సిఎం కుమారుడి మృతి

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ సిద్ధరామయ్య (39) అనారోగ్యంతో మరణించారు. బెల్జియంలోని అంట్వెర్ప్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న రాకేష్ భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన శరీరంలో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినట్టు వైద్యులు వెల్లడించారు. మంగళవారం నాడు అయన చికిత్స కోసం చేరారు. గతంలో రాకేష్ కొన్ని కన్నడ సినిమాల్లో నటించారు. ఇటీవలే రాకేష్ తన రాజకీయ ఎంట్రీ మీద వ్యాఖ్యలు చేసారు. తన […]

పదవి పోయినా డోన్ట్‌ కేర్‌: కేశినేని

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం తమ పదవులు పోయినా లెక్కచేయబోమని టిడిపి ఎంపీలు అంటున్నారు. బిజెపితో అమీ తుమీకి సిద్ధమని చెబుతూ అధినేత చంద్రబాబు సంకేతాల కోసం ఎదురుచూస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. అలాగే, పదవుల కోసం పాకులాడేవాళ్ళం కాదని రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ అన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ఎలా పోరాటం చేయాలన్నదానిపై వ్యూహరచన చేస్తున్నామని చంద్రబాబు సూచనలతో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకుంటామని […]

మెసేజ్‌ అదిరిందయ్యా నానీ

యంగ్‌ హీరో, నేచురుల్‌ స్టార్‌ నాని ‘మజ్ఞు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి క్యాప్షనేంటో తెలుసా? ‘స్టాప్‌ డ్రింకింగ్‌.. స్టార్ట్‌ లవింగ్‌’. తాగుడు మానండి, ప్రేమించడం మొదలు పెట్టండి అని ఎంతో చక్కటి మెసేజ్‌ ఇస్తున్నాడు నాని. యంగ్‌ హీరోల్లో నాని డిఫరెంట్‌. సహజత్వం కోసం ఆరాటపడుతుంటాడు. చేసే సినిమాలన్నీ అలాంటివే. ఏ సినిమా చేసినా అందులో సహజత్వం కోసం, కొత్తదనం కోసం నాని పడే తపన అంతా ఇంతా కాదు. నాని నటిస్తాడు అని […]

జగన్‌కి ఇదే వెపన్‌ అవుతుందా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేతిలో భారతీయ జనతా పార్టీ ‘ఆయుధం’ పెట్టేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని బిజెపి చెప్పినా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఆచి తూచి స్పందిస్తున్నారు. పూర్తిగా చంద్రబాబు ఆలోచనల్ని ఖండించడానికి లేదు. కేంద్రంతో విభేదాలు ఏ రాష్ట్రానికీ మంచిది కాదనేది ఆయన ఉద్దేశ్యం కావొచ్చు. అయితే ప్రతిపక్షంగా పోరాడేందుకు పూర్తి అవకాశం ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీనీ అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీనీ ఇరకాటంలో […]

సూపర్‌ స్టార్‌పై ఫన్నీ కంప్లయింట్‌

వెండితెరపై హీరోలు చేసే యాక్షన్‌ సీన్స్‌ చూసి అభిమానులు థ్రిల్లవుతారు. అభిమానుల్ని అలరించడానికి హీరోలు ఎంత సాహసానికైనా వెనుకాడరు. ఆ సాహసంలో వారికి ఆనందం కనిపిస్తుంటుంది. అభిమానులు ఆ సీన్స్‌ చూసి ఎలా థ్రిల్లవుతారో ఊహించుకుని, ఆ ఉత్సాహంతో సాహసాలు చేసేస్తారు. కానీ అలాంటి సాహసాలు కూడా అభిమానులకు ఆవేదన కలిగిస్తాయా? ఇదిగో, ఈ వ్యక్తి గురించి వింటే అది నిజమనిపిస్తుంది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ‘కబాలి’ సినిమా కోసం చాలా సాహసాలు చేశాడు. ఆ […]

అవార్డిచ్చారు..హక్కులు కొట్టేశారు

చాలా ప్రముఖ మీడియా ఛానల్స్ ఉన్న మన తెలుగులో.. సినిమాలను కొనుక్కో వాలంటే మాత్రం ముగ్గురే ముగ్గురు. మా టివి.. జీ తెలుగు.. జెమిని టివి తప్పిస్తే అసలు మిగిలిన వారు శాటిలైట్ బిజినెస్ లో మాత్రం వేలు పెట్ట ట్లేదు. ఇకపోతే ఇప్పుడు ”జనతా గ్యారేజ్” శాటిలైట్ రైట్ల గురించి మాట్టాడుకోవా ల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటికే సినిమాను సెప్టెంబర్ 2న వితౌట్ ఎనీ డౌట్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేశాడు కొరటాల శివ. అందుకే ఈ […]

బొంకురామాయణం బాబు వంతొచ్చింది

కట్టే విరగకూడదు పాము చావకూడదు అనే సామెత గుర్తుందా?అచ్చం అలాగే ఉంటుంది చంద్రబాబు వ్యవహారం.కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించ కూడదు అయితే ప్రశ్నించినట్టుండాలి.ఇప్పటికే టీడీపీ రాజ్యసభలో వ్యవహారశైలి పైన,బీజేపీ కి వంత పాడటం పైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యం లో నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు పాపం బాబు గారు.ఎంతో హుందాగా..అంతకు మించి సీరియస్ గా బాధాతప్త హృదయంతో ప్రెస్ మీట్ మొత్తం రక్తి కట్టించారు బాబుగారు. పాపం ప్రెస్ మీట్ పెట్టి సుతి మెత్తగా కేంద్రాన్ని విమర్శిస్తూ, […]

కెసిఆర్ కి సిసలైన సవాల్!

రెండేళ్ల నుంచి అన్ని విషయాల్లో పైచేయి సాధించిన  టీఆర్ ఎస్ ప్రభుత్వం- ఎంసెట్ లీకేజీ, 8మంది వీసీల రద్దు తీర్పుతో ఇరుకునపడింది. ఎంసెట్ స్కాంతో ఓ పక్క గందరగోళం కొనసాగుతుండగానే  8మంది వీసీల నియామకాలు చెల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చింది. వీటిని దెబ్బమీద దెబ్బగానే పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ప్రతిదీ నిశితంగా పరిశీలించి, నిఘాలతో ప్రభుత్వ వ్యవస్థను నడిపిస్తోన్న ప్రభుత్వం, ఎంసెట్ లీకేజీ అంశంలో దెబ్బతిన్నమాట నిజమేనని ఎమ్మెల్యేలు, నేతలు అంగీకరిస్తున్నారు. ఎంసెట్ కుంభకోణం లక్షలాది […]

ప్రత్యేక హోదానా వంకాయా:జైట్లీ

ప్రత్యేక హోదాపై అధికార పక్షం చాలా క్లారిటీగా వుంది.చెవిటోడి ముందు శంఖం ఊదిన ప్రయోజం ఉంటుందో లేదో కానీ ఇంత క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ వేదన అరణ్య రోదనే..నిన్న బొంకయ్య నాయుడుగారు బొంకిన బొంకులే ఈ రోజు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గారు కూడా ఇంకొంచెం పోలిష్ చేసి వల్లెవేశారు. అసలు చర్చే ప్రత్యేక హోదా గురించి అయితే ఎంతసేపు దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం […]