వ్యూహ‌క‌ర్త‌కు పొగ‌పెడుతూ వ్యూహాలు

పార్టీలో ముందు నుంచీ ఉంచి ఉన్న త‌మ‌ను.. ప‌క్క‌న పెడ‌తామంటే సీనియర్లు ఊరుకుంటారా?! పార్టీ నిర్మాణానికి కృషి చేసిన త‌మను.. క‌రివేపాకులా తీసి పారేస్తుంటే స‌హించ‌గ‌ల‌రా? అధినేత‌కు క‌ష్ట‌కాలంలో చేదోడు వాడుగా ఉన్న త‌మ‌ను..ఎవరి అదుపాజ్ఞ‌ల్లోనో న‌డ‌వ‌మంటే న‌డ‌వ‌గ‌ల‌రా? అసాధ్య‌మే క‌దా! ఇప్పుడు ఇదే ప‌రిస్థితి వైసీపీలోని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కుల్లో క‌నిపిస్తోంది. ఇటీవ‌ల 2019 ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్‌ను అధినేత జ‌గ‌న్‌ తీసుకురావ‌డం.. వైసీపీలో ముస‌లం రేపింది. అందుకే ఆయ‌న‌కు పొగ‌ప‌ట్టేందుకు ఇప్ప‌టినుంచే సీనియ‌ర్ […]

మోదీ నిర్ణ‌యానికి చంద్ర‌బాబు సై.. లోకేష్‌ నై

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, పంచాయ‌తీ,ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌.. రోజుకో సంచ‌ల‌న వ్యాఖ్య‌తో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు స‌మావేశాల్లో త‌డ‌బ‌డుతూ వ్యాఖ్య‌లు చేసి తండ్రికి త‌ల‌నొప్పులు తీసుకొచ్చిన ఆయ‌న‌.. మ‌రోసారి చంద్ర‌బాబుకు పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చారు. దేశ‌మంతా ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని, అదే స‌మ‌యంలో ముంద‌స్తుగా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్ర‌ధాని మోదీ, సీఎం చంద్ర‌బాబు చెబుతుంటే.. ఈ రెండిటినీ లోకేష్ తేలిక‌గా కొట్టిపారేశారు. అస‌లు ఏక‌కాలంలో అన్నిరాష్ట్రాల‌కూ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగే ప‌నికాద‌ని కొట్టిపారేశారు!! […]

ముంద‌స్తుకు సై అన‌డం వెనుక వ్యూహమిదే

ఏపీలో ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే చ‌క్క‌బడుతున్నాయి. తెలంగాణ బంగారు తెలంగాణ‌గా మార్చేందుకు నాయ‌కులు అడుగులు వేస్తున్నారు. ఎన్నిక‌లకు రెండేళ్ల స‌మ‌యం ఉన్నా.. అప్పుడే మూడేళ్లు అయిపోయాయా అనే భావ‌న అంద‌రిలోనూ ఉంది. కానీ మ‌రోసారి ఎన్నిక‌ల‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు సై అంటున్నారు. అటు పార్టీ శ్రేణుల్లోనే కాక‌.. ప్ర‌జ‌ల్లోనూ ఇప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌ల ఫీవ‌ర్ పెంచేశారు. ఎన్నిక‌ల హామీలు ఇంకా నెర‌వేర్చ‌లేదు.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన‌వి.. ప్ర‌తిపాద‌న‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. కానీ ముంద‌స్తుకు ప్ర‌ధాని మోదీ.. ఓకే అన‌గానే ఇద్ద‌రు […]

అమెరికాలో చంద్ర‌బాబు స‌భ భారీ కాస్ట్లీ గురూ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే అమెరికా పేరు జ‌పిస్తూ ఉంటారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకు రావడంలో భాగంగా.. వివిధ దేశాలు తిరుగుతున్న ఆయ‌న‌.. ఇప్పుడు ఆ అమెరికాకే వెళ్ల‌బోతున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి.. అన్ని ఏర్పాట్లను ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైట్‌(ఏపీఎన్ఆర్‌టీ) ద‌గ్గ‌రుండీ మరీ చూస్తోంది. ఇందులో ఏర్పాటుచేసే స‌మావేశాల‌కు టికెట్‌ ఉచిత ప్ర‌వేశం అంటూనే.. భారీగా డ‌బ్బులు దండుకుంటోంది. రాజధాని కోసమో..లేక మరో అంశం కోసమే విరాళం ఇస్తే ఫ‌ర్లేదు కానీ.. ఇలా టిక్కెట్లు […]

