ఏంటి టైటిల్ చూసి డంగయ్యారా? కేంద్రం మంత్రి, బీజేపీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు ఎప్పుడు కమలాన్ని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకుని, పసుపు కండువా కప్పుకుని సైకిలెక్కారా? అని శూన్యంలోకి చూపులు సారించి మెదడుకు పని చెప్పారా? ఆన్సర్ దొరకలేదా? అయితే.. ఇది చదవండి.. రిజల్ట్ ఉంటుంది! స్టేట్ విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారనే ప్రచారం సాగడం, ఎన్నికల హామీ నేపథ్యంలో అందరూ హోదాపై తెగ మనసు పెట్టుకున్నారు. ఇదే విషయంలో చంద్రబాబు […]
Category: Latest News
కేసీఆర్‌కు హైకోర్టు షాక్!
తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలని కంకణం కట్టుకుని తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్న టీఆర్ ఎస్ అధినేత, కేసీఆర్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. హైకోర్టు నుంచి ఊహించని షాక్ తగిలింది. బంగారు తెలంగాణ సాకారంలో భాగంగా ప్రస్తుతం ఉన్న పది జిల్లాల రాష్ట్రాన్ని 27 జిల్లాలుగా విభజించాలని అప్పుడు పాలన ప్రజలకు మరింత చేరువ అవుతుందని పక్కా ప్లాన్‌తో దూసుకువెళ్తున్న కేసీఆర్ స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసింది. ముఖ్యంగా తన కుమారుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాకు […]
టీడీపీ కంచుకోటలో అసంతృప్తి సెగలు
ఏపీలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తిస్థాయిలో సహకారం అందించిన జిల్లాల్లో ఒకటైన అనంతపురం గత ఎన్‌టీఆర్ కాలం నుంచి ఈ పార్టీకి కంచుకోటగా ఉంది. ముఖ్యంగా ఎన్‌టీఆర్ సహా ఆయన తనయుడు బాలయ్యలు ఈ జిల్లా నుంచే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఒక్క ఉరవకొండ, కదిరి నియోజకవర్గాలు మినహా మిగిలిన 12 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ సైకిల్ దూసుకుపోయింది. అదేవిధంగా రెండు ఎంపీ సీట్లనూ టీడీపీనే కైవసం చేసుకుంది. దీంతో స్టేట్‌లో టీడీపీకి అత్యధిక బలం […]
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరు..!
తెలంగాణ టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణకి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయా? ఈ విషయంలో రేవంతే దూకుడు మీదున్నాడా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం టీటీడీపీలో ఈ విషయంపైనే చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీ అటు ఏపీ, ఇటు తెలంగాణలోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణ పార్టీకి సీనియర్ నేత, బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణను అధ్యక్షుడిగా నియమించారు. దీంతో పార్టీ అధిష్టానం ఆదేశాలను అందరూ […]
ఆ మాజీ మంత్రి చూపులు వైకాపా వైపు..!
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. విపక్షాన్ని బలహీనపరచేందుకు మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు వైసీపీ విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంలో తాజాగా వైసీపీకి కాస్త ఊరట కలిగించే పరిణామాలు కూడా సంభవిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీలో చేరితే ఉండే ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు జగన్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి పరుగులు తీశారు. ఒకరూ ఇద్దరు కాదు దాదాపు 20మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు కూడా టీడీపీ కండువా […]
కేసీఆర్ నిఘా నీడలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
పార్టీలోను, ప్రభుత్వం లోను జరిగే తప్పులు చూసీ చూడనట్టుగా వదిలేస్తే రేపు అవే ప్రత్యర్థుల చేతిలో అస్త్రాలుగా మారే ప్రమాదం ఉందన్న ఆలోచనతో కేసీఆర్ పార్టీ నేతల పనితీరుపై కాస్త సీరియస్‌గానే దృష్టి పెట్టారట. వాస్తవాలు ఎలా ఉన్నా తన మాటలతోనే కళ్లముందు సుపరిపాలనను ఆవిష్కరింపజేయగల టీఆర్ ఎస్ అధినేత తాజా నిర్ణయం వెనుక గట్టి కారణమే ఉంది. గ్యాంగ్‌స్టర్ నయూముద్దీన్‌తో పలు వురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అంటకాగి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలే ఇటీవల వెల్లువెత్తడంతో… పార్టీ […]
వెంకయ్య బాగా హర్ట్ అయ్యారట
ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టిన కేంద్రంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన విషయం అందరికన్నా బాగా కేంద్ర మంత్రి వెంకయ్యకు గుర్తిండిపోయింది! ఆయన పడుకున్నా లేచినా పవన్ వ్యాఖ్యలే గుర్తుకొస్తున్నట్టున్నాయి. దీంతో ఈ విషయం జరిగి దాదాపు నెల గడుస్తున్నా.. పవన్‌పై వెంకయ్య ఇంకా సటైర్లు కుమ్మేస్తూనే ఉన్నారు. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్.. ఆ సమయంలో కేంద్రం సహా బీజేపీపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఇక […]
ఆ టీడీపీ ఎమ్మెల్యేకు కప్పం కట్టాలట
ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్న దానికీ.. టీడీపీ తమ్ముళ్లు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న దానికీ సంబంధం లేకుండా పోతోంది! తాను నిప్పనంటూ చంద్రబాబు పదేపదే చెప్పుకొంటారు. తనపై ఎన్నో కేసులు నమోదైనా అన్నింటి నుంచి బయటపడ్డానని అంటారు. తెలుగు డిక్షనరీలో తనకు నచ్చని పదం అవినీతేనేనని అంటారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, తెలుగుదేశం జెండాపై బాబు కనుసన్నల్లో నెగ్గిన ఎమ్మెల్యేలు కొందరు విచ్చలవిడిగా దోపిడీకి తెరలెత్తేయడం మాత్రం ఆయనకు సంబంధంలేదా? ఆయనెలాంటి చర్యలూ […]
కాశ్మీర్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చేయడానికి ఆయనెవరు?
పాకిస్తానీయులారా మీకు కాశ్మీర్ కావాలంటే ఇచ్చేస్తాం, దాంతోపాటుగా ప్యాకేజీ డీల్ కింద బీహార్‌ని కూడా తీసుకుపొమ్మని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండే కట్జూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కట్జూ పట్ల భారతీయులందరికీ ఎంతో గౌరవం ఉంది. న్యాయమూర్తిగా ఆయన్ను అందరూ గౌరవిస్తారు. కానీ ఆయనెందుకు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో అర్థం కావడంలేదు. అయితే తాను ఆ ప్రతిపాదన తీసుకురాగానే, కాశ్మీర్ తనకు వద్దని, బీహార్ అసలే వద్దని కాశ్మీరీలు సమాధానమిచ్చినట్లు కట్జూ పేర్కొన్నారు. […]