చంద్ర‌బాబు జోరు… జ‌గ‌న్ బేజారు!

ఏపీలోని రెండు ప్ర‌ధాన పార్టీలు అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీల మ‌ధ్య ఇప్పుడు విచిత్ర వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అధికార పార్టీ సాధార‌ణంగా జోరు మీదుండ‌డం స‌హ‌జం. అయితే, ఇప్పుడు ఆ పార్టీ జోరుతో పాటు మ‌రింత హుషారుగా కూడా ఉంది. ముఖ్యంగా మొన్న జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఫ‌లితాల అనంత‌రం టీడీపీలో పెద్ద ఎత్తున కొత్త ఆక్సిజ‌న్ అందింది. దీంతో అధినేత చంద్ర‌బాబు స‌హా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా చాలా […]

వైఎస్ ఫ్యామిలీ వీరాభిమాని సైకిల్ ఎక్క‌డం ఖాయ‌మైందా..!

వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడు, వీరాభిమాని స‌బ్బం హ‌రి గురించి అనూహ్య‌మైన వార్త ఒక‌టి హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఆయ‌న త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకుని బాబు గూటికి చేరిపోతార‌ని అంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. నిజానికి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ నామ‌రూపాలు లేకుండా పోవ‌డంతో మౌనంగా ఉండిపోయారు హ‌రి. 2009లో అప్ప‌టి సీఎం వైఎస్ ప‌ట్టుబ‌ట్టి హ‌రికి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నార‌ని ప్ర‌చారంలో ఉంది. అందుకే ఆయ‌న వైఎస్ అన్నా ఆయ‌న ఫ్యామిలీ అన్నా ఎంతో […]

అప్పుడు తండ్రులు..  ఇప్పుడు వార‌సులు.. ఫైటింగ్ సేమ్‌!! 

అనంపురం రాజ‌కీయాల్లో పాత సీన్లే.. ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. గ‌తంలో ఏళ్ల త‌ర‌బ‌డి జ‌రిగిన ఘ‌ట‌న‌లే ఇక‌పైనా జ‌ర‌గ‌నున్నాయి. క‌థ మార‌లేదు కానీ.. క‌థ‌న‌మూ మార‌లేదు.. కేవలం హీరోలే మారారు అంతే! ఆధిప‌త్య‌మే అప్పుడు, ఇప్పుడు ప్ర‌ధాన టాపిక్‌. రాజ‌కీయ‌మే మెయిన్ స్టోరీ అప్పుడు ఇప్పుడు! కాక‌పోతే.. తండ్రుల ప్లేస్‌లో వార‌సులు అంతే!! దీంతో మ‌రోసారి అనంత‌పురం రాజ‌కీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీశాయి. విష‌యంలోకి వెళ్తే.. అనంత‌పురం జిల్లాలో రెండు ప్ర‌ధాన పార్టీలు ఆధిప‌త్య పోరు […]

బాల‌య్య వార్నింగ్‌: క‌లిసి ఉండండి.. లేదంటే వెళ్లిపోండి

ముక్కుసూటిగా మాట్లాడ‌టం, వ్య‌వ‌హ‌రించ‌డంలోనూ సినీన‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణకు ఎవ‌రూ సాటిరారు! సినిమాల్లో అయినా రాజ‌కీయాల్లో అయినా ఇదే పంథాను కొన‌సాగిస్తున్నారు! అటు సినిమాలు, ఇటు రాజ‌కీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వ‌స్తున్నాడు బాల‌య్య‌! కొంత కాలం నుంచి హిందూపురం నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు మ‌ళ్లీ రాజకీయాల‌పై దృష్టిసారించారు. వ‌స్తూ వ‌స్తూనే నియోజ‌క‌వ‌ర్గంలోని క్యాడ‌ర్ మ‌ధ్య‌ నెల‌కొన్న గ్రూప్ త‌గాదాలపై సీరియ‌స్ అయ్యాడు. ఉంటే క‌లిసి క‌ట్టుగా ఉండాల‌ని సూచించాడు! లేకుండే వెళ్లిపోవాల‌ని ఘాటుగా వార్నింగ్ […]

