త‌మిళ‌నాడులో రూ.1500కోట్ల విలువైన డ్ర‌గ్స్‌..!

దేశంలో మ‌త్తుప‌దార్థాల అక్ర‌మ ర‌వాణా య‌థేచ్ఛ‌గా కొన‌సాగుతున్న‌ది. వేల కోట్ల రూపాయాల డ్ర‌గ్స్ దేశంలోకి చొర‌బ‌డుతున్నాయి. డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణాకు స‌ముద్ర‌తీర ప్రాంతాలు, పోర్టులు కేంద్రాలుగా నిలుస్తుండ‌డం విశేషం. తమిళనాడు త‌దిత‌ర ప్రాంతాల్లోని షిప్పింగ్‌ పోర్టులో డ్రగ్స్‌ రవాణా పెరిగింది. ఇటీవ‌ల తరచుగా డ్రగ్స్‌ రవాణా చేయ‌డం, అధికారుల త‌నిఖీల్లో వెలుగుచూడ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. విదేశాల నుంచి నేరుగా డ్రగ్స్‌ రవాణా జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. తాజాగా తమిళనాడులో ప‌ట్టుబ‌డిన డ్రగ్స్‌ను చూసి అధికారులే బిత్త‌ర‌పోయారు. వాటి […]

వాటితో మాకు సంబంధం లేదు.. ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ హెచ్చ‌రిక‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) నుంచి మాట్లాడుతున్నామని మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా..? లేక ఫోన్‌లు చేస్తున్నారా..? ఎస్‌బీఐలో పర్సనల్‌ లోన్‌, ఆటో లోన్‌, బిజినెస్‌ లోన్‌ ఇప్పిస్తామని చెప్పారా..? అయితే అలాంటి కాల్స్‌ వస్తే మీరు అప్రమత్తంగా ఉండాలని, వాటితో మాకు ఎలాంటి సంబంధం లేద‌ని ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. అందుకు కార‌ణం లేక‌పోలేదు. భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ పేరుతో నకిలీ సంస్థలు సృష్టించి రుణాల పేరుతో […]

భార‌త్ ఘ‌న‌త‌.. ఐరాస కీల‌క క‌మిటీల్లో స‌భ్య‌త్వం..!

భార‌తదేశానికి అంత‌ర్జాతీయ స్థాయిలో ఖ్యాతి మ‌రింత‌గా పెరిగింది. అరుదైన అవ‌కాశాన్ని, గుర్తింపును పొందింది. ఐక్య‌రాజ్య స‌మితి (యూఎన్) లోని మూడు ముఖ్యమైన కమిటీల్లో సభ్యత్వాన్ని సాధించింది. ఆర్థిక, సామాజిక కమిటీల్లో సభ్యునిగా చేరిన భారత్‌.. మూడేండ్లుగా మహిళా సాధికారత కోసం లింగ సమానత్వం, మహిళల సాధికారత కోసం యూఎన్ ఎంటిటీ ఫర్ ఈక్వాలిటీలో భారత్ సభ్యత్వం పొందింది. ఈ సభ్యత్వం పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచ ఆహార కార్యక్రమంలో భారతదేశాన్ని ఇప్పటికే […]

ఓటీటీలో రాబోతున్న ర‌ష్మిక కొత్త సినిమా..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `సుల్తాన్‌`. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. మిక్డ్స్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుద‌ల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ప్ర‌ముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ డిస్నీ+హాట్ […]

పుర‌పోరుపై తెలంగాణ ఎస్ఈసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..

క‌రోనా వైరస్‌ పంజా విసురుతోంది. విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. సుడిగాలిలా వ్యాపిస్తూ వేలాది మంది ప్రాణాల‌ను బ‌లిగొంటున్న‌ది. దీంతో అడుగు బ‌య‌ట‌పెట్టాలంటేనే జ‌నం జంకుతున్న‌ది. ఈ మ‌రోవైపు తెలంగాణ ప్ర‌భుత్వం సైతం వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నైట్‌కర్ఫ్యూ అమలు చేస్తున్న‌ది. అయిన‌ప్ప‌టికీ అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల‌ను షెడ్యూల్ ప్ర‌కారం యథాతధంగా నిర్వ‌హించ‌నున్న ప్ర‌క‌టించ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నెల 30న […]

