టీడీపీ ఎమ్మెల్యేగా పోసాని..!

అవున్రాజా! డైలాగులు పేల్చ‌డంలో దిట్ట‌.. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న మాట‌ల ర‌చ‌యిత‌, న‌టుడు, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళి.. త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నార‌ని వార్త హ‌ల్ చేస్తోంది. ఆయ‌న‌కు రాజ‌కీయాలు కొత్త‌కాదు. రాజ‌కీయ డైలాగులూ కొత్త‌కాదు. గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు ఆపార్టీ త‌ర‌ఫున గుంటూరు జిల్లా చిల‌కలూరి పేట నుంచి పోటీ చేశాడు. అయితే, అనూహ్యంగా అప్ప‌టి ప్ర‌తిపాటి పుల్లారావు గాలికి ఈయ‌న కొట్టుకుపోయాడు. దీంతో ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు […]

ప‌శ్చిమ‌లో పంచాయితీలు చేయ‌లేక చేతులెత్తేసిన బాబు

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా టీడీపీకి ఎంత కంచుకోటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని 2 ఎంపీ సీట్ల‌తో పాటు 15 ఎమ్మెల్యే సీట్ల‌ను టీడీపీ గెలుచుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన‌ప్ప‌టి నుంచి ఈ జిల్లాలో అధికార పార్టీ నాయ‌కుల మ‌ధ్య గ్రూపు రాజ‌కీయాల‌తో చంద్ర‌బాబుకు రోజూ ఏదో ఒక త‌ల‌నొప్పిగా మారుతోంది. ఇక్క‌డ చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపు రాజ‌కీయాలు రాజ్య‌మేలుతున్నాయి. గ‌తంలో మంత్రిగా ఉన్న పీత‌ల సుజాత‌కు, ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు ప‌డ‌దు. బాబుకు […]

బీజేపీతో వైసీపీ పొత్తు…. సీట్ల డీల్ ఇదే..!

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న అధికార టీడీపీ+బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌లిసుండే ఛాన్సులు లేవ‌ని ప్రచారం జ‌రుగుతోంది. కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు కూడా అందుకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు అయిన మాజీ కేంద్ర మంత్రి ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోతుండ‌డం, ఇక ఇప్పుడు ఏపీ బీజేపీ అంతా చంద్ర‌బాబును టార్గెట్ చేసే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ఏపీలో బీజేపీ టీడీపీ మ‌ధ్య ఫ్యూచ‌ర్‌లో వార్ ఓ […]

పీకే స‌ర్వేలో ఈ టీడీపీ ఎమ్మెల్యేల‌పై యాంటీ రిపోర్ట్ 

`ప్ర‌జ‌ల‌కు నిరంతరం చేరువ‌కావాలి. వారికి అందుబాటులో ఉండాలి. ఏ స‌మ‌స్య వ‌చ్చినా వెంట‌నే ప‌రిష్క‌రించాలి` ఇదీ పార్టీ ఎమ్మెల్యేల‌కు సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్న‌మాట‌. ప‌లు స‌ర్వేల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి సెగ‌లు ర‌గులుతున్నాయ‌న్న విష‌యం గ్ర‌హించిన ఆయ‌న ఇలా చెబుతున్నా.. వారు మాత్రం తీరు మార్చుకోవ‌డం లేద‌ట‌. ఇప్పుడు వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ ఏరికోరి తెచ్చుక‌న్న వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేలోనూ ఇదే ఫ‌లితాలు రావ‌డంతో వైసీపీ శ్రేణులు సంబ‌ర‌ప‌డుతున్నాయి. కేవ‌లం వైసీపీ నేత‌ల […]

మంచు విష్ణుకి యాక్సిడెంట్‌

టాలీవుడ్ హీరో మంచు విష్ణు షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. మలేషియాలో షూటింగ్ జరుగుతుండగా ఆయనకు ప్రమాదం జరిగింది. ఈ విష‌యం తెలియ‌డంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ మొత్తం ఇప్పుడు షాక్‌లో ఉంది. విష్ణు హీరోగా తెరకెక్కుతున్న‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్ మలేషియాలో నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఓ బైక్ రేస్ సీన్ షూట్ చేస్తుండ‌గా బైక్ స్కిడ్ అవ్వ‌డంతో ఈ యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే చిత్ర‌యూనిట్ విష్ణును మలేసియాలోని పుత్రజయ ఆసుపత్రికి త‌ర‌లించారు. […]