కేసీఆర్‌, క‌విత‌ మాయ‌లో.. ప‌ద‌వులు పోగొట్టుకున్న మంత్రులు 

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, ఆయ‌న త‌న‌య నిజామాబాద్ ఎంపీ కల్వ‌కుంట్ల క‌విత‌ల‌పై ఓ ఇద్ద‌రు కేంద్ర మంత్రుల‌కు చెందిన అనుచ‌రులు తెగ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ తండ్రీ కూతుళ్ల కారణంగా మంత్రులు ప‌ద‌వులు పోగొట్టుకున్నార‌ని ఆరోపిస్తున్నారు. వీరి ధ‌న దాహానికి, వ్యూహ ప్ర‌తివ్యూహాల‌కు ఆ మంత్రులు బ‌ల‌య్యార‌ని అంటున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ‌లో రాజ‌కీయం స‌ర‌వ‌త్త‌రంగా మారింది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ విష‌యంపైనే చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఆ విష‌యం ఏంటో మ‌నంకూడా […]

బాబుపై తెలుగు త‌మ్మ‌ళ్ల గ‌రంగ‌రం

అధికార టీడీపీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. త‌మ్ముళ్ల‌కు కంటిపై కునుకు కూడా ఉండ‌డం లేదు. 2019 ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర పైగా స‌మ‌యం ఉండ‌గానే వాళ్ల‌లో పెద్ద ఎత్తున ఆందోళ‌న క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము గెలుస్తామో లేదో.. ప్ర‌జ‌లు మ‌ళ్లీ ఆద‌రిస్తారో లేదో.. అనే ఆందోళ‌న క‌న్నా అధినేత త‌మ‌ను అక్కున చేర్చుకుంటారా? లేదా? అనే దిగులే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేల‌ను ఏదో ఒక రూపంలో హ‌డావుడికి గురి చేస్తున్న టీడీపీ అధినేత, […]

కేసీఆర్ ఫ్యామిలీ మ‌రో వార‌సుడు… ఆ నియోజ‌క‌వ‌ర్గం క‌న్‌ఫార్మ్‌

టీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబ పెత్త‌నం ఎక్కువైంద‌న్న విమ‌ర్శ‌లు విప‌క్షాల నుంచి పెద్ద ఎత్తునే ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉంటే ఆయ‌న కుమార్తె క‌విత నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఇక ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ మంత్రిగా ఉంటే, మేన‌ళ్లుడు హ‌రీష్‌రావు సైతం మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ స‌మీప బంధువు బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ క‌రీంన‌గ‌ర్ ఎంపీగా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్ర‌భుత్వంలో వీళ్ల‌దే పెత్త‌నం. ఇక వీళ్ల‌కు తోడు ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మ‌రో వార‌సుడు పొలిటిక‌ల్ ఎంట్రీ […]

నంద్యాల ఉప ఎన్నిక అత‌డి ప్రాణం తీసింది

ఏపీలో అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ మ‌ధ్య ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక ఓ వ్య‌క్తి ప్రాణం తీసింది. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుస్తుందా ? వైసీపీ గెలుస్తుందా ? అన్న‌దానిపై మాటా మాటా పెరిగి ఇద్దరు వ్యక్తులు బెట్టింగ్ కాశారు. కానీ ఇక్కడ మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండి మండలం మహదేవపట్నంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంటా సూర్యనారాయణ (55) కూలి […]

నంద్యాల ఫ‌లితం త‌ర్వాత‌…. పీకే-జ‌గ‌న్ మ‌ధ్య ఏం జ‌రిగింది

నంద్యాల ఉప ఎన్నికకు ముందు వ‌ర‌కు వైసీపీ ఎన్నికల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ పేరు ఓ రేంజ్‌లో మార్మోగింది. నార్త్‌లో ప్ర‌ధాన‌మంత్రి మోడీ నుంచి ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో వ్యూహ‌క‌ర్త‌గా స‌క్సెస్ ఫుల్ రిజ‌ల్ట్ ఇచ్చిన పీకే ఏపీలో వైసీపీకి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా రావ‌డంతో అంద‌రి దృష్టి ఆయ‌న‌మీదే ఉంది. ఆయ‌న వ్యూహాలు ఇక్క‌డ కూడా వైసీపీకి ప‌ని చేస్తాయ‌న్న న‌మ్మ‌కంతో చాలా మంది ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో పీకే త‌న వ్యూహాలు అమ‌లు చేశారు. […]