2019లో ఆరు ఎంపీ సీట్ల‌కు టీడీపీలో కొత్త క్యాడెంట్స్‌

2019 ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం ఉండ‌గానే ఏపీలో రాజ‌కీయ వేడి రాజుకుంది. అధికార టీడీపీ మ‌రోసారి గెలిచేందుకు ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతుంటే విప‌క్ష వైసీపీ ఎలాగైనా గెలుపుకోసం ఎక్క‌డ లేని వ్యూహాలు ప‌న్నుతోంది. ఇక జ‌న‌సేన వ్యూహం ఎలా ఉంటుందో ఇప్ప‌టికైతే అర్థం కావ‌డం లేదు. ఇక మ‌రోసారి విజ‌యం సాధించేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోన్న చంద్ర‌బాబు ప్ర‌జావ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న కొంద‌రు సిట్టింగ్‌ల‌కు టిక్కెట్లు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. ఈ లిస్టులో ఎంపీ స్థానాల […]

జనసేనకు క్యూ కడుతున్న మహామహులు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం క‌న్‌ఫార్మ్ అయ్యింది. జ‌న‌సేన ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించాడు. ఇంకాస్త ముందుడ‌గు వేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సైతం తాము సిద్ధ‌మ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న చేశాడు. దీంతో వ‌చ్చే ఎన్నికల్లో ఏపీలో ట్ర‌యాంగిల్ ఫైట్‌కు అదిరిపోయే రంగం సిద్ధ‌మైంది. జ‌న‌సేన నుంచి పోటీ చేయాల‌నుకుంటున్న వాళ్లు, అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ నుంచి టిక్కెట్లు దొర‌క‌డం కష్ట‌మ‌ని భావిస్తోన్న వాళ్లు జ‌న‌సేన నుంచి ఎన్నిక‌ల […]

ధూలిపాళ్ల న‌రేంద్ర కొత్త నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్ను..!

టీడీపీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియ‌ర్ ఎమ్మెల్యే ధూలిపాళ్ల న‌రేంద్ర‌కు పార్టీలో వ‌రుస‌గా క‌ష్టాలు, అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి 1994 నుంచి 2014 వ‌ర‌కు వ‌రుస‌గా ఓట‌మి లేకుండా ఐదుసార్లు గెలిచిన న‌రేంద్ర‌కు చిర‌కాల కోరిక అయిన మంత్రి ప‌ద‌వి మాత్రం రాలేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినా చంద్ర‌బాబు న‌రేంద్ర‌ను క‌రుణించ‌లేదు. మొన్న కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో న‌రేంద్ర‌కు గ్యారెంటీ బెర్త్ ద‌క్కుతుంద‌ని అంద‌రూ భావించారు. అయితే […]

ప్ర‌శ్న‌ల‌తో సాధ్య‌మేనా ప‌వ‌న్‌..!

జ‌న‌సైన్యం ఇంకా సిద్ధం కాలేదు కానీ యుద్ధానికి సిద్ధ‌మ‌ని సంకేతాలు పంపుతున్నాడు! సంస్థాగ‌తంగా ఇంకా పార్టీ నిర్మాణం పూర్తి కాలేదు.. కానీ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా పోటీచేస్తాన‌ని స్ప‌ష్టంచేస్తున్నాడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌! 2019 ఎన్నిక‌లు గానీ.. ముంద‌స్తు ఎన్నిక‌లు గానీ దేనికైనా.. ఎప్పుడైనా రెడీ అంటూ ఆయ‌న చేసిన ట్వీట్‌.. అభిమానుల‌ను ఫుల్ ఖుషీ చేసుండ‌చ్చు. ఎన్నిక‌లంటే ఎన్నో లెక్క‌లు.. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు త‌ప్ప‌నిస‌రి. వీట‌న్నింటినీ బ్యాలెన్స్ చేస్తాన‌ని చెప్ప‌డం వెనుక‌ ప‌వ‌న్‌కు ఉన్న‌ది కాన్ఫిడెన్సా లేక […]

సొంత జిల్లాలో బాబుకు సీనియ‌ర్ల ఝ‌ల‌క్‌

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అనంత‌రం అన్ని జిల్లాల్లోని టీడీపీ వ‌ర్గాల్లో అసంతృప్తి జ్వాల‌లు ర‌గిలాయి. సీనియ‌ర్లు అల‌క‌బూన‌డం.. అనంత‌రం వారిని బుజ్జ‌గించ‌డం అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. కానీ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు జిల్లాలో మాత్రం ఇవి ఇంకా నివురుగ‌ప్పిన నిప్పులా కొన‌సాగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన, బాబుకు అత్యంత స‌న్నిహితులైన‌ ఇద్ద‌రు సీనియ‌ర్లు ఇప్పుడు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. అంతేగాక చంద్ర‌బాబుకు, వారికీ మ‌ధ్య గ్యాప్ పెరుగుతూ వ‌స్తోంద‌నే వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. […]