పావురంపై కేసు.. ఇదీ పంజాబ్ పోలీసుల నిర్వాకం

అనుమానం ముందు పుట్టి పోలీస్ త‌రువాత పుట్టాడ‌నే నానుడి. కానీ దేనికైనా ఒక హ‌ద్దు అనేది ఉంటుంది. అలా మితిమీరి చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఒక్కో సారి హాస్యాస్ప‌దంగా మారుతుంటాయి. మ‌రికొన్ని సార్లు అమాయ‌కుల‌ను ఇబ్బందుల పాల్జేస్తాయి. ముందు వెన‌కా చూడ‌కుండా అనుమానం వ‌స్తే చాలు కేసుల‌ను బుక్ చేయ‌డం ఆ త‌రువాత పొర‌పాటు జ‌రిగింద‌ని చేతులు పిసుక్కోవ‌డం వారి అల‌వాటు. తాజాగా పంజాబ్ రాష్ట్ర పోలీసుల చ‌ర్య కూడా అలాగే మారింది. గూడ‌చ‌ర్యం చేస్తోంద‌నే సాకుతో ఏకంగా […]

95శాతం స్థానికుల‌కే ఉద్యోగాలు.. రూట్ క్లియ‌ర్‌..!

సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. దశాబ్దాల ఆకాంక్ష నెర‌వేరింది. తెలంగాణ యువ‌త‌కు కేంద్రం తీపి క‌బురును అందించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన జోన‌ల్ వ్య‌వ‌స్థ‌కు ఆమోదం తెలిపింది. ఫ‌లితంగా ఇక‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టే నియ‌మాకాల్లో 95శాతం స్థానికుల‌కే ద‌క్క‌నున్నాయి. అదేవిధంగా జిల్లాల ఏర్పాటుపైనా సుముఖ‌త వ్య‌క్తం చేసింది. ఆమోదింది నోటిఫికేష‌న్ విడుద‌ల చేయగా, అందుకు సంబంధించిన నోటిఫికేష‌న్‌పై రాష్ట్ర‌ప‌తి ఆమోద‌ముద్ర కూడా వేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి త‌రువాత తెలంగాణ‌లో 31 జిల్లాలు, ఏడు […]

ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ లీకై 22 మంది రోగులు మృతి..!

ఒక‌వైపు దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. వేలాది మంది ప్రాణాల‌ను బ‌లిగొంటున్న‌ది. అదేవిధంగా తీవ్ర ఆక్సిజ‌న్ కొర‌త నెల‌కొన్న నేప‌థ్యంలోనూ ప‌లువురు మృత్యువాత ప‌డుతున్నారు. ఇప్ప‌టిక ఆక్సిజ‌న్‌ను పొదుపుగా వాడాల‌ని ప్ర‌భుత్వం, అధికారులు వైద్య‌శాల‌లు, సిబ్బందికి సూచిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆ దిశ‌గా వైద్య‌సిబ్బంది దృష్టి సారించిన‌ట్లు క‌న‌బ‌డ‌డం లేదు. మహారాష్ట్ర నాసిక్ లోని ప్రముఖ జాకీర్ హుస్సేన్ వైద్య‌శాల‌లో ఆక్సిజ‌న్ ట్యాంక్ లీకై ఏకంగా 22 మంది రోగులు మృత్యువాత ప‌డ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న‌ది. చ‌ర్చ‌నీయాంశంగా […]

గుడ్లు పెట్ట‌ని కోళ్లు.. పోలీసుల‌కు యాజ‌మాని ఫిర్యాదు..!

కోళ్లు గుడ్లు పెట్ట‌క‌పోవ‌డం ఏమిటీ? ఈ విష‌య‌మై యాజ‌మానికి ఏకంగా పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డం ఏమిటీ? విన‌డానికి విడ్డూరంగా ఉంది క‌దూ. అయినా మీరు చ‌దివింది నిజ‌మే. కొన్ని సార్లు పోలీసులకు ఇలాంటి విచిత్రమైన సంఘటనలు అనుభ‌వంలోకి వ‌స్తుంటాయి. మా ఇంట్లో పిల్లి తప్పిపోయింది. మా మేక ఎటో వెళ్ళిపోయింది వెతికి పెట్టండి అంటూ కొంద‌రు కేసులు పెట్టిన ఉదంతాలున్నాయి. అయితే ఇది అంత‌గా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. కొట్టిపారేయ‌డానికీ వీలు లేదు. ఆ కోళ్లు, గుడ్లు పెట్టకపోవ‌డానికి పెద్ద […]