`పవన్, చంద్రబాబు ఎప్పుడూ భాయి-భాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతు ఉంటుంది` ఇదీ కొంతకాలం క్రితం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య! నిజమే.. సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మధ్య.. సత్సంబంధాలే ఉన్నాయి. దీనివల్లే నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్ మద్దతు తమకు ఉంటుందని, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు అంతా నమ్మకంతో ఉన్నారు. కానీ `2019 ఎన్నికల వరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయం. మా వైఖరి […]
Category: Latest News
వైఎస్ కుటుంబంలో అసంతృప్తి సెగలు
వైసీపీ అధినేత జగన్ కెరీర్‌లోనే తీవ్రమైన సందిగ్ద స్థితిలో ఉన్నట్టే కనిపిస్తోంది. ముంచుకొస్తోన్న 2019 ఎన్నికలు, బలమైన చంద్రబాబు లాంటి రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవడం పెద్ద సవాల్. ఇక ఇప్పటికిప్పుడు నంద్యాల ఎన్నికలు చావోరేవోలా ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు జగన్‌కు తన ఫ్యామిలీని సంతృప్తి పర్చడం కూడా పెద్ద సవాల్‌గా మారింది. గత ఎన్నికలకు ముందు నుంచి సోదరి షర్మిలకు జగన్‌కు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. షర్మిల కడప లేదా ఖమ్మం ఎంపీ సీటు […]
మహేష్ ఫ్యాన్స్‌లో అయోమయం..అంతా అయోమయం!
ప్రస్తుతం జోరుమీదున్న నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ, వైసీపీలు దేనికి అదే విజయంపై ధీమాగా ఉన్నాయి. అదేసమయంలో అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ.. పార్టీ అధినేతలు ముందుకు పోతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని రంగంలోకి దింపుతున్నారు. సాధ్యమైనన్ని హామీలు.. అంతకు మించి సాధ్యమైనన్ని విమర్శలు చేసుకుంటున్నారు. ఇది నాణేనికి ఒకవైపు ముచ్చట. ఇక, ఇప్పుడు ఎన్నికలు సమీపించేస్తున్నాయి. వారాల నుంచి రోజుల్లోకి వచ్చేసింది గడువు. దీంతో ఇప్పుడు ప్రజలను మరింత బలంగా తమవైపు తిప్పగల వారికోసం […]
నంద్యాలలో టీడీపీ-వైసీపీ సర్వేలు ఏం చెపుతున్నాయ్
నంద్యాల ఉప పోరు సమీపిస్తున్న కొద్దీ.. విజయం ఎవరిదనే విషయంపై సహజంగానే ఆసక్తి నెలకొంటుంది. ఏ టీ బడ్డీ వద్ద చూసినా.. ఏ నలుగురు మాట్లాడుకున్నా.. గెలుపు సమాచారంపైనే మాటలు నడిచిపోతుంటాయి. ఇక, నంద్యాల వంటి అతి కీలకమైన ఎన్నిక, అదికూడా రెండు బలమైన పక్షాలు అక్కడే రోజుల తరబడి తిష్టవేసి మరీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇక ఈ నియోజకవర్గంపై అంచనాలు ఎలా ఉంటాయనేది చెప్పడం కష్టం. గెలుపు నాదంటే నాదనే ఈ రెండు పక్షాల […]
భారీ క్రికెట్ బెట్టింగ్ కుంభకోణం… వెనక వైసీపీ ఎమ్మెల్యే!
