బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన సీఎం జ‌గ‌న్‌..వీడియో వైర‌ల్‌!

ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎప్పుడూ ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు, ప్రజా సంబంధ విషయాలతో తలమునకలుగా ఉంటారు. అటువంటి ఆయ‌న‌ తాజాగా బ్యాట్ ప‌ట్టి ఎంతో ఉల్లాసంగా క్రికెట్ ఆడారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కడప జిల్లా పర్యటనలో భాగంగా తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంను శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సందర్శించారు.స్టేడియంలో అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం సరదాగా స్టేడియంలో క్రికెట్‌ […]

`నార‌ప్ప‌` నుంచి న్యూ అప్డేట్‌..వెంకీ ఫ్యాన్స్‌కు సూప‌ర్ ట్రీట్ రెడీ!

విక్ట‌రీ వెంక‌టేష్‌, శ్రీకాంత్ అడ్డాల కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించ‌గా..కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. త‌మిళంలో హిట్ అయిన అసురన్ చిత్రానికి ఇది రీమేక్‌. ఇప్ప‌టికే షూటింగ్‌తో పాటు సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. వెంకీ ఫ్యాన్స్‌కు సూప‌ర్ ట్రీట్ రెడీ చేశారు నార‌ప్ప మెక‌ర్స్‌. […]

`స్టాండప్‌ రాహుల్‌` టీజర్ వ‌చ్చేసింది..మీరు చూశారా?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ త‌రుణ్ తాజా చిత్రం స్టాండప్‌ రాహుల్‌. కూర్చుంది చాలు అన్న‌ది ట్యాగ్ లైన్‌. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. డ్రీమ్‌ టౌన్‌ ప్రొడక్షన్స్, హైఫైవ్‌ పిక్చర్స్‌ పతాకాలపై నంద కుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను ద‌గ్గుబాటి రానా విడుద‌ల చేశారు. హెడ్ ఫోన్స్ పిచ్చ లైట్ […]

వైరల్ అవుతున్న మిల్క్ బ్యూటీ డాన్స్..!

మిల్కీ బ్యూటీ తమన్నా తన చెక్కుచెదరని అందంతో అభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. ఈ పంచదార బొమ్మ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను దోచేశారు. కేవలం అందం మాత్రమే కాదు ఈ ముద్దుగుమ్మకి అద్భుతంగా డ్యాన్స్ చేయగల టాలెంట్ కూడా ఉంది. ఆ టాలెంట్ తోనే ఆమె అడపాదడపా ఐటమ్ సాంగ్స్ లో చిందేస్తూ భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో […]

సల్మాన్‌ఖాన్‌పై కేసు..?

బాలీవుడ్‌ లో ఖాన్ లలో ఒకరైన సల్మాన్‌ఖాన్‌ పై చండీగఢ్‌ లో తాజాగా చీటింగ్‌ కేసు నమోదైంది. సళ్లు భాయ్ సోదరి అల్విరా ఖాన్‌ అగ్నిహోత్రితో పాటు ఆయనకు చెందిన బీయింగ్‌ హ్యూమన్‌ ఫౌండేషన్‌ కు చెందిన మొత్తం 7 మందిపై అరుణ్‌ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపోతే ఈ ఫిరాదుపై జూలై 13లోపు వారు వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేశారు. ఈ ఆరోపణలలో ఏదైనా […]

విష్ణు ప్రియకి అలాంటి భర్త కావాలట..!

షార్ట్‌ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు పొందిన విష్ణుప్రియ ఆ పై తెలుగు బుల్లితెరపై యాంకర్‌ గానూ తన సత్తా చాటుతూ దూసుకు వెళుతుంది. ఇందులో ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌ – విష్ణుప్రియ తో చేసిన పోరా- పోవే షోతో బాగా పాపులర్‌ అయిన ఆమె.. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తుంది. వితోపాటు ఇంకోవైపు యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా మరికొంత మంది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇంకా చెప్పాలంటే లాక్‌ డౌన్‌ సమయంలో కూడా తన స్నేహితురాలు, […]

న్యూ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ..?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడు అలీ గురించి ప్రత్యేకంగా చేయనవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఆయన ఎన్నో వందల సినిమాలలో నటించారు. అలీ కమెడియన్ గా, హీరోగా.. నటించి ఎందరో ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందాడు. ఇక ఈ సంగతి పక్కనపెడితే.. ఇటీవల కాలంలో ప్రతిఒక్కరూ ఫేస్ బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ ల వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు తాజాగా అలీ కూడా ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని తాజాగా ఆయన చెబుతూ.. “ఇదే నా […]

టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్..!

శ్రీవారి భక్తులకు అతిత్వరలోనే టీటీడీ ఒక శుభవార్తను తెలియ చేయబోతుంది.. చాలా కాలంగా ఎదురు చూస్తున్న తిరుమల శ్రీవారి సర్వదర్శన భాగ్యం అతి త్వరలోనే తిరిగి మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆగస్టు నెలలో శ్రీవారి దర్శనం మొదలవ్వాలని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం.. కరోనా పాజిటివ్ ఒకటి శాతానికి వస్తే భక్తులకు ఉచిత దర్శన భాగ్యం కల్పించాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన సమయంలో మరో 20 […]

టీడీపీకి ఎల్ రమణ రాజీనామా..?

తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీకి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అందచేశారు. అయితే తన రాజీనామా లేఖలో కేవలం మూడు వాఖ్యాలతో లేఖను ముగించారు. 30 సంవత్సరాలుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు తన ధన్యవాదాలు అని ఎల్. రమణ తెలిపారు. ఇది ఇలా ఉండగా మరో వైపు టీఆర్‌ఎస్‌ పార్టీలోకి మారబోతున్నట్లు రమణ అధికారికంగా తెలిపారు. ఇలా పార్టీ మారడానికి గల కారణం విషయానికి వస్తే […]