హేమ వైకాపా ఎంట్రీ ప్లాన్ ఇదేనా..

టాలీవుడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ.. త్వ‌ర‌లోనే రాజ‌కీయ రీ ఎంట్రీ చేస్తోంద‌ట‌. ఏపీ విప‌క్షం వైకాపాలోకి జంప్ చేయాల‌ని ఆమె ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి స‌న్నాహ‌కంగానే ఆమె ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ విమ‌ర్శ‌లు ప్రారంభించేశారు. అది కూడా చిన్నా చిత‌కా నేతను కాకుండా స్టేట్ వైడ్ పాపుల‌ర్ అవ్వాల‌ని అనుకుందో ఏమో.. నేరుగా ఏపీ సీఎం చంద్ర‌బాబునే టార్గెట్ చేస్తూ.. విమ‌ర్శ‌ల బాణాలు సంధించింది. హేమ కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి […]

గంటా ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

ఏపీ మాన‌వ‌వ‌న‌రుల మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. ఇప్పుడు పెద్ద చిక్కుల్లో ప‌డ్డార‌ని తెలుస్తోంది. దీనికి ఏ చంద్ర‌బాబో. లేక మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులో కార‌ణం అనుకుంటే పొర‌పాటే. అస‌లు మంత్రి వ‌ర్గంతో సంబంధం లేని మెగాస్టార్‌తో ఇప్పుడు గంటాకు ఇబ్బందులు ఎదురు కానున్నాయ‌ట‌. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. ప్ర‌స్తుతం గంటా ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి చందంగా మారింద‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా భావిస్తున్న 150వ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150.. […]

చిన్నమ్మను ఇరుకున పడేస్తున్న తమిళనాట రాజకీయాలు

త‌మిళ‌నాడు అంతా ఇప్పుడు `చిన్న‌మ్మ‌` నామం జ‌పిస్తోంది. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత తర్వాత‌.. ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ కేంద్రంగానే రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. పార్టీ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శిగా ఆమెను ఎన్నుకున్న త‌ర్వాత‌.. శ‌శిక‌ళ సీఎం కావాల‌ని ప‌లువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. అందుకు రంగం కూడా సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో శ‌శిక‌ళ‌కు ఊహించ‌ని, దిమ్మ‌తిరిగే షాకులు త‌గిలాయి. ఇందులో ఒక‌టి జ‌య నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఆర్ కే న‌గ‌ర్ నుంచి కాగా.. మ‌రొకటి అమ్మ వీరాభిమాని న‌ట‌రాజ‌న్ నుంచి కావ‌డం విశేషం!! జ‌య […]

ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడికి జ‌గ‌న్ అదిరిపోయే షాక్‌

వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్ ఏరి కోరి ఎంచుకున్న విశాఖ జిల్లా పార్టీ అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్‌నాథ్‌పై జ‌గ‌న్ తీవ్రంగా సీరియ‌స్ అయ్యార‌నే వార్త‌లు చాలా ఆల‌స్యంగా వెలుగు చూశాయి. వాస్త‌వానికి ఎంతో మంది వ్య‌తిరేకిస్తున్నా.. జ‌గ‌న్ అమ‌ర్‌నాథ్‌కి జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఎంద‌రో సీనియ‌ర్ల‌ను కాద‌ని విశాఖ వంటి మేజ‌ర్ సిటీని అమ‌ర్‌నాథ్ చేతుల్లో పెట్టారు. అయితే, మొద‌ట్లో సౌమ్యంగానే ఉన్న అమ‌ర్‌నాథ్‌.. ఇప్ప‌డు మాత్రం.. ఏకు మేకైన చందంగా మారిపోయాడ‌ని, దీంతో జ‌గ‌న్ క్లాస్ ఇచ్చాడ‌ని […]

సీఐడీ ఉచ్చులో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు

ప్ర‌తిప‌క్ష వైసీపీకి చుక్క‌లు చూపించేందుకు సీఐడీ సిద్ధ‌మ‌వుతోంది. ఒక‌ప‌క్క పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ పావులు కదుపుతున్న విష‌యం తెలిసిందే! మ‌రోప‌క్క ఆ పార్టీ బ‌లంగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన‌ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు సీఐడీ ఉచ్చులో చిక్కుకున్నారు. క‌ల్తీ మ‌ద్యం కేసులో వీరిపై సీబీఐ చార్జిషీటు దాఖ‌లు చేసింది. ఎన్నిక‌ల్లో మ‌ద్యం పంపిణీ చేశార‌ని ఇందులో పేర్కొంది. దీంతో ఏ క్ష‌ణ‌మైనా వీరిని అరెస్టు చేయ‌వ‌చ్చ‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఇది వైసీపీలో తీవ్ర […]