రాష్ట్రంలో ఇటీవల కాలంలో భారీ ఎత్తున సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ యువతను నిర్వీర్యం చేస్తోంది. వందలు దాటి వేల రేంజ్‌కు చేరిపోయిన ఈ బెట్టింగులు ఇప్పుడు కోట్లకు ఎగబాకాయి. దీంతో దీనినే వ్యసనంగా భావిస్తున్న వాళ్లు తమ ఇల్లు.. వాకిళ్లను సైతం అమ్ముకుని జీవితాలను ఈ బెట్టింగులకు అంకితం చేసి.. తీవ్రస్థాయిలో నష్ట పోతున్నారు. ఇక, నెల్లూరులో ఇటీవల కాలంలో వెలుగు చూసిన క్రికెట్ బెట్టింగ్ కుంభకోణం మరింత కలకలం సృష్టిస్తోంది. యువత చెడు మార్గం పట్టకుండా […]
రేపు కొడుకు పెళ్లి… టీడీపీ ఎమ్మెల్యే ఏం చేశారంటే… దటీజ్ జీవి
సొంతం లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడవోయ్! అన్నారు గురజాడ అప్పారావుగారు. వాస్తవానికి రాజకీయాల్లోకి వచ్చేవాళ్లు… లాభం మొత్తం మానుకుని మీకే సేవచేస్తాం.! అని ప్రమాణం కూడా చేస్తారు. కానీ.. ఆతర్వాత ఏమవుతుందో ఏమో.. అనూహ్యంగా యూటర్న్ తీసేసుకుంటారు. జనాల్ని మళ్లీ ఐదేళ్ల దాకా కలిసే ప్రయత్నమూ చేయరు. వాళ్ల కష్టాలను తీర్చే ప్రయత్నమూ చూడరు. అయితే, అందరూ అలాగే ఉంటారా? అంటే.. కాదనే చెప్పాలి.. తాజా పరిణామంతో! తెల్లవారి కొన్ని గంటల్లో తన కుమారుడి వివాహం […]
టీఆర్ఎస్ లో రాజకీయంగా పెను మార్పు ..ఎంపీ ఔట్!
పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎలా జరుగుతుందో ? ఊహించడం కూడా కష్టం. గంట కిందటి వరకు అంటి పెట్టుకున్న నేతలు.. మరో గంటలో విడిపోయి వేరు కుంపట్లు పెట్టుకున్న పరిస్థితి రాజకీయాలది. కాబట్టి.. రాజకీయాలన్నాక ఎవరూ శాశ్వత మిత్రులు ఉండరు. అలాగని ఎవరూ శాశ్వత శత్రువులూ ఉండవు. కాంగ్రెస్‌లో గతంలో అనేక పదవులు అనుభవించి, ఉమ్మడి ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి చక్రం తిప్పిన దళిత నేత ధర్మపురి శ్రీనివాస్ అందరికీ సుపరిచితుడే. మరి అంతలా […]
నంద్యాలలో శిల్పా గెలుపుకు కేసీఆర్,జగన్… అసలు ప్లాన్ ఇదే!
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం గడువు ముగిసేందుకు మరో వారం రోజులు కూడా లేదు. గెలుపుపై అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ ధీమాగానే ఉన్నాయి. ఈ ఉప ఎన్నికపై ఒక్క ఏపీలోనే రూ.1000 కోట్ల బెట్టింగ్ జరుగుతోంది. జగన్ 15 రోజుల పాటు అక్కడే మకాం వేస్తున్నాడు. ఇక రేపు బాలయ్య అక్కడ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ మరుసటి రోజు సీఎం చంద్రబాబు దిగుతున్నాడు. టీడీపీ తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ తరపున ఎమ్మెల్యేలు ఓవరాల్‌గా […]
ముద్రగడ ముద్ర చెరిగిపోతుందా?!
అవును! కాపు సమాజాన్ని తన జాతి అంటూ భుజాల మీదకి ఎక్కించుకున్న నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. కాపు జాతి కోసం ఆయన ఏం చేయడానికైనా వెనుకాడని నేతగా ఇటీవల కాలంలో భారీగా గుర్తింపు పొందారు. మా కంటూ ఓ నేత ఉన్నాడు అని కాపులు చెప్పుకొనేలా ముద్రగడ ఎదిగిపోయారు. ఈ క్రమంలోనే ఆయన 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపు జాతికి రిజర్వేషన్ కల్పిస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలని పదే పదే డిమాండ్ […]
