కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `సుల్తాన్`. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. తమిళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలైన సంగతి తెలిసిందే. మిక్డ్స్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ డిస్నీ+హాట్ […]
Category: Latest News
పురపోరుపై తెలంగాణ ఎస్ఈసీ సంచలన నిర్ణయం..
కరోనా వైరస్ పంజా విసురుతోంది. విలయతాండవం చేస్తున్నది. సుడిగాలిలా వ్యాపిస్తూ వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నది. దీంతో అడుగు బయటపెట్టాలంటేనే జనం జంకుతున్నది. ఈ మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సైతం వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. నైట్‌కర్ఫ్యూ అమలు చేస్తున్నది. అయినప్పటికీ అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం యథాతధంగా నిర్వహించనున్న ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 30న […]
పావురంపై కేసు.. ఇదీ పంజాబ్ పోలీసుల నిర్వాకం
అనుమానం ముందు పుట్టి పోలీస్ తరువాత పుట్టాడనే నానుడి. కానీ దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. అలా మితిమీరి చర్యలు తీసుకోవడం ఒక్కో సారి హాస్యాస్పదంగా మారుతుంటాయి. మరికొన్ని సార్లు అమాయకులను ఇబ్బందుల పాల్జేస్తాయి. ముందు వెనకా చూడకుండా అనుమానం వస్తే చాలు కేసులను బుక్ చేయడం ఆ తరువాత పొరపాటు జరిగిందని చేతులు పిసుక్కోవడం వారి అలవాటు. తాజాగా పంజాబ్ రాష్ట్ర పోలీసుల చర్య కూడా అలాగే మారింది. గూడచర్యం చేస్తోందనే సాకుతో ఏకంగా […]
95శాతం స్థానికులకే ఉద్యోగాలు.. రూట్ క్లియర్..!
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దశాబ్దాల ఆకాంక్ష నెరవేరింది. తెలంగాణ యువతకు కేంద్రం తీపి కబురును అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపింది. ఫలితంగా ఇకపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నియమాకాల్లో 95శాతం స్థానికులకే దక్కనున్నాయి. అదేవిధంగా జిల్లాల ఏర్పాటుపైనా సుముఖత వ్యక్తం చేసింది. ఆమోదింది నోటిఫికేషన్ విడుదల చేయగా, అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా వేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తరువాత తెలంగాణలో 31 జిల్లాలు, ఏడు […]
ఆక్సిజన్ సిలిండర్ లీకై 22 మంది రోగులు మృతి..!
ఒకవైపు దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నది. అదేవిధంగా తీవ్ర ఆక్సిజన్ కొరత నెలకొన్న నేపథ్యంలోనూ పలువురు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటిక ఆక్సిజన్‌ను పొదుపుగా వాడాలని ప్రభుత్వం, అధికారులు వైద్యశాలలు, సిబ్బందికి సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఆ దిశగా వైద్యసిబ్బంది దృష్టి సారించినట్లు కనబడడం లేదు. మహారాష్ట్ర నాసిక్ లోని ప్రముఖ జాకీర్ హుస్సేన్ వైద్యశాలలో ఆక్సిజన్ ట్యాంక్ లీకై ఏకంగా 22 మంది రోగులు మృత్యువాత పడడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. చర్చనీయాంశంగా […]
గుడ్లు పెట్టని కోళ్లు.. పోలీసులకు యాజమాని ఫిర్యాదు..!
కోళ్లు గుడ్లు పెట్టకపోవడం ఏమిటీ? ఈ విషయమై యాజమానికి ఏకంగా పోలీసులను ఆశ్రయించడం ఏమిటీ? వినడానికి విడ్డూరంగా ఉంది కదూ. అయినా మీరు చదివింది నిజమే. కొన్ని సార్లు పోలీసులకు ఇలాంటి విచిత్రమైన సంఘటనలు అనుభవంలోకి వస్తుంటాయి. మా ఇంట్లో పిల్లి తప్పిపోయింది. మా మేక ఎటో వెళ్ళిపోయింది వెతికి పెట్టండి అంటూ కొందరు కేసులు పెట్టిన ఉదంతాలున్నాయి. అయితే ఇది అంతగా ఆశ్చర్యపోనవసరం లేదు. కొట్టిపారేయడానికీ వీలు లేదు. ఆ కోళ్లు, గుడ్లు పెట్టకపోవడానికి పెద్ద […]
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర చాలా చీప్.. ఎంతో తెలుసా..?
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. మరోవైపు ఆక్సిజన్, టీకాల కొరత నెలకొంది. ఇదే అదునుగా ప్రైవేట్ దవాఖానాలు దోపిడీకి తెగబడుతున్నాయి. వందల్లో ఉన్న టీకాను వేల రేటుకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కోవీషీల్డ్ ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ ఇవాళ టీకాల ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు, ప్రైవేటు హాస్పిటళ్లలకు ఒక డోసు కోవీషీల్డ్ టీకాను రూ.600కు ఇవ్వనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా తెలిపారు. ఈ మేరకు […]
`శ్రీరామనవమి`కి మంచి ట్రీట్ ఇచ్చిన నాగశౌర్య!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా.. నాగశౌర్య అభిమానులకు వరుడు కావలెను మేకర్స్ మంచి ట్రీట్ ఇచ్చారు. […]
రైలుకు ఎదురెల్లి ఉద్యోగి సాహసం.. మంత్రి ప్రశంసలు
మాములుగా ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే పనిచేయరు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు? అని ప్రజల్లో ప్రచారం సాగుతుంటుంది. కానీ ఓ రైల్వే ఉద్యోగి చేసిన సాహాసం తెలిస్తే మీ అభిప్రాయాన్ని కచ్చితంగా మార్చుకుంటారు. ఆ ఉద్యోగిని అభినందించక మానరు. సినీఫక్కీలో ప్రాణాలను ఫణంగా పెట్టి వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి మరీ బాలుడి ప్రాణాలను కాపాడాడు మరి. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన రైల్వే మంత్రిత్వ శాఖ ఆ ఉద్యోగిని ప్రశంసించడంతో పాటు బహుమతి […]