పురందేశ్వ‌రిలో మార్పు వెన‌క మ‌రిది మీద ప్రేమ ఉందా..లేదా..!

ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి! అన్న ఎన్టీఆర్ కుమ‌ర్తె అయినా.. త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొందిన నాయ‌కురాలు. ప‌రుచూరు నుంచి రాజ‌కీయాల్లో ప్ర‌వేశించిన ఈమె.. త‌న‌కంటూ ప్ర‌త్యేక ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకున్నారు. అన్న‌గారు మ‌ర‌ణించే వ‌ర‌కు ఆమె భ‌ర్త ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు క్రియాశీల‌క రాజ‌కీయాల్లో చురుగ్గా ఉండ‌గా, ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో ఆయ‌న తెర‌మ‌రుగ‌య్యారు. ముఖ్యంగా టీడీపీలో జ‌రిగిన కొన్ని కీల‌క ప‌రిణామాల విష‌యంలో క‌ల‌త చెందిన పురందేశ్వ‌రి.. ఆ పార్టీ త‌న తండ్రి స్థాపించిన‌దే అయిన‌ప్ప‌టికీ.. […]

ఆమ్ర‌పాలి ఓ యూత్ ఐకాన్‌… ఏం చేసినా అంత క్రేజ్ ఏంటో

ఆమ్ర‌పాలి.. ఆమ్ర‌పాలి.. ఇప్పుడు ఈ పేరు సోష‌ల్ మీడియాలో మారుమోగుతోంది. ఏకంగా ఆమ్ర‌పాలి చేతిలో వినాయ‌కుడిని పెట్టిన‌ట్లు ఉండే విగ్ర‌హం ప్ర‌తిష్ఠించారంటే.. అర్థం చేసుకోవ‌చ్చు ఆమె ఎంత‌టి పాపులరో! ఇలాంటి వ‌న్నీ ఎక్క‌డో త‌మిళ‌నాడులో చూస్తుంటాం. సినీ న‌టులకో, రాజ‌కీయ నాయ‌కుల‌కో ఇలాంటివి చేశార‌ని వింటుంటాం! కానీ ఆమె వీట‌న్నింటికీ అతీతం. ఆమె ఒక యూత్ ఐకాన్‌! ఆమె చీర కట్టినా న్యూసే.. మోడ్ర‌న్ డ్రెస్ వేసినా న్యూసే!! అన‌తి కాలంలోనే ఆమె ఇంత పాపుల‌ర్ అవ‌డానికి […]

జ‌గ‌న్‌పై బాబు డైలాగుల‌ బ్ర‌హ్మాస్తం! 

త‌ల‌త‌న్నేవాడు ఒక‌డుంటే.. వాడి తాడి త‌న్నేవాడు మ‌రొక‌డు ఉంటాడు! అది రాజ‌కీయాలైనా.. మ‌రొక‌టైనా ఒక్క‌టే ఫార్ములా. దీనిని తూ.చ‌. పాటిస్తున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొనేందుకు ప‌దునైన అస్త్రాలు ప్ర‌త్యేకంగా ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఎదుటివారి మాట‌లు, వారి చేత‌లే వారికి బ్ర‌హ్మాస్త్రాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నిరూపించారు చంద్ర‌బాబు. ముఖ్యంగా జ‌గ‌న్ వంటి.. జుట్టు చేతికి ఇచ్చి.. కాళ్లు గెంతులేసే టైపు వారైతే.. బాబుకి మ‌రీ పండ‌గ‌! విష‌యంలో వెళ్తే.. మొన్న నంద్యాల ఉప ఎన్నిక ముగిసింది. […]

మంత్రిగారు బాబును టెన్ష‌న్ పెడుతున్నారు ఎందుకు..!

మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి దూకుడు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుకు ఎప్ప‌టిక‌ప్పుడు చిక్కులు తెచ్చి పెడుతోంది. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ అండ్ కో పై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డిన ఆయ‌న‌.. మంచి మార్కులే కొట్టేశారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు.. మాత్రం ఇప్పుడు టీడీపీని ఇబ్బందుల్లో ప‌డేస్తున్నాయి. ఇప్ప‌టికే నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో 80శాతానికి పైగా పోలింగ్ న‌మోద‌వ‌డంతోనే అంతా ఏమవుతుందో అని ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ స‌మ‌యంలో.. సోమిరెడ్డి […]

