టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల తరువాత కాంగ్రెస్ పార్టీలో నిరసన గళం వినిపించింది. రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు నాయకులకు నచ్చకపోయినా సరేలే అనుకొని మిన్నకుండిపోయారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబుకు నమ్మిన బంటుగా పనిచేసి ఆ తరువాత ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని .. రాజకీయంగా ఇబ్బందులు పడి తప్పనిసరి పరిస్తితుల్లో రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని కొందరు […]
Category: Politics
ఎలా వెళ్లారో.. అలా వచ్చారు..
తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి.. వరి ధాన్యాన్ని కొనేంతవరకు మేము ఢిల్లీ వదలి రాం.. కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుల కోసం పోరాడతాం అని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్ మంత్రుల బృందం హస్తిన నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమేరకు పార్టీ నిరసన చేపట్టింది. అంతేకాక మరో అడుగు ముందుకేసిన సీఎం.. […]
నెక్ట్స్ ఏంటి? పసుపా..కాషాయమా?
గత ఎన్నికల్లో జగన్ హవాలో విజయం..దీంతో ఎంపీగా ఢిల్లీలో రాజభోగాలు.. అనంతరం పార్టీ అధినేతతోనే విభేదాలు.. ఆ తరువాత కేసులు.. అరెస్టులు.. వైసీపీ రెబల్‌గా గుర్తింపు.. ఇదీ నర్సాపూర్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు గురించి క్లుప్తంగా. ఎంపీగా ఆయన పదవీ కాలం 2024తో ముగిసిపోతుంది. మరి ఆ తరువాత పరిస్థితేంటి? వైసీపీలో పార్టీ టికెట కచ్చితంగా ఇవ్వరు. ఇది రఘురాముడికే కాదు రాష్ట్రమంతా తెలుసు. పార్టీకి వ్యతిరేకంగా.. అధినేతను అడ్డంగా మాట్లాడుతున్న రఘురామరాజు ఇతర పార్టీల […]
2024 : తాడో.. పేడో తేల్చుకోవాల్సిందే..
2024 సంవత్సరంలో జరిగే ఎన్నికలు.. తాడో పేడో తేల్చుకోవాలి. అధికారమా..రాజకీయ విరామమా.. తేలేదీ అప్పుడే. పొరపాటున ఓడిపోతే అంతే.. ఇక తేరుకునే పరిస్థితి లేదు. అందుకే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి పరిస్థితి ప్రస్తుతం ఇది. టీడీపీకి అధికారం దక్కకపోతే ఆయన రాజకీయాలనుంచి వైదొలగడం పక్కనపెడితే కుమారుడు నారా లోకేష్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది. ఇప్పటికీ తండ్రి చాటు కుమారుడని లోకేష్‌కు పేరుంది. ఆ ఎన్నికల్లో విజయం సాధించకపోతే […]
‘గంటా’ సరికొత్త పొలిటికల్ స్టెప్
గంటా శ్రీనివాసరావు.. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ కనిపించే నాయకుడు.. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, నిన్న టీడీపీ గవర్నమెంటులో అధికారం చెలాయించిన వ్యక్తి. ఏ పార్టీకి అధికారం వస్తుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేసి వ్యూహాత్మకంగా ఆ పార్టీ కండువా కప్పుకునే అలవాటున్న వ్యక్తి అని పొలిటికల్ సర్కిళ్లలో పేరున్న మనిషి. అయితే 2019లో ఆయన అంచనాలు తప్పాయి. తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైపోయింది. దీంతో రెండేళ్లుగా ఆయన మౌనం వహించారు. ప్రజల్లో‍్ల కూడా పెద్దగా లేరు. […]
‘బాబు’కు దూరమవుతున్న బీసీలు
ఏపీలో ఎలా అయినా సరే అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాలు రూపొందిస్తున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా కార్యక్రమాలు నిర్వహించాలని కేడర్‌ను ఆదేశించారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడైనా తిరిగి సీఎం సీటులో కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. అధికార పగ్గాలు దక్కాలంటే కుల సమీకరణలు చాలా ముఖ్యం. పార్టీలు, నాయకులు కుల సమీకరణలో చాలా ముందుంటారు. పల్లెల్లో కుల పెద్దలను కలవడం సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో […]
శైలజా..రేవంత్.. మధ్యలో 15 లక్షలు
కాంగ్రెస్ పార్టీ.. జాతీయస్థాయిలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాభవం కోల్పోయింది. తెలంగాణలో చెప్పుకోదగ్గ ప్రజాప్రతినిధులు ఉన్నారు కానీ ఏపీలోమాత్రం దారుణం.. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే పార్టీ కార్యకలాపాల నిర్వహణకు కూడా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన అనంతరం కొద్దిరోజుల పాటు ఏపీసీసీ, టీపీసీసీ కమిటీలో ఒకే చోట నిర్వహించారు. ఏపీసీసీ ఇందిరాభవన్‌నుంచి కార్యకలాపాలు నిర్వహించగా.. టీపీసీసీ గాంధీభవన్ నుంచి నిర్వహించింది. ఆ తరువాత ఏపీసీసీ కార్యాలయం విజయవాడికు మారిపోయింది. విజయవాడకు మారిన అనంతరం […]
ఇక పొలిటికల్ పిచ్‌పై బౌలింగ్..
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సీనియర్ ప్లేయర్, ఆఫ్ స్పిన్నర్ హర్బజన్‌సింగ్ త్వరలో రాజకీయ మైదానంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోకున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తుంది. తాను ఏ పార్టీలోనూ చేరడంలేదని హర్బజన్ ప్రకటించినా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పడం రాజకీయ అరంగేట్రం ఊహాగానాలకు తావిస్తోంది. దీనికి తోడు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, క్రికెట్‌లో హర్బజన్ మాజీ సహచరుడు నవజ్యోత్‌సింగ్ సిద్దూ ట్విట్టర్లో ఓ ఫొటోను ఉంచాడు. హర్బజన్‌తో తానున్న ఫోటోను పోస్ట్ చేసిన సిద్దూ […]
ఫామ్ హౌస్‌లో యువకుడి మృతి.. కేసీఆర్ షాక్!
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు ఎర్రవల్లిలో ఓ ఫామ్ హౌజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫామ్ హౌజ్ నుండే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని పలుమార్లు విపక్ష నేతలు విమర్శలు చేస్తూ ఎద్దేవా చేయడం మనం చాలాసార్లు చూశాం. ఇక ఈ ఫామ్ హౌజ్ కారణంగా ఎర్రవల్లి చుట్టుపక్కాల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అయితే కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు వెళ్లినప్పుడల్లా ఆయన తన వ్యవసాయ […]