు నారా ఫ్యామిలీతోను గ్యాప్ వచ్చింది. రాజకీయంగా తన కొడుకు లోకేశ్‌కు ఎన్టీఆర్ పోటీ వస్తాడని చంద్రబాబు, ఇటు సినీరంగంలో […]
Category: Politics
లోకేశ్ అడిగారు….బాబు ఇచ్చారు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌కు జరిగినంత సులువుగా ఏ వారసుడి పొలిటికల్ ఎంట్రీ జరగదేమో..? చట్టసభల్లోకి ఎమ్మెల్సీగా ఎంట్రీ ఇచ్చిన లోకేశ్ మూడు రోజులకే ఏకంగా కేబినెట్ మంత్రి అయిపోయాడు. వడ్డించే వాడు మనవాడైతే వరుసలో ఎక్కడ కూర్చున్నా ఒక్కటే అన్న సూత్రం లోకేశ్‌కు నూటికి నూరుశాతం వర్తిస్తుంది. కేవలం చంద్రబాబు కుమారుడు అన్న ఒక్క అండతోనే లోకేశ్ ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా మంత్రి అయిపోయాడు. ఇక కేబినెట్‌లోకి వచ్చిన […]
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్: కలువపూడి శివ – ఉండి
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాలమ్‌లో భాగంగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు (కలువపూడి శివ) ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. ఉండి నుంచి 2009లోను, 2014లోను వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ఏంటి ? శివకు అక్కడ ఉన్న అనుకూల, వ్యతిరేకాంశాలేమిటో చూద్దాం. తననియోజకవర్గంలో రైతులు కరెంటు బాధలతో బాధపడుతుంటే మండుటెండలో కంకరరాళ్ల మీదే సబ్‌స్టేషన్ ముందే బైఠాయించాడు. […]
కొత్త మంత్రికి ఎమ్మెల్యేల సహాయ నిరాకరణ
కొత్తగా మంత్రి బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు సరికొత్త సమస్యలు ఆహ్వానిస్తున్నాయి . వేరే పార్టీ నుంచి వచ్చి.. మంత్రి పదవులు పొందిన వారి జిల్లాల్లో వారికి ఎమ్మెల్యేల నుంచి ఏ మేరకు సహాయం అందుతుందోననే చర్చ ఇప్పుడు తీవ్రమైంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఇది నివురుగప్పిన నిప్పులా మారింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి సుజయ కృష్ణ రంగారావు మంత్రి ఎంపికవగా.. ఆయన ముందు ఇప్పటికే అనేక సమస్యలు సవాలు విసురుతున్నాయి. గతంలో మృణాళిణి.. ఇప్పుడు కృష్ణకు […]
గోదావరి జిల్లాల్లో చేతులు ఎత్తేసిన వైసీపీ
తూర్పుగోదావరి జిల్లాలో బలపడాలని భావిస్తున్న వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో నాయకత్వ సమస్యలు పార్టీని వెంటాడుతున్నాయి. కీలక నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్ నాయకత్వంపై శ్రేణులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, సొంత సామాజికవర్గం గల వార్డుల్లో ఓటమి చెందడం.. ఇవన్నీ ఆయన నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇక వైసీపీలో పిల్లి బోస్ పని అయిపోయిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సుభాష్‌చంద్రబోస్ శల్యసారథ్యంలో స్వంత నియోజకవర్గం రామచంద్రపురంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ […]
2019: టీడీపీ+బీజేపీ+జనసేన పొత్తు
సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన మంత్రి అయ్యన్నపాత్రుడు.. మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా ? జనసేన ఈసారి టీడీపీ-బీజేపీతో కలుస్తుందా? అనే సందేహాలు ఇప్పటివరకూ అందరిలోనూ ఉన్నాయి. వీటన్నింటికీ సమాధానం ఇస్తూ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? పవన్ అడిగినన్ని సీట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పుకుంటారా? అనే ప్రశ్నలు […]
అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు ఇక.. అజిత్‌వేనా?!
తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టించి, రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుని అనారోగ్యంతో మృతి చెందిన సీఎం జయలలిత ఉరఫ్ పురిచ్చితలైవి..పార్టీ అన్నాడీఎంకే ప్రస్తుతం నాయకత్వ లేమితో సతమతమవుతోంది. జయ నెచ్చెలి శశికళ అనూహ్య పరిస్థితుల్లో జైలు పాలు కావడం, నమ్మినబంటు పన్నీర్ సెల్వం పూర్తిగా పార్టీ నుంచి విడిపోయి.. అన్నాడీఎంకే(అమ్మ) పేరుతో సొంత కుంపటి పెట్టుకోవడంతో ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీలో నాయకత్వ సంక్షోభం తారస్థాయికి చేరుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా హీరో అజిత్ పేరు మరోసారి […]
టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందా..?
తన తర్వాత సీఎం పీఠం కొడుకు, లేదా కూతురికి అప్పగిస్తున్న వారే ఎక్కువమంది కనిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో ఈ వారసత్వ రాజకీయం ప్రధానంగా మారిపోయింది. సీఎం పీఠానికి ఎవరైనా అడ్డొస్తున్నారని తెలిస్తే.. వారిని వెంటనే పక్కకు తొలగించేస్తున్న రోజులివి. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే పద్ధతి కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు చూసిన వారంతా ఇదే చెబుతున్నారు. మేనల్లుడు హరీశ్‌రావు ప్రాధాన్యం తగ్గించి.. కొడుకును వీలైనంతగా ప్రొజెక్టుచేయాలని చూస్తున్నారు కేసీఆర్. అంతేగాక వీలైనంతగా ప్రజల్లో పట్టు […]
ఫ్యామిలీ విషయంలో పవన్ – తారక్ ఒకటేనా..!
వాళ్లిద్దరూ పెద్ద కుటుంబాలకు చెందినవారు. ఒకరు సినీ హీరోగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. మరొకరు రాజకీయం, సినీ నేపథ్యం కలగలసిన వారు! కానీ విచిత్రంగా వీరు ఇద్దరూ ఒకే విధంగా అడుగులేస్తున్నారు. పరిస్థితులు ఇద్దరినీ వారివారి కుటుంబాల నుంచి దూరం నెట్టేశాయి. వారు మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్! ఇప్పుడు ఏపీలో వీరి గురించే చర్చ మొదలైంది. వీరిని గమనిస్తే..ఇద్దరిలోనూ చాలా కామన్ పాయింట్లే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో బలమైన […]
