పవన్ కొత్త సినిమా మళ్ళీ ట్విస్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమాపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఈ మూవీకి ఆరంభంలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. డైరెక్టర్ ఎస్.జే సూర్య తప్పుకోవడం., ఆ తర్వాత డాలీకి ఛాన్స్ ఇవ్వడం చక చకా జరిగిపోయాయి. కానీ షూటింగ్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఐతే లేటెస్ట్ గా ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. పవన్ ఆ సినిమాని పక్కనబెట్టేశాడంటూ ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ కథతోనే ఆయన ముందుకెళ్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడిచింది. కానీ వీటిలో […]

హరీష్‌, కేటీఆర్‌లలో ఎవరికి దక్కేనో!

మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ల మధ్య విపరీతమైన పోటీ ఉంది. వీరిలో హరీష్‌రావు స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌కి మేనల్లుడు. కేటీఆర్‌ అయితే కెసియార్‌ తనయుడే. ఇద్దరూ మంత్రులే. తెలంగాణ రాష్ర సమితి పార్టీకి వీరిద్దరూ ముఖ్యమైన వ్యక్తులు, మూలస్తంభాల్లాంటివారు. ఇద్దరిలో కెటియార్‌ ఒకింత ఎక్కువ. ముఖ్యమైన శాఖలన్నీ కెటియార్‌ వద్దనే ఉన్నాయి. కానీ కెటియార్‌కి ఇంకో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాలని చూడటం ద్వారా హరీష్‌రావుని ఇంకా తక్కువ చెయ్యాలనుకుంటున్నారట ముఖ్యమంత్రి కెసియూర్‌. అదెలాగంటే బాధ్యతలు పెరిగే కొద్దీ […]

మోడీ చుట్టూ అంతమంది కోటీశ్వరులా!

తాజా మంత్రివర్గ విస్తరణతో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కోటీశ్వరుల సంఖ్య 72కు చేరుకుందని, అలాగే క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించిన మంత్రుల సంఖ్య 24కు పెరిగిందని ఢిల్లీకి చెందిన ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పేర్కొంది. లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎన్నికల కమిషన్‌కు అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌లలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఆ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకున్న మంత్రుల […]

బాబు సంపాదన ఎంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వార్షికాదాయం రూ. 36 లక్షలు. సిఎంతో సహా ఆయన ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్, ఓటర్ ఐడీ అన్నీ హైదరాబాద్‌లో ఉండగా స్థిర, చరాస్తులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. తొలిరోజు స్మార్ట్ పల్స్ సర్వేను ముఖ్యమంత్రి ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రారంభించారు. తొలుత ఎన్యుమరేటర్లు ముఖ్యమంత్రికి సంబంధించిన వివరాలు సేకరించారు. సిఎంగా తనకు వచ్చే ఆదాయం అన్నింటితో కలుపుకుని రూ. 36 లక్షలని చంద్రబాబు ఎన్యుమరేటర్లకు వివరించారు. తన స్వగ్రామం చిత్తూరుజిల్లా […]

టీడీపీ వాళ్ళనూ వదలొద్దు:బీజేపీ

ఏపిలో పార్టీని శరవేగంగా విస్తరించేందుకు బిజెపి తన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసింది.ఆరుగంటల పాటు ఢిల్లీలోని ఏపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నివాసంలో జరిగిన కోర్ కమిటీ భేటీలో, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేశారు. ”రాష్ట్రంలో ఏ పార్టీ నాయకులు వస్తామన్న వద్దనకండి. చేర్చుకోండి. చివరికి టిడిపి వాళ్లనైనా వదలవద్దు. పార్టీ తలుపులు బార్లా తెరవండి. బిజెపిని బలోపేతం చేయ్యండి” అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాష్ట్ర నేతలకు సూచించారు. శుక్రవారం నాడిక్కడి […]

పవన్ లక్ సుల్తాన్ కీ కలిసోస్తుందా?

కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సుల్తాన్‌’. ఈ సినిమాలో అనుష్కా శర్మ హీరోయిన్‌గా నటించింది. ఎన్నో వివాదాలను దాటుకుని సినిమా రంజాన్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడూ రంజాన్‌కి సల్మాన్‌ కొత్త సినిమాను రిలీజ్‌ చేయడం ఆనవాయితి. అలాగే సుల్తాన్‌ కూడా విడుదలయ్యింది. ఎప్పటిలానే సక్సెస్‌ టాక్‌ని తెచ్చి పెట్టింది. రంజాన్‌ సెంటిమెంట్‌ సల్మాన్‌కి ఎప్పుడూ రివర్స్‌ కాలేదు. పోజిటివ్‌ రెస్పాన్స్‌తో ‘సుల్తాన్‌’ రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా […]

జర్నలిస్ట్ గా చైతు:పెళ్లి తర్వాతే!

గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నాగ చైతన్య సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదలకు సిద్ధమైంది. మరో మూవీ మలయాళీ రీమేక్‌ ‘ప్రేమమ్‌’ కూడా దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ రెండు సినిమాలే కాక ఇప్పుడు చైతూ మరో రీమేక్‌పై కన్నేశాడు. ఆనంద్‌ కృష్ణన్‌ డైరెక్షన్‌లో వచ్చిన తమిళ్‌ రీమేక్‌ రైట్స్‌ను టాలీవుడ్‌లో ‘చుట్టాలబ్బాయ్‌’ ప్రొడ్యూసర్‌ దక్కించుకున్నారు. ఈ సినిమాను నాగచైతన్యతో నిర్మించాలని అనుకుంటున్నారట. సురేష్‌ కొండేటి సమర్పణలో ఈ సినిమా రూపొందబోతోందట. ఈ సినిమాలో […]

రేష్మి కోరింది ఇస్తామంటూ క్యూ!

‘అంతం’ సినిమాకి రష్మి గ్లామరే సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌. ఈ సినిమా పోస్టర్లలో రష్మి ఫొటోనే ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించింది. అయితే సినిమాలో రష్మి పాత్ర మరీ అంత ఎక్కువేమీ కాదు. కానీ రష్మి చుట్టూనే ప్రమోషన్‌ జరిగింది. ఇది చాలు రష్మి చిన్న సినిమాలకు ఏ స్థాయిలో ప్లస్‌ అవుతుందో చెప్పడానికి. వెండితెర నుంచి బుల్లి తెరకి, బుల్లి తెర నుంచి వెండి తెరకు సాగిన, సాగుతున్న రష్మి ప్రయాణం ఇప్పుడు సూపర్‌ స్పీడ్‌తో దూసుకెళుతోంది. […]

మోడీ మేనియా:పెళ్లి ఆగిపోయింది!

వరకట్నం వల్ల పెళ్లి ఆగిపోవడం చూశాం. లవ్ ఎపైర్ల వల్ల ఆగిపోవడం విన్నాం. చిన్న చిన్న కారణాలతో పెళ్లిళ్లు నిలిచిపోవడం మనకు తెలుసు. కానీ ప్రధాని మోడీ వల్ల పెళ్లి ఆగిపోయిందంటే నమ్ముతారా. కానీ ఆ పెళ్లితో మోడీకి ఎలాంటి సంబంధం లేదు. కానీ పెళ్లి మాత్రం ఆయన కారణంగానే ఆగిపోయింది. ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా.. ఐతే ఈ స్టోరీ చదవండి. ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన ఓ వ్యాపారవేత్తకు.. ప్రభుత్వ ఉద్యోంగం […]