కేసీఆర్‌కి మ‌రోసారి హైకోర్టు జలక్!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి హైకోర్టు నుంచి షాక్ మీద షాక్ త‌గులుతూనే ఉంది. తాజాగా కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న రాష్ట్ర భూసేక‌ర‌ణ చ‌ట్టంపై హైకోర్టు అక్షింత‌లు వేసింది. ఏక‌ప‌క్షంగా తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు రైతుల‌కు విరుద్ధంగా ఉన్నాయ‌ని వ్యాఖ్యానించ‌డంతోపాటు దీని అమ‌లుపై స్టే విధించింది. ఇది కేసీఆర్ స‌ర్కారుకు శ‌రాఘాత‌మ‌నే చెప్పాలి. అస‌లు ఏం జ‌రిగిందంటే.. రాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత త‌న దంటూ ప్ర‌త్యేక పాల‌న ప్రారంభించాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే […]

లింగంపేట‌-మోర్తాడు మ‌ధ్య రైలు

గుర్తింపు కోరుకోని రాజ‌కీయ నాయ‌కులెవ‌రుంటారు చెప్పండి! అస‌లే పార్టీల మ‌ధ్య, నాయ‌కుల మ‌ధ్య విప‌రీత‌మైన పోటీ నెల‌కొన్న త‌రుణంలో.. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌పడే ఏ చిన్న ప‌ని చేసినా ఆ క్రెడిట్ కొట్టేయ‌డానికి నాయ‌కులు త‌హ‌త‌హ‌లాడుతుంటారు. అయితే కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ ఎంపీ క‌విత కూడా ఆ క్రెడిట్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అని సందేహాలు ఇటీవ‌ల వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదంతా ఎందుకంటే.. లింగంపేట‌- మోర్తాడు మ‌ధ్య రైలు ప్రారంభించిన క్రెడిట్ అటు బీజేపీకి ద‌క్క‌కుండా చేసేందుకు ఎంపీ అనుచ‌రులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. […]

జ‌న‌సేన‌లోకి మాజీ సీఎం కిర‌ణ్ రెడ్డి

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆఖ‌రి సీఎం, తాను హైద‌రాబాదీనే అయినా.. స‌మైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నానంటూ సీఎం సీటులో కూర్చునే పెద్ద ఎత్తున పెను సంచ‌ల‌నం సృష్టించిన న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి గుర్తున్నారా? రాష్ట్రం విడిపోతే నీళ్ల‌కోసం పెద్ద ఎత్తున యుద్ధాలు చేసుకోవాల్సి వ‌స్తుందంటూ.. త‌న స‌మైక్య వాద‌న‌కు బ‌లం చేకూర్చే కామెంట్లు చేసిన క్రికెట్ ల‌వ‌ర్ కిర‌ణ్ రెడ్డి గుర్తున్నారా? దాదాపు అంద‌రూ మ‌రిచిపోయిన ఈ కాంగ్రెస్ మాజీ నేత‌, సొంత కుంప‌టి పెట్టుకుని విఫ‌ల‌మైన పార్టీ […]

మోడీకి ఇది అస‌లు సిస‌లైన ప‌రీక్ష‌

ప్ర‌ధాని మోడీకి ప‌రీక్షా కాలం మొద‌లైందా? ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు న‌గారా మోగడంతో ఇది మొద‌ల‌వ‌బోతోందా?అంటే అవున‌నే అంటున్నారు విశ్లేష‌కులు! ప్రాంతీయ పార్టీల హ‌వాను తగ్గించి.. అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా రెప‌రెప‌లాడాల‌ని అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి మోడీ-అమిత్ షా బృందం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే! కానీ అవ‌న్నీ విఫ‌ల‌మైపోయాయి! ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్‌లో ఎన్నిక‌ల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ జెండా […]