ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయం అగ్నిమంటాకులా రాజుకుంది. ఇక్కడ టీడీపీలోనే గ్రూపులు ఎక్కువవ్వడంతో వచ్చే ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా పెద్ద సస్పెన్స్‌గానే ఉంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఇదే కర్నూలు జిల్లాకు చెందిన మూడు పంచాయితీలు చంద్రబాబు వద్ద చర్చకు రానున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనేది ఇంకా తేలలేదు. ఇక్కడ రాజకీయాలను మంత్రి అఖిలప్రియ సరిగా డీల్ చేయలేకపోతోందని భావిస్తోన్న చంద్రబాబు ఇక్కడ […]
Category: Latest News
గుంటూరు జిల్లాలో ఆ సీటు జనసేనదేనా..?
ఏపీలో జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో గుంటూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ ఈ జిల్లాలో సీట్లు గెలవకపోయినా గణనీయంగా ఓట్లు సాధించింది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్నికల రంగంలో ఉండడంతో మరోసారి గుంటూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ జరగనుంది. ప్రస్తుతం జిల్లాలో జనసేన ఊపు అంతగా లేకపోయినా ఎన్నికల నాటికి ఈ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో సత్తా చాటే […]
టీడీపీలో క్రమశిక్షణ మొదలైందా..!
తెలుగు రాష్ట్రాల్లో క్రమ శిక్షణ ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది నిజంగా టీడీపీనే! అన్నగారి హయాం నుంచి పార్టీలో క్రమశిక్షణకు పెద్ద పీట వేస్తున్నారు. ఏదైనా విభేదాలు ఉంటే సామరస్య పూర్వకంగా అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడం, ఏవైనా ఇబ్బందులున్నా.. అలాగే పరిష్కరించుకోవడం పార్టీ ఆనవాయితీ. ఇక, పార్టీ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై అయితే, మహానాడు వేదిక ఎలాగూ ఉంది. అంతేతప్ప ఇతర పార్టీల్లో మాదిరిగా ముఖ్యంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాదిరిగా.. […]
ఇదంతా అఖిల ప్రియ నిర్వాకమేనని టీడీపీ నేతలు గుర్రు
పదవిని చేపట్టి ఏడాదైనా పూర్తికాకుండానే పర్యాటక శాఖా మంత్రి భూమా అఖిల ప్రియ.. తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకున్నారా? ఆమెకు జై కొట్టిన నేతలు, నోళ్లే.. ఇప్పుడు ఆమెను విమర్శిస్తున్నారా? సొంత జిల్లా కర్నూలు టీడీపీలోనే మంత్రి గారి వ్యవహార శైలిపై నేతలు నొచ్చుకుంటున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. విషయంలోకి వెళ్తే.. యువ మహిళా మంత్రిగా బాబు కేబినెట్‌లో సీటు పొందిన భూమా కుమార్తెకు స్టార్టింగ్‌లో సొంత జిల్లాలో నేతలు, టీడీపీ కార్యకర్తలు బ్రహ్మ రథం పట్టారు. […]
తెలంగాణలో బాబు దుకాణం బంద్!
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. పరిస్థితి మరో తెలుగు రాష్ట్రం తెలంగాణంలో మాత్రం అగమ్యగోచరంగా మారింది! జాతీయ పార్టీగా అవతరించి.. నేషనల్ లెవల్ లో చక్రం తిప్పాలని చంద్రబాబు భావించారు. అయితే, అనూహ్యంగా పరిస్థితి యూటర్న్ తీసుకుంది. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ పక్కరాష్ట్రం అందునా హైదరాబాద్‌ను నేనే డెవలప్ చేశానని పదేపదే చెప్పుకొనే బాబుకి ఇప్పుడు ఆ రాష్ట్రంలో పార్టీని నిలుపుకొనే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. విషయం లోకి వెళ్తే.. తెలంగాణలో టీడీపీ […]
మంత్రుల మధ్య వార్.. మరింత పెరుగుతోంది!
టీడీపీ మంత్రులు అయ్యన్న, గంటాల మధ్య తలెత్తిన వివాదం మరింతగా రాజుకుంది. విశాఖలో భూ కుంభకోణాలపై తలెత్తిన వివాదం చిలికి చిలికి పెద్దాయన దాకా చేరడం, దీనిపై సిట్ వేయడం, అదీకాక, పార్టీ పరంగా ఇద్దరు మినిస్టర్ల మధ్య ఎందుకు వివాదం రేగిందో పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీని కూడా నియమించడం యుద్ధ ప్రాతిపదికన జరిగిపోయింది. దీనికి ముందు పరిణామాలు చూస్తే.. అయ్యన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ విశాఖ భూములపై ఏకేశారు. నేరుగా మంత్రి గంటా పేరు […]
జనసేన సీటు రేటు కోట్లు పలుకుతోందా…
ప్రశ్నిద్దాం అంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పార్టీ పెట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ+బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు వివిధ అంశాల్లో ఆ రెండు పార్టీలతో క్రమక్రమంగా విబేధిస్తూ వచ్చిన పవన్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరుకు రెడీ అవుతున్నారు. జనసేన వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేసి తీరుతుందని, తాను ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పవన్ స్వయంగా ప్రకటించి […]
వైసీపీ నిన్న హ్యాపీ… నేడు డీలా
కర్నూలు జిల్లా వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. నిన్న మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి పార్టీలో చేరడంతో ఫుల్ ఖుషీగా ఉన్న జగన్ పార్టీకి ఆ మరుసటి రోజే ఎవ్వరూ ఊహించని షాక్ తగిలింది. భూమా ఫ్యామిలీకి చెందిన మంత్రి అఖిలప్రియ ప్రాథినిత్యం వహిస్తోన్న ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బోరెడ్డి లక్ష్మీరెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన లక్ష్మీరెడ్డి పార్టీ అధిష్టానంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీలో డబ్బున్న […]
అమిత్‌షాపై టి-బీజేపీ నేతల గుస్సా!
తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తెలంగాణలో పర్యటించి శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలోని సీనియర్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఆయన వ్యూహాలతో తమకు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందో దక్కదోనని టెన్షన్ పడుతున్నారట. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యమిచ్చేలా అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటుండటంతో.. దిక్కుతోచని […]
