ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రోజు రోజుకు టీడీపీ గ్రాఫ్ తగ్గుతోందా ? అక్కడ రైతుల నుంచి బలవంతపు భూసేకరణ, ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం, అక్కడ సామాన్య జనాల ఇబ్బందులు అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. అయితే ఇదంతా పైకి మాత్రమే కనపడుతోన్న వ్యతిరేకత…అయితే ఇప్పటి వరకు ఈ వ్యతిరేకతను అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ ఏదోలా మేనేజ్ చేసుకుంటూ కవరేజ్ చేసేసింది. అయితే ఇది ఓట్ల రూపంలో వ్యతిరేకంగా వస్తే ఇక కవరేజ్ […]
Category: Latest News
బెంగాల్‌లో తీగలాగితే … వైసీపీ డొంక కదులుతోందా..!
వైసీపీ నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఉక్కుపాదం మోపుతోంది. దీంతో వారి గుండెల్లో గుబులు మొదలైంది. ఏపీలోనే గాక పక్క రాష్ట్రంలో జరిగిన భారీ కుంభకోణాల్లోనూ వైసీపీ నేతల పేర్లు ఉండటంతో.. ఇప్పుడు పార్టీలో తీవ్ర గందరగోళం మొదలైంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో జరిగిన భారీ కుంభకోణంలో తీగలు లాగితే.. వైసీపీ డొంక కదులుతోంది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్‌తో పాటు మరికొందరు ఈడీ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతుండగా.. తాజాగా ఈ జాబితాలో చిత్తూరు ఎంపీగా పోటీచేసిన […]
కేసీఆర్ సర్వేలకే సవాలు విసురుతున్న తెరాస ఎమ్మెల్యేలు
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కంటి నిండా నిద్ర కరువవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహిస్తున్న సర్వేలు.. వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ సర్వే జరుగుతుందో… అందులో తాము ఎక్కడ ఉంటామో తెలియక అంతా సతమతమైపోతున్నారు. ఇక ఈ సర్వే ఫలితాలే 2019 ఎన్నికల్లో సీటు ఇచ్చేందుకు కొలమానమని చెబుతుండటంతో.. ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. `పార్టీ పరిస్థితి బాగుంది.. కానీ ఎమ్మెల్యేల పరిస్థితి బాలేదు` అని సీఎం చెబుతుండటంతో.. ఎక్కడ […]
టీడీపీలో నల్లారి ఫ్యామిలీ కథ అడ్డం తిరుగుతుందా..!
కాలం కలిసి రాకపోతే.. అధికార పార్టీలో ఉన్నా.. ఎవరు ఎంత గట్టిగా ప్రయత్నించినా ఫలితం మాత్రం శూన్యం! వీరిని చూస్తే జాలి కలగక మానదు! ఇప్పుడు నల్లారి ఫ్యామిలీ వ్యూహాలను గమనిస్తే ఇలాగే అనిపిస్తుంది. రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని నల్లారి సోదరులు తహతహలాడుతున్నారు. సమైక్యాంధ్ర మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే టీడీపీలో చేరినా.. వారికి విజయం సాధించడం మాత్రం అందని ద్రాక్షే అని […]
నంద్యాలలో టీడీపీకి భారీ షాక్..సీమలో బాబు లెక్క తప్పిందా..!
కర్నూలు జిల్లా రాజకీయాలు టీడీపీ అధినేతకు తలనొప్పిగా మారాయి. ఇటీవలె మృతిచెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరికతో ఇక్కడ విభేదాలు భగ్గుమన్నాయి. భూమా మృతి తర్వాత.. నంద్యాలలో పూర్తి పట్టు సాధించాలని భావిస్తున్న శిల్పా వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఉప ఎన్నికల్లో భూమా వర్గానికి సీటు కేటాయించాలని అధిష్ఠానం నిర్ణయించడంతో మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని స్పష్టమవుతోంది. ఈ పరిణామంతో […]
మళ్ళీ మోసం చేసిన బీజేపీ … దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ .. పోలవరం లేనట్టే ..!
ఏపీకి వరప్రదాయిని అని తెలుగు దేశం నాయకులు, సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న పోలవరం ప్రాజెక్టు వెనుక ఉన్న గుట్టు రట్టు అయింది. ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తామేనని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై మరో మెలిక పెట్టింది. ప్రత్యేకహోదా విషయంలో మాట మార్చిన ట్టుగానే ఇప్పుడు పోలవరం గురించి కూడా మాట మార్చింది. ప్రాజెక్టుకు నిధుల లోటు లేకుండా చేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై యూ టర్న్ తీసుకుంది. 2019లోగా […]
ఏపీ మునిసిపల్స్ ఉప పోరులో సైకిల్ జోరు – ఫ్యాన్ బేజారు
ఏపీలో వివిధ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ సత్తా చాటింది. టీడీపీ జోరుకు విపక్ష వైసీపీ బేజారయ్యింది. కీలక జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నంలోని వివిధ మునిసిపాలిటీల్లో పలు వార్డులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఒక్క వార్డులో మినహా మిగిలిన అన్ని చోట్లా అధికార పార్టీ దూకుడు ముందు వైసీపీ చేతులెత్తేసింది. రాజధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు […]
ఈ మూడు శక్తుల కలయిక ఫ్రంట్ కెసిఆర్ ని ఆపగలవా ?
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండగానే.. ఇప్పటి నుంచే పొత్తులపై రాజకీయ పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఏపీలో కంటే తెలంగాణలో.. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఒక చోటకు చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా కమ్యూనిస్టులు ఈ విషయంలో స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన రంగ ప్రవేశంతో.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను ఉపయోగించుకుని ఎలాగైనా పూర్వ వైభవాన్ని సంపాదించాలని కమ్యూనిస్టులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆ […]
పరిటాల సునీతకు ముందు నుయ్యి…వెనక గొయ్యి..!
ఏపీలో అనంతపురం జిల్లా పేరు చెప్పగానే మనకు పరిటాల ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. ఆ జిల్లా రాజకీయాల్లో ఆ ఫ్యామిలీకి అంతలా బలమైన ముద్ర వేసింది. దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఒక్క అనంతపురం జిల్లాలోనే కాదు ఏపీ, తెలంగాణలో కూడా క్రేజ్ ఉన్న లీడర్ అయ్యాడు. పరిటాల రవి హత్యానంతరం ఆయన వారసురాలిగా రవి భార్య సునీత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సునీత కూడా మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. చంద్రబాబు […]
