తమిళనాడులో ఇప్పుడు కొందరు ఊహించిన పరిణామాలే జరిగిపోయాయి. సీఎం పీఠం ఎక్కుతాననుకున్న శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లారు. దీంతో ఇక, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు పరిస్థితి ఏమిటి? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. వాస్తవానికి అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళ పంచన చేరిపోయారు. వారంతా చిన్నమ్మకే మద్దతిస్తున్నట్టు ప్రకటించేశారు. అంతేకాదు, వీరి సంతకాలతో కూడిన లేఖను శశికళ గవర్నర్ విద్యాసాగరరావుకి కూడా అందజేసింది. అయినప్పటికీ.. సుప్రీం కోర్టు కేసు చూపుతూ అప్పట్లో గవర్నర్ ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు […]
Category: Latest News
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాలయ్య పవర్ పనిచేసేనా?!
అనంతపురంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల తరఫున ఎమ్మెల్సీ స్థానం టీడీపీ చేతిలో నే ఉంది. మెట్టు గోవింద రెడ్డి స్థానిక సంస్థల తరఫున ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే, ఈయన పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే, స్థానిక సంస్థల్లో టీడీపీకి బలం ఉండడంతో ఈ స్థానంలో ఎవరు నిలబడ్డా గెలుపు ఖాయం. దీంతో టీడీపీలో ఇప్పుడు […]
ఆవేదన, ఆక్రోశానికి గురై … అమ్మ సమాధిని కొట్టిన శశికళ
కలలు కల్లలయ్యాయి. ఇక ఎక్కి కూర్చోవడమే లేటు అనుకున్న సీఎం సీటు పదేళ్లపాటు దూరం జరిగిపోయింది! ఈ పరిణామం ఊహించనైనా ఊహించలేదు దివంగత తమిళనాడు సీఎం జయలలిత నెచ్చెలి శశికళ. అక్రమార్జన కేసులో సుప్రీం తీర్పుకి ఆమె హతాశురాలైంది. అంతేకాదు, ఆమెకు సుప్రీం నుంచి ఊరట కూడా లభించలేదు. నెల రోజుల పాటు విరామం ప్రకటించాలన్న ఆమె అభ్యర్థనకు కూడా సుప్రీం అంగీకరించలేదు. దీంతో చివరాఖరికి కోర్టులో లొంగిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా ఆవేదన, ఆక్రోశానికి […]
ముహూర్తం ఫిక్స్: బాబు కేబినెట్ ప్రక్షాళన మార్చి 1
ఏపీ కేబినెట్లో మార్పులు చేర్పులకు ముహూర్తం ఫిక్సయిపోయింది. గత ఏడాది దసరాకి ముందు నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళన మార్చి 1న చేస్తారని వెల్లడైంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టీ అమరావతిపై పడింది. ఇక, తన మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి చంద్రబాబు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. తన తనయుడు లోకేష్ కి మంత్రి వర్గంలో సీటు ఖరారైన నేపథ్యంలో ఆయనను ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేయనున్నారు. ఈ […]
అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వారం రోజుల లగ్జరీ ఖర్చెంతో తెలుసా
తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ఉత్కంఠ పరిణామాలతో ఎట్టకేలకు సమసిపోయింది. జయ నెచ్చెలి శశికళ సీఎం పీఠం ఎక్కాలన్న ఆశలు అడియాసలయ్యాయి. ఇక ఇప్పుడు సీఎం పీఠం రేసులో అమ్మ నమ్మినబంటు పన్నీరుసెల్వం వర్సెస్ చిన్నమ్మ నమ్మినబంటు పళనిస్వామి మాత్రమే ఉన్నారు. శశికళకు అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడడంతో రేపోమాపో ఆమెను పోలీసులు అరెస్టు చేయడం ఖాయం. ఇక ఇప్పుడు శశికళకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది. పళనిస్వామికి మద్దతు ఇస్తే […]
శశికళకు భారీ షాక్ … పన్నీరు గూటికి పలువురు ఎమ్మెల్యేలు
తమిళనాడులోనే అతిపెద్ద పార్టీలలో ఒకటైన అన్నాడీఎంకే రెండున్నర దశాబ్దాల తర్వాత భారీ చీలిక దిశగా వెళుతోంది. దక్షిణాదిలో పెద్ద రాష్ట్రాలలో ఒకటి అయిన తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన ఈ పార్టీని 1972లో ఎంజీ రామచంద్రన్ స్థాపించారు. ఎంజీఆర్ తర్వాత ప్రముఖ సినీనటి జయలలిత ఈ పార్టీని రెండున్నర దశాబ్దాల పాటు తన కనుసైగలతో నడిపించారు. గతంలో ఎంజీఆర్ చనిపోయినప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయిన ఈ పార్టీ ఇప్పుడు మరోసారి భారీ చీలిక దశగా […]
తమిళనాడు కొత్త సీఎం గురించి షాకింగ్ సీక్రెట్స్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు అవకాశం ఇస్తారా ? లేదా అన్నాడీఎంకే శాసనసభా పక్షనేత శశికళ స్థానంలో ఎంపికైన పళనిస్వామిని ఆహ్వానిస్తారా ? అన్నది పక్కన పెడితే ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జయలలిత మరణంతో ఓ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అధికార అన్నాడీఎంకేకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేకు 89 […]
తమిళనాట.. మరో పొలిటికల్ వార్! దీప వర్సెస్ దీపక్
సుప్రీం తీర్పుతో తమిళనాడు రాజకీయం కొత్త మలుపు తిరిగింది! ఇప్పటి వరకు సీఎం సీటు కోసం ఆరాట పడ్డ శశికళ ఇప్పుడు జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం సీటులో ఎవరు కూర్చుంటారు? పన్నీర్ సెల్వానికి మద్దతు పెరుగుతుందా? శశి తదుపరి వ్యూహం ఏమిటి? అందరి ఆలోచనలూ ఇవే. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఇప్పటి వరకు అంతగా పరిచయం లేని ఇద్దరు తెరమీదకి వచ్చారు. తామే దివంగత జయలలితకు అసలు సిసలు వారసులమని […]
2019 పవన్ పోటీ చేసి నియోజకవర్గం అదేనా?
జనసేనాని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం ఖాయమై పోయిన నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎంత మెజారిటీ వస్తుంది? అసలు గెలుస్తారా? లేదా? ఇలాంటి సందేహాలకు కొదవలేదు. ఎందుకంటే.. తెలుగునాట కొన్ని దశాబ్దాల పాటు వెండి తెరపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి మెగాస్టార్‌గా వెలుగొందిన చిరంజీవి సైతం తన సొంత జిల్లా పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్‌పై అందరి దృష్టీ […]