టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. అయితే గత రెండు రోజులుగా ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. […]
Category: Latest News
దసరా కానుకగా కెజియఫ్ 2..?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కిన సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 1 ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీయఫ్’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కె.జి.యఫ్: ఛాప్టర్ 2’. ఈ సినిమా జులై 16న తెరపైకి రావాల్సి ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. దీంతో థియేటర్ల మూతపడాయి. అయితే, దసరా పండగ నాటికి విడుదల చేసేందుకు […]
కియారా రెమ్యునరేషన్ ఏంటంటే..?
భారత్ నేను అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది కియారా అద్వానీ. వినయ విధేయ రామ సినిమాలలో రామ్ చరణ్ సరసన నటించి తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కియారా అద్వానీ అడిగిన ఆమెను రెమ్యునరేషన్ చెల్లించలేక కొందరు టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు బదులుగా మరో హీరోయిన్ కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కియారా అద్వానీ ఒక్కో సినిమాకు ఏకంగా రూ.2.5 కోట్ల రూపాయలు రెమ్యునరేష న్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. […]
వ్యాక్సిన్ తీసుకున్న బుమ్రా..?!
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు సెలెబ్రెటీలు, క్రికెటర్లు, ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్నాడు. మంగళవారం వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్న బుమ్రా.. అందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని సూచించాడు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, పుజారా, రహానే తదితరులు వ్యాక్సిన్ తొలి […]
లాక్‌డౌన్ ఎఫెక్ట్ : బారులు తీరిన మద్యం ప్రియులు..!
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రాల్లో ఈ వైరస్ బారి నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించారు. ఇక కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో మందుబాబులు అలెర్ట్ అయ్యారు. మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు. ఇక రాష్ట్రంలో ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటన వేలువడడంతో మద్యం దుకాణాల వద్ద మందుబాబు క్యూ కట్టారు. కరోనాను పట్టించుకోకుండా, […]
న్యూడ్ ఫోటోలు అడిగిన నెటిజన్.. చిన్మయి అదిరిపోయే సమాధానం..!
చిన్మయి శ్రీపాద..ఈమె డబ్బింగ్ ఆర్టిస్టుగా, ప్లేబాక్ సింగర్‌గా కంటే ఫెమినెస్ట్‌గా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఓ విషయంపై ఈమె వార్తల్లోకెక్కింది. న్యూడ్స్ పంపాలంటూ చిన్మయికి ఓ యువకుడు మెసేజ్ చేశాడు. ఆ యువకుడు చేసిన మెసేజ్‌కి షాకింగ్ రిప్లై ఇచ్చింది. ‘దయచేసి స్వయంతృప్తి చెందు. ఎలా చేసుకోవాలో తెలియకపోతే గైనకాలజిస్టుతో మాట్లాడు. వాళ్లు ఎలా చేయాలో చెబుతారు అలాగే హైజీన్ ప్రాక్టీస్ చేయి. స్వయంతృప్తి చెందడం తప్పేకాదు..అని రిప్లై ఇచ్చింది. అంతేకాకుండా ఇంకొన్ని విషయాలను […]
ఆ ఇబ్బందుల్లో శృతి..?
ఇప్పుడున్న హీరోయిన్లలో శృతి హాసన్ కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కమల్ హాసన్ ముద్దు బిడ్డ అయిన శృతి హాసన్ అటు తెలుగు, ఇటు తమిళంలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన డ్యాన్స్, నటన, అందంతో కుర్రాళ్ల మనసులను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈమె అప్పుడప్పుడూ కొన్ని బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లోకెక్కడం తెలిసిందే. ఇప్పుడు కూడా ఈమె ఓ కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆమె ఇండిపెండెంట్‌గానే ముందుకు […]
బ్రేకింగ్: తెలంగాణలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్!
కంటికి కనిపించని కరోనా వైరస్ దేశంలోని అన్ని రాష్ట్రాలను మళ్లీ అతలా కుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మే 12(రేపు) ఉదయం 10 గంటలనుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 […]
కేరళ ‘ ఐరన్ లేడీ’ మృతి…!
కమ్యూనిస్టులు..నిస్వార్థంతో ప్రజాసేవ చేస్తుంటారు. ప్రజల కోసం ధర్నాలు, పోరాటాలు, ఆందోళనలు చేస్తూ ప్రజలకు చెందాల్సిన న్యాయం కోసం పోరాడుతుంటారు. ఆ కోవకు చెందిన ఓ యోధురాలు నేడు అనారోగ్యంతో కన్నుమూశారు. కేరళలోని దిగ్గజ కమ్యూనిస్ట్ కేఆర్ గౌరీ మంగళవారం తన తుదిశ్వాస విడిచారు. కేరళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపాయి. 102 సంవత్సరాలు వయసుగల ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆమె అనారోగ్యం రీత్యా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. […]









