జూలై 1 నుంచి విద్య సంస్థలు ప్రారంభం…!

June 19, 2021 at 4:14 pm

ప్ర‌స్తతం తెలంగాణ‌లో ఉన్న లాక్‌డౌన్ నిబంధ‌లు రేప‌టితో ముగుస్తుండ‌టంతో కేసీఆర్ అధ్కక్ష‌త‌న భేటీ అయిన కేబినెట్ ఈరోజు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పూర్తిగా ఎత్తివేసింది. కేబినెట్‌కు హాజ‌రైన వారిటో ఎక్కువ మంది మంత్రులు లాక్‌డౌన్ ఎత్తివేయ‌డానికి సమ్మ‌తి ఇవ్వ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌భుత్వం. కాగా ఇప్పుడు రాష్ట్రంలో సెకండ్‌వేవ్ కంట్రోల్‌కు వ‌చ్చింద‌ని అధికారులు చెప్ప‌డంతో నైట్ క‌ర్ఫ్యూ కూడా అవ‌స‌రం లేద‌నే భావ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది.

దీంతో రాష్ట్రంలో ఇక‌పై అన్ని కార్య‌క‌లాపాలు య‌థావిధిగా న‌డిచే అవ‌కాశం ఉంది. ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తివేయ‌డంతో స్కూళ్లు, కాలేజీల‌ను తెర‌వాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. జులై 1 నుంచి అన్ని కాలేజీలు, పాఠ‌శాల‌ల‌ను తెర‌వాల‌ని సూచించింది. విద్యార్థుల ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే హాజ‌ర‌వ్వాల‌ని చెప్పింది ప్ర‌భుత్వం. మాస్కులు పెట్టుకుని, సోష‌ల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయాల‌ని ఆదేశించారు. అలాగే టీచ‌ర్లు కూడా అన్ని రకాల క‌రోనా నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. కానీ విద్యార్థులు వ‌స్తారా లేదా అన్న‌ది మాత్రం చూడాలి.

జూలై 1 నుంచి విద్య సంస్థలు ప్రారంభం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts