ఏపీలో అధికార టీడీపీ అటు ప్రభుత్వ పరంగాను, ఇటు రాజకీయంగాను అష్టకష్టాలు పడుతోంది. బీజేపీ నుంచి సరైన సహకారం లేకపోవడం, నియోజకవర్గాల పునర్విభజన లేకపోవడం, నిధుల లేమితో ఆశించిన మేర హామీలు నెరవేర్చలేకపోవడం, పార్టీలో ఎప్పుడూ లేనంతగా గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు పార్టీ సంస్థాగత కమిటీల పరంగా ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా […]
Category: Latest News
షాక్: వైసీపీలోకి 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు…!
ఏపీలో అధికార టీడీపీ ఈ మూడేళ్లలో రాజకీయంగా సాధించింది ఏంటంటే అది ఒకే ఒక్కటి… విపక్ష వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం. చంద్రబాబు అభివృద్ధి ద్వారా బలోపేతం అవ్వాలన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీని బలోపేతం చేయాలనే ప్రయత్నానికి తెరదీశారు. వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు చంద్రబాబు వేసిన ఈ ఎత్తులు ఇప్పుడు బాబుకే పెద్ద ముప్పు కాబోతున్నాయి. ఏపీ టీడీపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు […]
టీడీపీ మీడియా పిచ్చి ముదిరిందా
ఎక్కడయినా.. ఎప్పుడయినా సమయం, సందర్భం, ఔచిత్యం.. పాటించి ప్రవర్తించాలి. లేకపోతే అభాసుపాలవ్వక తప్పదు. ఇప్పుడ జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు భేటీని కూడా తమకు అనుకూలంగా మలుచుకుని.. టీడీపీ అనుకూల మీడియా మరోసారి చర్చనీయాంశమైంది. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు పడుతున్న ఇబ్బందులు, వాటిపై అధ్యయనం చేసిన హార్వర్డ్ వర్సిటీ ప్రతినిధులు అందజేసిన నివేదికను చంద్రబాబుకు అంద జేసేందుకు పవన్ వెళ్లారనేది అందరికీ తెలిసిందే! కానీ ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించి.. రాష్ట్రం గురించి […]
మంత్రులతో లోకేశ్ ఆటలు చూస్తే అవాక్కవ్వాల్సిందే…
ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్రబాబు తర్వాత ఆయన తనయుడు మంత్రి లోకేశ్ నెంబర్ 2 పొజిషన్‌లోకి ఎంటర్ అయిపోయాడు. లోకేశ్ టీడీపీకి భవిష్యత్ సారథిగా ఇప్పటికే అందరూ అంగీకరిస్తుండడంతో లోకేశ్ అటు పార్టీలోను, ఇటు ప్రభుత్వంలోను క్రమక్రమంగా పట్టు సంపాదిస్తున్నాడు. ఇప్పటికే లోకేశ్ తన శాఖల్లోనే కాకుండా కొన్ని కీలక శాఖలకు సైతం అనధికారిక మంత్రిగా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. హోం, రెవెన్యూ లాంటి కీలక శాఖల్లో లోకేశ్ పెత్తనం కాస్త ఎక్కువగానే ఉంటోందన్న […]
బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిగా తెలుగు వ్యక్తి..!
దేశవ్యాప్తంగా అప్రతిహత రాజకీయ వ్యూహాలతో దూసుకుపోతోన్న బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జాతీయాధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా మోడీ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. మోడీ కేబినెట్‌లో కీలకమైన శాఖలకు మంత్రులు లేరు. ప్రస్తుతం ఆ బాధ్యతలను అదనంగా వేరే వాళ్లకు అప్పగించారు. ఈ నేపథ్యంలో గత మూడేళ్లుగా పార్టీని అత్యంత సమర్థవంతంగా నడిపించిన అమిత్ షాను మోడీ తన కేబినెట్‌లోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. షా […]
ఎన్నో ఆశలతో సైకిల్ ఎక్కితే ఇప్పుడు ఈ పరిస్థితి
2019.. అధికార టీడీపీకి ఇది ఎంతో కీలకం కాబోతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఒకవైపు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోపక్క చుట్టూ సమస్యలు, వివాదాలు, విమర్శలు! ఇవన్నీ టీడీపీ అధినేతకు సవాళ్లు విసురు తున్నాయి. ఇంకా రెండేళ్ల కంటే తక్కువ సమయం ఉన్నా.. ఇదంతా టీడీపీకి ముళ్ల బాటే కానుంది. నియోజకవర్గాల పెంపు లేనట్టేనని కేంద్రం స్పష్టంచేయడంతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకుని టీడీపీలోకి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి చెలరేగుతోంది. ఈనేపథ్యంలో 2019 ఎన్నికల్లో […]
తమ్ముడి బాటలోనే అన్న.. కారణాలివే
రక్తసంబంధం వేరు.. రాజకీయాలు వేరు! కానీ నంద్యాలలో ఇప్పుడు రక్తసంబంధం వైపు రాజకీయాలు నడుస్తున్నాయి. తమ్ముడి నడిచిన బాటలోనే అన్న కూడా పయనించేందుకు సిద్ధమైపోయారు. తమ్ముడు శిల్పా మోహనరెడ్డి పార్టీ వీడుతున్నా.. వేరే పార్టీ నుంచి బరిలోకి దిగినా.. తాను మాత్రం టీడీపీలోనే ఉంటానని, పార్టీ విజయానికే పనిచేస్తానని చెప్పిన ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణి.. ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. మరి టీడీపీలో ఉంటానని చెప్పిన ఆయన.. ఇంత సడన్‌గా పార్టీ మారాలనే నిర్ణయం తీసుకోవడానికి […]
ఏపీలో కమ్మ+కాపు కలిసే ప్లాన్
తెలుగు రాజకీయాలకు కులాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇది ఎవరు కాదన్నా ? ఎవరు ఔనన్నా నిజం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాల ప్రాబల్యం బాగా పెరిగిపోయింది. ఏపీలో నిన్నటి వరకు కమ్మ వర్సెస్ రెడ్ల మధ్య అధికారం కోసం వార్ జరుగుతుంటే ఇప్పుడు ఈ పోరులో కాపులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలంగాణలో అధికారం కోసం ఇప్పుడు వెలమ వర్సెస్ రెడ్ల మధ్య పోరు జరుగుతోంది. ఇక తెలంగాణలో కంటే ఏపీలోనే […]
టీడీపీలో కేశినేని నిర్వేదం…ఆ పార్టీ వైపు చూపు..?
కేశినేని నాని విజయవాడ ఎంపీ… ముక్కుసూటి తనానికి మారుపేరు. కేశినేని ట్రావెల్స్ అధినేతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాని 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీలో చేరిన కొద్ది రోజులకే బయటకు వచ్చిన నాని చంద్రబాబు హామీతో గత ఎన్నికలకు రెండేళ్ల ముందే ఎంపీ సీటుపై హామీ పొందారు. చంద్రబాబు పాదయాత్రలో ఖర్చంతా భరించడంతో పాటు పార్టీకి ఆర్థికంగా మేళ్లు చేసిన ఆయనకు చంద్రబాబు గత ఎన్నికల్లో హామీ […]
