ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో రెండవ హీరోయిన్‌గా నటించిన సంజనా గల్రానీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే మాదక ద్రవ్యాల కేసుని ఎదుర్కొంటున్న ఈ అమ్మడిపై మరో కేసు నమోదైంది. అదీకూడా బెంగుళూరు కోర్టు ఆదేశం మేరకు బెంగుళూరు కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 2019 డిసెంబరు 24న కన్నడ చిత్ర నిర్మాత వందన జైన్ కిస్మస్ పండగను పురస్కరించుకుని కొంతమంది సినీ సెలెబ్రిటీలకు ఓ […]
Category: Latest News
ఆహా ఓటిటిలో సాయి పల్లవి సినిమా..?
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా ‘అథిరన్’.. ‘అనుకోని అతిథి’ పేరుతో డబ్బింగ్ చేసి తెలుగు ఓటీటీ ఆహాలో రిలీజ్ చేసేందుకు డేట్స్ ఫిక్స్ చేస్తూ తాజాగా పోస్టర్ వదిలారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు వివేక్ దర్శకత్వం వహించగా మే 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. కేరళలో 1970లలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్‌గా నిలిచింది. […]
హైకోర్ట్ కి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు..?
ఏపీ ఆక్సిజన్ అందక చాలా మంది కరోనా రోగులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. కోవిడ్ నియంత్రణపై గుంటూరుకి చెందిన సామాజిక కార్యకర్త జర్నలిస్ట్ తోట సురేష్ బాబు, ఏపీ సిఎల్ఏ, ఐలు, సుమోటో పిటిషన్ లపై విచారణ జరిగింది. కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయన్న రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా కేంద్రం […]
ఆకట్టుకుంటున్న సుధీర్ `గాలోడు` ఫస్ట్ లుక్!
ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా సూపర్ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్.. కేవలం కమెడియన్‌గానే కాకుండా యాంకర్‌గా కూడా బుల్లితెరపై స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. టీవీ షోలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న సుధీర్.. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా.. నటన పరంగా సుధీర్‌కు మంచి మార్కులే పడ్డారు. ఇక ఈయన తాజా చిత్రం గాలోడు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం […]
మహేష్ ఇంటి ముందు పెరిగిన బందోబస్తు..కారణం అదే?!
ప్రస్తుతం సెకెండ్ వేవ్ రూపంలో కరోనా వైరస్ దేశవ్యాప్తంగా స్వయం విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక సినీ తారలందరు కూడా కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, తమన్నా, పూజా హెగ్డే, సోనూసూద్, నివేదా థామస్, దిల్ రాజు, జెనీలియా, రకుల్ ప్రీత్ సింగ్, రాజమౌళి ఇలా ఎందరో కరోనా బారిన […]
సోనూసూద్‌ను లైన్‌లో పెట్టిన క్రిష్..పెద్ద స్కెచ్చే వేశాడుగా?!
సోనూసూద్.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారు మెగిపోతోంది. కరోనా విపత్కర సమయంలో ఎంతో మందికి సేవ చేస్తూ అండగా నిలుస్తున్నాడీయన. సాయం కోరిన వారికి కాదు, లేదు అనకుండా.. ఆదుకుంటూ అందరి చేత రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సోనూసూద్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అయితే ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే.. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సోనూసూద్‌ను లైన్‌లో పెట్టి.. ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను సెట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సోనూ […]
పవన్ సినిమా.. అవన్నీ పుకార్లే అంటున్న బండ్ల గణేష్!
ఇటీవల వకీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే ఇటీవల గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీని నిర్మించిన బండ్ల గణేష్‌తో కూడా ఓ సినిమా చేసేందుకు పవన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. తరచూ పవన్ ను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. దీంతో వీరి ప్రాజెక్ట్‌పై […]
జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు విజ్ఞప్తి..ఏమిటంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మే 20న తన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయన అభిమానులు సెలెబ్రేషన్స్, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆయన ఇంటికి వెళ్లి విషెస్ చెబుతారు. కానీ ఈసారి లాక్ డౌన్ ఉండటం, కరోనా విజృంభిస్తుండటం, ఎన్టీఆర్ కరోనా బారిన పడటంతో అభిమానులకు ఎన్టీఆర్ తన జన్మదినానికి ఒక రోజు ముందే మెసేజ్ పెట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. “అభిమానులందరికీ […]









