నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం ముగిసేందుకు మరో వారం రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈ టైంలో అధికార టీడీపీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక్కడ భూమా ఫ్యామిలీని టార్గెట్ చేసేందుకు టీడీపీలోనే కొందరు తెరవెనక మంత్రాంగం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నంద్యాలలో భూమా ఫ్యామిలీ పాగా వేయడం టీడీపీలోనే కొందరికి నచ్చడం లేదు. వాళ్లు ఇక్కడ పాగా వేస్తే తమ రాజకీయ ఉనికికి ఇబ్బంది వస్తుందని, తమకు పదోన్నతి ఉండదని టీడీపీలోని కొన్ని […]
Category: Politics
కాపులకు రిజర్వేషన్ అక్కర్లేదు.. చినరాజప్ప స్టేట్‌మెంట్!
రిజర్వేషన్ కోసం కాపులు భారీ ఎత్తున ఉద్యమిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందుకు చంద్రబాబు కాపులను బీసీల్లో చేరుస్తానంటూ పెద్ద హామీ ఇచ్చారు. దీని అమలు కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అనేక ఉద్యమాలకు పిలుపు కూడా ఇచ్చారు. ఇలా కాపు రిజర్వేషన్ కోసం రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే… అదే సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాత్రం ఉన్నట్టుండి డిఫరెంట్ ప్రకటన చేసేశారు. […]
టీడీపీ-వైసీపీ మధ్యలో నలుగుతోన్న మహేశ్
ఇటీవల విడుదలైన సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పైడర్ టీజర్ దుమ్మురేపుతోంది. ఈ సినిమా కంప్లీట్ చేసి.. త్వరగా కొరటాల శివ డైరెక్షన్లో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు సూపర్ స్టార్! అయితే రాజకీయాలు, వివాదాలు ఎప్పుడూ దూరంగా ఉండే మహేశ్‌కు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. సినిమాల విషయంలో అని కంగారు పడకండి.. రాజకీయాలకు సంబంధించి!! అటు బావ, ఇటు బాబాయ్ ఎవరు ముఖ్యమో తేల్చుకోలేని సందిగ్థంలో పడిపోయాడట మన ప్రిన్స్!! టాలీవుడ్‌లో మహేశ్ క్రేజ్ అంతా […]
కాకినాడ కార్పొరేషన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్…. వెనక వాళ్ళ హస్తం..!
ఏపీలో రెండు ఎన్నికలు రాజకీయాన్ని పూర్తి రసకందాయంగా మార్చేశాయి. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికతో పాటు కాకినాడ కార్పొరేషన్‌కు జరుగుతోన్న ఎన్నికలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ట్రెండింగ్‌గా మారాయి. నంద్యాల కీలకం కావడంతో ఏపీ కేబినెట్ మొత్తం చాలా వరకు అక్కడే కేంద్రీకృతమైంది. ఇక కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా గెలిచి రావాలని చంద్రబాబు జిల్లా మంత్రులకు, పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే కాకినాడ కార్పొరేషన్‌లో నిన్నటి వరకు అటు అధికార […]
పాలిటిక్స్‌లోకి దిల్ రాజు.. కేసీఆర్ ఆఫర్ ఇదేనా!
సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు రంగాలకు బలమైన అనుబంధం ఉంది. ఇక తమిళ్‌లో కంటే తెలుగులో మరింత బలమైన బంధం వీటి మధ్య ఉంది. ఇక టాలీవుడ్‌లో చాలా మంది నిర్మాతలు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో నిర్మాతలు చాలామంది ఉన్నా సెలబ్రిటీ నిర్మాతలు […]
నంద్యాల ఉప ఎన్నిక బరిలో శిల్పా ప్రధాన అస్త్రం
భూమా ఫ్యామిలీపై ఉన్న సెంటిమెంట్ ప్రధాన అస్త్రంగా టీడీపీ నంద్యాల ఉప ఎన్నిక బరిలోకి దిగబోతోంది! అంతేగాక మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు.. ఇలా టీడీపీ బలగమంతా నంద్యాలలోనే మోహరించేశారు. కానీ వైసీపీ అభ్యర్థి శిల్పా మాత్రం తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. విజయం తనవైపే ఉంటుందని నమ్మకం పెట్టుకు న్నారు. ప్రజలు సెంటిమెంట్ కంటే.. అనుబంధానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారని బలంగా విశ్వసిస్తున్నారు. గతంలో చిన్న చిన్న తప్పిదాల వల్ల ఓడిపోయినా.. ఈసారి మాత్రం […]
బీజేపీని వదిలించుకునే యత్నాల్లో బాబు
నంద్యాల ప్రచారం చివరి దశకు చేరుకున్నా.. ఇప్పటికీ మిత్రపక్షమైన బీజేపీ ప్రచారంలో కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. వీటికి తెరదించాలని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్న నేతల్లో మరోసారి విభేదాలు వచ్చేలా చేస్తోంది. వైసీపీతో జత కట్టేందుకు బీజేపీ నేతలు సుముకత వ్యక్తంచేస్తున్న తరుణంలో.. టీడీపీ అధినేత ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక.. ఏదో మతలబు ఉందని బీజేపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి బీజేపీని వదిలించుకునే భాగంలో.. […]
వైసీపీ వాసనలు పోగొట్టుకోని టీడీపీ ఎంపీ
నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున భూమా, శిల్పా వర్గాల మధ్యే తీవ్ర పోటీ జరిగిందనే విషయం తెలిసిందే! కానీ ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున కర్నూలు ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నించారనే అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కూతురికి ఆ టికెట్ ఇవ్వాలని ఆయన సీఎంను కోరడం.. ఆయన ససేమిరా అనడం ఇవన్నీ జరిగిపోయాయట. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి.. కొద్ది కాలంలోనే టీడీపీ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకూ […]
కేసీఆర్‌కి సరైన మొగుడు ఈయనేనా?
తెలంగాణలో తనకు తిరుగులేదని భావిస్తున్న సీఎం కేసీఆర్ కు మొగుడు రెడీ అయ్యాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం సహా ఇటు మాస్ అటు క్లాస్ ఇమేజ్ ఉన్న ప్రొఫెసర్ కోదండ రాం ఇప్పుడు కేసీఆర్‌కు మొగుడుగా మారారు. రాష్ట్రంలో విపక్షాలు చేయలేని పని ఇప్పుడు ఏ పార్టీకీ చెందని కోదండరాం చేస్తున్నారు. కేసీఆర్ నిత్యం నెత్తిన కుంపటిలా తయారయ్యాడు ఈయన. కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కోదండరాం ఉద్యమానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో […]