పాలిటిక్స్ అన్నాక ఎక్కడికక్కడ మాటలు మారిపోతుండాలి. ఒకరిని ఇంద్రుడంటే.. మరొకరిని చంద్రుడనాలి. లేకపోతే.. పాలిటిక్స్‌లో పస ఉండదు! ఈ వైఖరిని బాగా అవలంబించుకున్న వారికి ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోయిన మన తెలుగు వాడు వెంకయ్యనాయుడు ముందుంటారు. బాబును ఆయన పొగిడినట్టు బహుశ ఎవరూ పొగిడి ఉండరు. తన ప్రాసలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్న వెంకయ్య.. బాబుపై పొగడ్తలతో అటు బీజేపీ వాళ్ల కన్నా కూడా టీడీపీలోనే ఆయన ఫాలోయింగ్ పెంచుకున్నాడని అంటారు. ఇక, ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్లిపోవడంతో ఆయన […]
Category: Latest News
నంద్యాలలో వైసీపీకి హైప్ వెనక కుట్ర జరుగుతోందా..!
అవును! అందరూ ఇప్పుడు ఈ విషయంపైనే దృష్టి పెట్టారు. నంద్యాల మాదే.. నంద్యాల సీటు మాకే! అంటూ ఊరూ వాడా తిరుగుతూ చాటింపు వేస్తున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు, రోజా లాంటి ఫైర్ బ్రాండ్ లైతే.. నంద్యాలలో గెలుపు ఎవరిదో తెలిసిపోయిందంటూ.. నర్మగర్భంగా తమ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి గెలిచేశాడని ఆమె ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతోంది. అదేవిధంగా మిగిలిన నేతలు కూడా వైసీపీదే గెలుపని, టీడీపీ కేవలం నామ్‌కేవాస్తే.. పోటీ మాత్రమేనని, నిజంగా వార్ వన్ సైడ్ […]
టీడీపీలో చిన రాజప్ప కుల కలకలం…చంద్రబాబు ఫైనల్ వార్నింగ్
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల వేల టీడీపీలో కుల కలకలం రేగింది. టీడీపీకి బలమైన వెన్నుదన్నుగా ఉండే ఓ ప్రధాన సామాజికవర్గంపై డిప్యూటీ సీఎం చినరాజప్ప చేసిన వ్యాఖ్యలు చినికిచినికి గాలివానలా మారినట్టు తెలుస్తోంది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలను సీఎం చంద్రబాబు చినరాజప్పకు అప్పగించారు. అయితే అక్కడ ఎన్నికల నిర్వహణలో చినరాజప్పపై చాలా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ కొంతమంది తన అనుచరులైన వీక్ క్యాండెట్లకు ఆయన టిక్కెట్లు కేటాయించారన్న విమర్శలు వచ్చాయి. ఇక కాకినాడ కార్పొరేషన్‌లో టీడీపీకి […]
40 ఏళ్ల అనుభవంలో ఎప్పుడూ లేని కంగారు..!
నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎప్పుడూ పడని కంగారు.. ఇప్పుడు పడుతున్నారు. ఈ సమయంలో ఎన్నో ఉప ఎన్నికలను అవలీలగా హ్యాండిల్ చేసిన ఆయన.. ఇప్పుడు ఒకే ఒక్క ఎన్నికలో గెలుపు కోసం ఎంతో టెన్షన్ పడుతున్నారు. అమరావతి, పోలవరం అని నిత్యం చెప్పే ఆయన.. ఇప్పుడు నంద్యాల.. నంద్యాల అంటూ కొత్త పల్లవి అందుకున్నారు!! కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటివరకూ ఏ నియోజకవర్గానికి ఇవ్వని రేంజ్‌లో నంద్యాలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు!! […]
పవన్ గురించి రోజా కొత్త భాష్యం!