ద‌మ్మున్న ప‌త్రిక‌లో `తిక్క‌` క‌థ‌నం

ద‌మ్మున్న ప‌త్రిక‌గా పాపులారిటీ సంపాయించాల‌ని చూసే ఆ మీడియా సంస్థ‌పై ఇప్పుడు పైవిధంగానే కామెంట్లు వినిపిస్తున్నాయి. స‌ద‌రు సంస్థ వెబ్‌సైట్‌లో పైత్య‌పు రాత‌ల‌కు త‌మ క‌ళ్లు తిరుగుతున్నాయ‌ని అంటున్నారు పాఠ‌కులు. త‌న రాత‌ల‌తో దుమ్ము రేపుతాన‌ని ప‌దే ప‌దే చెప్పే.. స‌ద‌రు ద‌మ్మున్న ప‌త్రిక ఎండీ ఇప్పుడు రోత పుట్టిస్తున్నాడ‌ని చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల కాలంలో అత్యంత ప్ర‌చారంలో ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఈయ‌న త‌న పార్టీ జ‌న‌సేన ద్వారా చ‌ర్చ‌కు దారితీశాడు. దీనిని […]

మ‌రో మోసానికి తెర‌లేపిన బీజేపీ

ప్ర‌త్యేక‌హోదా అని త‌ర్వాత ప్యాకేజీని ప్ర‌క‌టించి న‌మ్మించి మోస‌గించిన కేంద్రం.. మ‌రోసారి ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్టేందుకురెడీ అవుతోంది. కేంద్ర‌మంత్రి ప‌ద‌వికి వెంక‌య్య రాజీనామా చేసిన తర్వాత‌.. ఆ స్థానంలో ఎవ‌రిని నియ మించాల‌నే అంశంపై గ‌ట్టిగానే చర్చ జ‌రుగుతోంది. దీనిపై అటు టీడీపీ, ఇటు బీజేపీ కూడా ప్ర‌య‌త్నాలు తీవ్ర‌త‌రం చేస్తున్నాయి. మెత్త‌గా కొట్టి.. నొప్పి త‌గ్గ‌డానికి ఆయింట్‌మెంట్ రాసిన చందంగా.. వ్య‌వ‌హ‌రించాల‌ని బీజేపీ పెద్ద‌లు వ్యూ హాలు ర‌చిస్తున్నార‌ట‌. ముఖ్యంగా విశాఖ‌కు రైల్వే జోన్ […]

కాకినాడపై ముద్రగడ ప్రభావం ఎంత? 

తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ కార్పొరేషన్‌లోని 48 వార్డుల‌కు ఈ నెల 29న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దాదాపు ఏడేళ్ల త‌ర్వాత జరుగుతున్న ఈ ఎన్నిక‌ల‌పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా త‌మ‌ది అభివృద్ధి అజెండా అని ప‌దే ప‌దే చెబుతున్న టీడీపీ , సీఎం చంద్ర‌బాబు, లేదు రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని గ‌ర్జిస్తున్న వైసీపీ, దాని అధినేత జ‌గ‌న్‌కు ఈ ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. మ‌రోప‌క్క‌, ఇదే జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, మాజీ […]

త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాటీడీపీ నేత‌లు…ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

నంద్యాల ఉప ఎన్నిక ఆది నుంచి అంతం వ‌ర‌కు అనేక ట్విస్టులు, ఉత్కంఠ‌లు, కేసుల న‌మోదు వంటి అనేక అంశాల చుట్టూ తిరిగి.. ఆ నియోజ‌క‌వ‌ర్గాన్నే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎల్లుండే ఈ ఎన్నిక ఫ‌లితం వెల్ల‌డి కానుండ‌డంతో మొత్తం ప్ర‌క్రియ‌కు ఆరోజుతో ఫుల్ స్టాప్ ప‌డుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఇక‌, సోమ‌వారం నాటి లెక్క‌ల‌పై పోలింగ్ ముగిసిన మ‌రుక్ష‌ణం నుంచే బెట్టింగులు మొద‌ల‌య్యాయి. మా అభ్య‌ర్థి గెలుస్తాడంటే.. మా వాడే గెలుస్తాడంటూ.. పెద్ద […]

కాకినాడ‌లో టీడీపీకి క‌ష్టాలు

ఏపీలో నెల రోజులుగా జ‌నాల కాన్‌సంట్రేష‌న్ అంతా నంద్యాల ఉప ఎన్నిక‌మీదే ఉంది. నంద్యాల‌లో టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహోరీ ప్ర‌చారం సాగినా పోలింగ్ ముగిశాక అధికార‌ పార్టీకి కాస్త ఎడ్జ్ ఉన్న‌ట్టు స‌ర్వేలు చెపుతున్నాయి. ఇక నంద్యాల ఫ‌లితం తేల‌డం ఒక్క‌టే మిగిలి ఉంది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి ఏపీలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావ‌రి జిల్లా కేంద్ర‌మైన కాకినాడ కార్పొరేష‌న్‌కు జ‌రుగుతోన్న ఎన్నిక‌ల‌పైనే ఉంది. ఏపీలో ఈ మూడేళ్ల‌లో జ‌రుగుతోన్న మేజ‌ర్ […]