2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన ప్రకటన రాజకీయంగా రెండు రాష్ట్రాల రాజకీయాలను కాస్త హీటెక్కించింది. ఈ హీట్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా కనిపిస్తోంది. పవన్ ఏపీకి చెందిన వాడు కావడంతో పాటు పవన్ సామాజికవర్గం ఇక్కడ బలంగా ఉండడంతో జనసేన 2019 ఎన్నికల్లో ఎంత వరకు ఇక్కడ ప్రభావం చూపుతుందన్న అంచనాలు అందరిలోను నెలకొన్నాయి. పవన్ ప్రకటన వరకు బాగానే ఉంది. కానీ సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి […]
Category: Latest News
చింతమనేని గ్రాఫ్ ఎలా ఉంది…2019లో గెలుస్తాడా…
చింతమనేని ప్రభాకర్‌రావు సమైక్య రాజకీయాల్లో ఈ పేరు రాజకీయాలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నుంచి టీడీపీ తరపున వరుసగా రెండుసార్లు గెలిచిన చింతమనేనికి కాంట్రవర్సీ కింగ్‌గా పేరుంది. పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, విప్‌గా ఉన్న ఆయనకు నియోజకవర్గంలో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉంది. 2009 ఎన్నికలకు ముందు దెందులూరు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన ఆయన మంత్రి మాగంటి మంత్రి పదవి పోవడానికి కారణమయ్యాడు. ఆ […]
వైసీపీ + కాంగ్రెస్ పొత్తు
ఈ హెడ్డింగ్ చూడడానికి కాస్త విచిత్రంగానే ఉండొచ్చు. వైసీపీ అధినేత వైఎస్.జగన్ కాంగ్రెస్‌తోనే విబేధించి వైసీపీ పెట్టాడు..మరి అలాంటి జగన్ అదే కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటాడన్నది పెద్ద క్వశ్చనే. అయితే అప్పుడు జగన్ సీఎం పోస్టు కోసమో లేదా మరో అవసరం కోసమో కాంగ్రెస్‌తో విబేధించి వైసీపీ పెట్టి ఉండొచ్చు….అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ పరిస్థితి ఏపీ వరకు (ఆ మాటకు వస్తే దేశంలోను ఏమంత గొప్పగా లేదు) సమాధికి చేరువుగా ఉంది. శతాబ్దం చరిత్ర […]
అల్లుడు కోసం మామ త్యాగమా..! లేక గుడ్ బై నా..!
ప్రముఖ సినీనటుడు, ఏపీలోని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా ? వచ్చే ఎన్నికల్లో ఆయన హిందూపురం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశంలో లేరా ? బాలయ్య 2019 తర్వాత రాజ్యసభకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ఏపీ టీడీపీ వర్గాల్లో అవుననే ఆన్సరే వస్తోంది. 2014 ఎన్నికల్లో తన తండ్రి గతంలో ప్రాథినిత్యం వహించిన హిందూపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలోకి […]
నంద్యాలలో మారిన వైసీపీ వ్యూహం
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ వ్యూహం మారింది. నిన్నటి వరకు ఇక్కడ వైసీపీ ఏకగ్రీవానికి సహకరిస్తుందన్న వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరపున భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు సైకిలెక్కిన ఆయన మంత్రివర్గ విస్తరణకు ముందే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. భూమా మృతి తర్వాత జగన్ ఇది వైసీపీ సీటు…ఇక్కడ వైసీపీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుందని ప్రకటన చేశారు. దీంతో […]
ఆ ఎమ్మెల్యే దంపతులు టీఆర్ఎస్ లో ఇమడలేక పోతున్నారా.!
వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ, మురళీ దంపతుల పేరు చెపితే సమైక్య రాష్ట్ర రాజకీయాల్లోనే తెలియని వారు ఉండరు. కాంగ్రెస్‌లో లేడీ ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి వైఎస్ హయాంలో మంత్రి అయ్యారు. వైఎస్‌తో సురేఖ దంపతులకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. 2008లో ఆమె వైఎస్ సూచన మేరకు హన్మకొండ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. తర్వాత జగన్ వైసీపీలో చేరిన సురేఖ తన మంత్రి పదవి వదులుకుని […]
బళ్లారిలో గాలి ఫ్యామిలీకి చెక్
కర్ణాటకలోని బళ్లారి జిల్లా పేరు చెపితే మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి పేరు ముందుగా గుర్తుకు వస్తుంది. బళ్లారి మైనింగ్ మాఫియాతో కోట్లకు పడగలెత్తి దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కిన గాలి కేవలం మంత్రిగా ఉండి కర్ణాటక రాజకీయాలను శాసించారు. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయ్యి గాలి జైలుకు వెళ్లడంతో అక్కడ గాలి ఊపు తగ్గింది. ఇక వచ్చే యేడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో మరోసారి గాలి బళ్లారిలో కీ రోల్ పోషిస్తాడా ? అన్న చర్చలు […]
బీజేపీలో కేశినేని మంట
ఏపీలో అధికార పక్షంలో ఉన్న టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీ మధ్య మాటల మంట రేగుతోంది. గత మూడేళ్లుగా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీతో పొత్తు వల్లే మెజారిటీ తగ్గిందంటున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య మరింతగా మంట రేపుతున్నాయి. తాజాగా ఎంపీ కేశినేని వ్యాఖ్యలపై బీజేపీ శాసనసభాపక్షనేత, విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తీవ్రంగా స్పందించారు. బీజేపీతో పొత్తు వల్లే […]
టీడీపీలో కుమ్ములాటలు వైసీపీకి ప్లస్
ఏపీలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్ సొంత జిల్లా కడప ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పుడు వైసీపీకి బలమైన జిల్లా. ఇక్కడ టీడీపీకి గత మూడు ఎన్నికల్లోను దిమ్మతిరిగే ఫలితాలే వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఇక్కడ ఎలాగైనా మెజార్టీ స్థానాలు సాధించాలని పట్టుదలతో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన పలువురు నేతలకు పచ్చకండువా వేస్తోంది. ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేశ్, సతీష్‌రెడ్డి, బీటెక్ […]