నంద్యాల ఉప ఎన్నికకు గడువు సమీపిస్తున్న కొద్దీ.. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఒకరిని మించి మరొకరు మాటలతో గేమ్ ఆడేస్తున్నారు. ఇక, ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన జబర్డస్త్ రోజా.. మరింతగా రెచ్చిపోయింది. నంద్యాలలో గెలుపు వైసీపీదేనని చెప్పింది. ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని, అందుకే పవన్ కళ్యాణ్ తెలివిగా వ్యవహరించి.. తాను ఎవరికీ మద్దతు ప్రకటించలేదని కొత్త భాష్యం చెప్పుకొచ్చింది. ఒక వేళ పవన్ ఎవరికైనా మద్దతిచ్చినా.. వైసీపీ […]
ఆ టీడీపీ ఎమ్మెల్యేను ఆదర్శంగా తీసుకోమంటోన్న జగపతిబాబు
ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు ప్రశంసలు కురిపించాడు. జగపతిబాబు విలన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ జయ జానకీ నాయక సక్సెస్ మీట్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని హంసలదీవిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర సిబ్బంది, పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఓ ఫైట్‌ను హంసలదీవి వద్ద చిత్రీకరించారు. ఇది సినిమాకే […]
తెలంగాణ పాలిటిక్స్‌లో కులాల కుంపటి
బంగారు తెలంగాణ సాకారం అవుతుందని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకు అక్కడి రాజకీయ నేతలు.. కులాల తెలంగాణను చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం మింగుడు పడడం లేదు. వాస్తవానికి ఏపీలో మాత్రమే కులాల కుమ్ములాటలు ఉన్నాయని, అక్కడ మాత్రమే రాజకీయాలు కులాలతో నిండిపోయాయని గతంలోనే అనేకసార్లు టీఆర్ ఎస్ అధినేతగా, సీఎంగా కూడా కేసీఆర్ విమర్శించారు. అయితే, ఇప్పుడు మాత్రం తెలంగాణలో కులాల కుంపట్లు రాజుకున్నాయి. కులం కార్డుతో ఒకరి నొకరు ఓడించుకునేందుకు, కులం కార్డుతో ప్రజల్లో బలంగా […]
నంద్యాల క్లైమాక్స్‌లో టీడీపీకి చెంప దెబ్బ
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం క్లైమాక్స్‌లో టీడీపీకి అదిరిపోయే చెంపదెబ్బ తగిలింది. ఇక్కడ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడానికి కొద్ది రోజుల ముందే చంద్రబాబు నంద్యాల నియోజకవర్గంలో ఉన్న అధికారులను అందరిని ట్రాన్స్‌ఫర్ చేసేసి తనకు అనుకూలంగా ఉండేవాళ్లను వేయించుకున్నారు. ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు, ఎస్పీ, ఐజీ, డీఐజీ ఇలా అందరిని బదిలీ చేసేసి కొత్తవాళ్లను అక్కడ బాబు సెట్ చేశారు. ఉప ఎన్నిక వేళ నోటిఫికేషన్ వస్తే తాను చెప్పినట్టు చేయాలని, అధికార టీడీపీకి అనుకూలంగా […]
రోజాపై వేణు మాధవ్ చేసిన కామెంట్లు చూస్తే షాకే (వీడియో)
నంద్యాల ప్రచారం రచ్చ రచ్చగా మారుతోంది. అటు అధికార టీడీపీ వాళ్లు, ఇటు విపక్ష వైసీపీ వాళ్లు పరస్పరం తిట్ల విషయంలో పోటీపడి మరీ విమర్శలు చేసుకుంటున్నారు. జగన్, రోజా, బాలయ్య, చంద్రబాబు, వేణు మాధవ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ అభ్యర్థులు కాకుండా స్టేట్ వైడ్ సెలబ్రిటీలు చాలా మందే మకాం వేసి తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. రోజా ఎక్కడైనా ఎంట్రీ ఇస్తే ఆ ప్రచారం ఎలా ఉంటుందో ప్రత్యేకించి […]
