యూపీలో ‘పవర్‌’ పాలిటిక్స్‌

ఉత్తర ప్రదేశ్‌లో 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎవ్వరూ ఊహించని విధంగా యోగీ ఆదిత్యనాథ్‌ సీఎం అయ్యారు. మోదీ, అమిత్‌ ఆశించినట్లే యోగి యూపీలో చక్రం తిప్పుతున్నాడు. వచ్చే సంవత్సరం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికార పీఠం కోసం అధికారపార్టీతోపాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా పక్కా ప్లాన్‌ రూపొందించుకుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ యూపీకి పలుసార్లు వెళ్లి వచ్చారు. అధికార కార్యక్రమాలే అయినా పార్టీ శ్రేణుల్లో ఆయన పర్యటన జోష్‌ […]

కమ్మపెద్దలారా.. తలశిల చేసిన తప్పేంటి?

కులబహిష్కరణకు గానీ, తనను చంపడానికి ఎవరో సుపారీ ఇచ్చారన్న బెదిరింపునకు గానీ తాను భయపడలేదని.. తనను భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదని వల్లభనేని వంశీ చాలా డాబుగా అన్నారు. కానీ ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. కమ్మ కుల పెద్దలు తీసుకున్న కులబహిష్కరణ నిర్ణయమే.. ఆయన మెడలు వంచినట్లుగా అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల కిందట హైదరాబాదులో కమ్మకుల సమావేశం జరిగింది. సహజంగానే ఇటీవలి పరిణామాల గురించి ఈ సమావేశంలో చర్చ కూడా జరిగింది. […]

సర్కారు ఉద్యోగుల సమ్మె బాట

ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సమస్య తీవ్రమైంది. నిధుల కోసం రాష్ట్రం అన్ని దారులనూ వెతుకుతోంది. ఎక్కడ అవకాశముంటే అక్కడ తీసుకుంటోంది. ఆర్థిక మంత్రి బుగ్గన ప్రతినెలా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. ఎన్ని కోట్ల రూపాయలు డబ్బు వచ్చినా అంతా సంక్షేమ పథకాలకే సరిపోతోంది.. నవరత్నాల్లో భాగంగా ప్రారంభించిన పలు పథకాలకు నిధులు సమకూర్చలేక ఆర్థికశాఖ అవస్థలు పడుతోంది. ఈ ప్రభావం మొత్తం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లపై పడింది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు […]

సరే అనలేక.. సారీ అనలేక…

తెలంగాణ ముఖ్యమం‍త్రి, టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌కు ఇపుడు పెద్ద చిక్కొచ్చి పడింది. విద్యత్‌ చార్జీలు, బస్సు చార్జీల పెంపు వ్యవహారం కేసీఆర్‌ టేబుల్‌ మీదకు వచ్చింది. రాష్ట్రంలో అనేక రోజులుగా ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. దీంతో ఆయా సంస్థలు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. చార్జీలు పెంచకపోతే సంస్థల మనుగడ కష్టమవుతుందని ఇప్పటికే అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై కేసీఆర్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బస్సు, విద్యుత్‌ చార్జీలు పెంచేవిషయంలో సీఎం […]

ఒకచోట వసూలు.. మరోచోట రద్దు

ఓటీఎస్.. వన్ టైం సెటిల్మెంట్.. ఇటీవల మీడియాలో కనిపిస్తున్న పదం ఇది.. ముఖ్యంగా ఏపీ మీడియాలో ఓటీఎస్ గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది.. ఏమిటీ ఓటీఎస్ అంటే.. ఏపీ హిసింగ్ బోర్డు నుంచి రుణాలు తీసుకొని ఇళ్లు నిర్మించుకొని ఆ తరువాత బకాయిలు లక్షలాది మంది చెల్లించలేదు. అవి అలాగే పేరుకుపోయాయి.. ఇప్పట్లో ఎవరూ చెల్లించే పరిస్తితి కూడా లేదు.. అందుకే ప్రభుత్వం కాస్త డిఫరెంటుగా ఆలోచించి.. తీసుకున్న మొత్తం లబ్ధిదారులు ఎలాగూ కట్టే పరిస్థితి లేదు.. […]

ఎన్టీఆర్ యూనివర్సిటీపై జగన్ కన్ను?

ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం.. ప్రముఖ యూనివర్సిటీ..విజయవాడలోని ఈ ప్రముఖ విద్యాసంస్థ నిధులపై ప్రభుత్వ కన్ను పడింది.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పథకాలకు నిధుల సమస్య ఏర్పడటంతో నిధి సమీకరణలో ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా వర్సిటీకి చెందిన కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వర్సిటీ బ్యాంకు అకౌంట్లలో దాదాపు రూ.250 కోట్ల నిధులున్నాయి. అవన్నీ ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి […]

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు యాత్ర మళ్లీ మొదలు!

తెలంగాణలో అధికారమే లక్ష్యగా పార్టీని ప్రారంభించి రాజకీయ కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేసీఆర్ ను విమర్శించడంలో ముందున్నారు. నిరుద్యోగులకు మద్దతుగా ముందునుంచీ పోరాడుతూ వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఉద్యోగాలు రాక నిరాశచెంది ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు..ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బాధిత కుటుంబాల వద్దే దీక్ష చేస్తున్నారు. ప్రతి మంగళవారం వారిళ్ల వద్దే సర్కారుకు వ్యతిరేకంగా.. ఖాళీలు భర్తీ చేయాలనే డిమాండ్ తో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. […]

అసలే మద్య నిషేధం.. ఆపై అసెంబ్లీ ఆవరణలో మందు సీసాలు..

మద్యం అమ్మకాలు.. ప్రభుత్వాలకు అతి పెద్ద ఆదాయ వనరు..ఈ లాభాన్ని నమ్ముకొనే కొన్ని రాష్ట్రాలు మనుగడ సాగిస్తున్నాయి. వాటిలో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో కొత్త వైన్ షాపులు కూడా ఈ సంవత్సరం వస్తున్నాయి.. ఇటీవలే టెండర్లు కూడా పూర్తయ్యాయి.. నేడో, రేపు కొత్త మద్యం దుకాణలు ఏర్పాటు కాబోతున్నాయి.. వీటి సంగతి పక్కన పెడితే బిహార్ లో ఇపుడు సీఎం నితీష్ కుమార్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. నితీష్ కుమార్ ఆధ్వర్యంలో […]

కేసీఆర్ వైపు చూపిస్తున్న కిషన్ వేలు

నేను ఆయనను కలవాలని చాలా సార్లు ప్రయత్నించా.. అయినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.. నేను కేంద్ర మంత్రి కావడం ఆయనకు ఇష్టం లేదేమో.. అందుకే కలవడానికి అవకాశం ఇవ్వలేదేమో.. అని కేంద్ర కేబినెట్ మంత్రి, టీ.బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ నుద్దేశించి పేర్కొన్నారు. వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రైతులకేమో గానీ పార్టీల మధ్య వేడిపుట్టింది. ఓ వైపు రైతులు ప్రాణాలు కోల్పోతుంటే.. కారు, కమలం పార్టీలు మాత్రం రాజకీయ గొడవలకు దిగుతున్నారు. […]