రాజధాని రేసులో ముర‌ళీమోహ‌న్, నారా బ్రాహ్మ‌ణి

ముర‌ళీమోహ‌న్ ఏపీ సీఎం చంద్ర‌బాబును బాగా ఇబ్బంది పెట్టేస్తున్న‌ట్టు ఏపీ టీడీపీ ఇన్న‌ర్ కారిడార్‌లో ఒక్క‌టే చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం రాజ‌మండ్రి ఎంపీగా ఉన్న మాగంటి ముర‌ళీమోహ‌న్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. 2009 ఎన్నిక‌ల్లో మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో 1.50 వేల పైచిలుకు ఓట్ల‌తో ఘ‌న‌విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచాక ముర‌ళీమోహ‌న్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు పూర్తిగా దూర‌మైపోయారు. ఆయ‌న‌కు వీలున్న‌ప్పుడు […]

మంత్రి పితాని గ్రాఫ్ ఎలావుంది…2019లో గెలుస్తాడా?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో డెల్టాలో ఉన్న ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో కుల ఈక్వేష‌న్లే ఎప్పుడూ కీల‌క‌పాత్ర పోషిస్తుంటాయి. ఇక్క‌డ కులాల లెక్క‌లే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల గెలుపోట‌ముల‌ను డిసైడ్ చేస్తుంటాయి. ప‌శ్చిమ‌ డెల్టాలో కాపులు వ‌ర్సెస్ శెట్టిబ‌లిజ వార్ ఎప్పుడూ ఉంటుంది. శెట్టిబ‌లిజ సామాజిక‌వ‌ర్గానికి చెందిన పితానికి ముందునుంచి కుల బ‌లం మెండు. పెనుగొండ నుంచి ఒక‌సారి, ఆచంట నుంచి రెండుసార్లు గెలిచిన పితాని ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పితాని గ‌త ఎన్నిక‌ల‌కు ముందు […]

నంద్యాల‌లో వైసీపీ షాడో టీంలు!

భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంలో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి వ‌చ్చే నెలలో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ కూడా జారీ చేసింది. అయితే, ఈ స్థానం నుంచి గెలిచి తీరాల‌ని ఏపీ అధికార ప‌క్షం టీడీపీ, విప‌క్షం వైసీపీలు గ‌ట్టి  పంతం ప‌ట్టాయి. ఈ సీటు త‌మ‌దేన‌ని వైసీపీ, లేదు త‌మ అభ్య‌ర్థిగా ఉన్న భూమా మ‌ర‌ణించాడు కాబ‌ట్టి ఇది త‌మ‌దేన‌ని టీడీపీలు వాదిస్తున్నాయి. ఇక‌, అధికార ప‌క్షం ఎన్నిక‌ల […]

చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా ఆ న‌లుగురు మంత్రులు

సామాజిక వ‌ర్గాలను సంతృప్తి ప‌ర‌చ‌డానికో, అసంతృప్తులను బుజ్జ‌గించ‌డానికో, పార్టీ బ‌లోపేతానికో కారణం ఏదైనా ఒకే జిల్లాలో ఇద్ద‌రికి మంత్రి ప‌దవులు క‌ట్ట‌బెట్టారు సీఎం చంద్ర‌బాబు! ఇద్ద‌రూ స‌మన్వ‌యంతో ప‌నిచేసి పార్టీని బ‌లోపేతం చేస్తార‌ని ఆయన ఆశించారు. కానీ ఇప్పుడు వీరి మ‌ధ్య పచ్చ‌గడ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌గా విభేదాలు ర‌గులుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇవి పైకి క‌నిపిస్తుండ‌గా.. మ‌రికొన్ని జిల్లాల్లో అంత‌ర్గ‌తంగా కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర జిల్లాలకు చెందిన న‌లుగురు మంత్రుల‌తో అధినేత‌కు త‌ల‌నొప్పులు త‌ప్ప‌డంలేదు. ఒక‌రు య‌స్ […]