ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సొంత పార్టీని, పార్టీ కార్యకర్తలను ఎవరూ దూరం చేసుకోరు. కనీసం నెలకోసారైనా వాళ్లను పలకరించి, పరిస్థితిపై వాకబు చేస్తారు. కానీ, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ విషయంలో తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా ఉంటున్నారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. విషయంలోకి వెళ్తే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణల్లో టీడీపీని రెండుగా విభజించారు. ఎక్కడికక్కడ బలోపేతం చేసుకుంటూ.. టీడీపీని జాతీయ పార్టీగా కూడా ప్రకటించారు. చంద్రబాబు […]
Category: Latest News
కాపు నేతతోనే ముద్రగడకు చెక్
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి కదం తొక్కేందుకు సిద్ధమవుతున్నారు. చలో అమరావతి అంటూ.. ప్రభుత్వంపై శమర శంఖం పూరించేందుకు సన్నద్ధమవుతున్నారు. గతంలోలా తమ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించినా.. ఈసారి మాత్రం వెనకడుగు వేసేది లేదని బల్ల గుద్దిమరీ చెబుతున్నారు. ఆయన చేసిన ప్రయత్నాలన్నింటినీ ఆదిలోనే తొక్కేసిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు కూడా అదే పనిలో పడ్డారు. ఈసారి కూడా ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవాలనే దృఢనిశ్చయంతో ఉన్నారు. కాపు నేతలకు సమాధానాలిచ్చేందుకు ఆ సామాజిక వర్గానికి […]
మోడీ ప్రసన్న కోసం వెంకయ్య ఏదైనా చేస్తాడా..!
ప్రధాని మోడీ పరమ వీర విధేయులైన భక్తుల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎప్పుడూ అగ్ర స్థానంలోనే ఉంటారు. ఆయన మెప్పు పొందడానికి నిరంతరం, అహర్నిశలు, పగలురాత్రి అన్న తేడా లేకుండా శ్రమిస్తూ ఉంటారు. సందర్భం దొరికిన ప్రతిసారీ మోడీని.. దేశ ప్రజలను కాపాడటానికి వచ్చి దైవదూతగా అభివర్ణిస్తూ.. ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇందుకోసం సొంత రాష్ట్ర ప్రయోజనాలను తృణప్రాయంగా విడిచిపెట్టేస్తారు. హిందీని మరోసారి ప్రవేశపెట్టే యత్నాలకు వెంకయ్య జతకలిశారు. మోడీని హీరో చేయడం కోసం సొంత భాషను గుజరాత్ […]
ఏపీ కేబినెట్ మళ్లీ మారుతోందా..!
`సీఎం చంద్రబాబుతో సమానంగా మంత్రులు పరిగెత్తలేకపోతున్నారు. వారికి కేటాయించిన శాఖలపై ఇంకా పట్టు సాధించలేకపోతున్నారు`- ఈ మాట మూడేళ్లుగా ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది. కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు ప్రయత్నించి.. ఆ ముద్రను చెరిపేయాలని భావించారు. ఇదే ఎన్నికల టీంగా భావించారు. కానీ మంత్రులెవరూ ఆయన ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో ఏం చేయాలా అని తీవ్రంగా మంతనాలు జరుపుతున్నారట. ముఖ్యంగా మరోసారి మంత్రి వర్గ విస్తరణ చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. […]
తెలంగాణలో కొత్త పార్టీతో పవన్ పొత్తు..!
ఏపీ, తెలంగాణలో 2019 ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతోన్న జనసేన ఏ రాష్ట్రంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది ? అన్నది ఆసక్తిగా ఉంది. ఏపీలో జనసేనకు ఇప్పటి నుంచే క్రేజ్ కనపడుతోంది. ఆ పార్టీతో పొత్తుకు రెడీ అని ఇప్పటికే కమ్యూనిస్టులు ప్రకటించారు. ఇక వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సైతం జనసేనతో పొత్తు పెట్టుకుంటే వచ్చే లాభాలను జగన్‌కు చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తెలంగాణలోనూ జనసేన పార్టీ పోటీ చేయాలని […]
పశ్చిమ గోదావరిలో ఓడే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు..
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పేరు చెపితేనే చాలు టీడీపీకి కంచుకోట అన్న థాట్ ప్రతి ఒక్క ఓటర్‌కు వస్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన చాలా ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తన ఆధిపత్యం చూపించింది. ఇక్కడ సాధారణ ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలోని 15 ఎమ్మెల్యే సీట్లతో పాటు, 2 ఎంపీ సీట్లు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. అలాంటి కంచుకోటలో ఇప్పుడు పార్టీకి చాలా నియోజకవర్గాల్లో ఎదురీత తప్పడం […]
బాబుకు యాంటీగా మాజీ మంత్రి హెల్ఫ్…వేటు తప్పదా
రాష్ట్రంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం జరిగినా.. ఎవరైనా మాట్లాడినా పరిస్థితులు తీవ్రంగా ఉంటున్నాయి. అంతేకాదు, పార్టీకి, తనకు మచ్చ తెచ్చేవారిని బాబు అస్సలు క్షమించడం లేదు. ఎంతటి వారైనా వేటుకు సిద్ధం అంటూ చర్యలు కూడా ప్రారంభించేస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ఆ కోవలోవే. నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్‌ను ఎంతో మంది కోరుకుంటున్నా.. ఏరికోరి వాకాటి నారాయణరెడ్డికి కేటాయించారు బాబు. అయితే, ఇంతలోనే ఆయనపై అవినీతి ఆరోపణలు […]
ఏపీలో బయటపడుతున్న అవినీతి అనకొండలు!
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఎంతగా అవినీతి రహితం చేయాలని ప్రయత్నిస్తున్నా.. అంతగా అవినీతి ఊబిలో కూరుకుపోతోంది. ఈ ఏడాది ఏపీలో బయటపడినంతగా నల్లధనం ఎక్కడా బయటపడలేదన్నది వాస్తవం. అవినీతి పాల్పడిన ఉద్యోగి.. సాధారణ దొంగకన్నా దారుణమైన వ్యక్తి అంటూ.. ఓ సందర్భంలో నెహ్రూ పేర్కొన్నారు. సాధారణ దొంగ ఒకరిద్దరిని దోచుకుంటే.. ఈ అవినీతికి అలవాడుపడిన వైట్‌కాలర్ దొంగలు సమాజాన్నే దోచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న గాక మొన్న ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు 50 […]
ఆ నియోజకవర్గంలో లోకేశ్ పెత్తనం
విజయవాడ పార్లెమంటరీ స్థానం.. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న స్థానం. అందునా ప్రస్తుతం రాజధాని ప్రాంతం ఈ నియజకవర్గంలో కలిసి ఉండడంతో మరింత ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ నేత కేశినేని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈయన హయాంలోనే బెంజిసర్కిల్ వద్ద ప్లైవోర్‌కు పూజలు కూడా జరిగాయి. ఇక, దుర్గ గుడి వద్ద ఫ్లైవోవర్ నిర్మాణం వేగంగా సాగుతోంది. నాని ఎంపీ అయ్యాక, ఇక్కడ ఏపీ రాజధాని వచ్చిన పుణ్యమో, ఆయన కష్టపడిన […]