రవితేజ కి ఏమైంది!!

ఒకప్పుడు రవితేజా అంటే యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యాన్ ల ఉండేవాడు. తన తోటి స్టార్ హీరోల్లో అందరికంటే వేగంగా పని చేసే రవితేజా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుని శరవేగంగా సినిమాలు చేస్తూ పోయాడు. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఆ వేగమే రవితేజా ని సరైన ఆలోచన లేకుండా ఏదొఇపడితే ఆ కథని ఎంచుకునేలా చేసింది. వేగం పెరిగి.. క్వాలిటీ తగ్గిపోవడంతో ఓ దశలో వరుసగా సినిమాలు దెబ్బ […]

జగన్ తరహాలో రేవంత్ రెడ్డి దీక్ష!!

మల్లన్నసాగర్ ప్రాజెక్టు హట్ టాపిక్‌గా మారింది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌లో బాగంగా గోదావరి జలాల లను మెదక్, నల్గొండ జిల్లాలకు తరలించాలంటే మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరాల్సిందేనని సర్కార్ స్పష్టం చేస్తుంది. దీనికోసం 14 గ్రామాల నుండి 37 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు సర్కార్ సిద్దపడింది. భూ నిర్వాసితుల కోసం 123 జిఓ కింద పరిహరం చెల్లించాలని నిర్ణియించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన నిర్వాసిత గ్రామాలు మూకుమ్మడిగా ఒక్కట య్యాయి. జెఎసిగా ఏర్పడి ఉద్యమాలకు శ్రీకారం […]

త్వరలో రెడ్డిగారి రాజకీయ సన్యాసం?

తెలంగాణ కాంగ్రెస్ భీష్ముడు జానా రెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం చేయబోతున్నాడా?అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.దీనికి బలం చేకూరుస్తూ తాజాగా రెడ్డి గారి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.పదవి ముఖ్యంకాదు… పార్టీ బలోపేతమే నా లక్ష్యం… ఏ పదవీ లేకుండానే మహాత్ముడు స్వరాజ్యం సాధించారు.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై జానా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.. తమ పార్టీ నేతలకు అధికార టిఆర్ఎస్ […]

బాబు మళ్ళీ రుణమాఫీ అన్నాడోచ్..

చంద్రబాబు కి ఎన్నికల హామీలు ఇచ్చి ఇచ్చి ఎక్కడికెళ్లినా హామీలివ్వటం అలవాటుగా మారిపోయింది.ఆచరణ సంగతి దేవుడెరుగు హామీలదేముంది చెప్పటమే కదా అన్న చందాగా తయారైంది బాబు వ్యవహారం.రుణమాఫీ విషయంలో మీరెవ్వరు చిల్లి గవ్వ కూడా చెల్లించొద్దు మా ప్రభుత్వం రాగానే మీ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తాం అన్న చంద్రబాబే ఈ రోజు నా దగ్గర డబ్బుల్లేవు,అప్పు కూడా దొరకడం లేదని బీద ఏడుపులు ఏడవడం విడ్డురంగా ఉంది.అపార రాజకీయానుభవం వున్న చంద్రబాబు కి ఇన్నాళ్ళకి తత్వం […]

ముద్రగడ దీక్ష–పోస్టుమార్టం రిపోర్ట్

కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన దీక్షతో అనుకున్నది సాధించారు. తుని విధ్వంసం కేసులో అరెస్టైన పదమూడు మంది విడుదలయ్యేదాకా తాను దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.వారికి బెయిల్ వచ్చి, విడుదలైన తర్వాతనే.. ఆయన బుధవారం నాడు దీక్షను విరమించారు. అనుకున్నది సాధించి, ప్రభుత్వం పైన పైచేయి సాధించినప్పటికీ… ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారనే వాదనలు వినిపిస్తున్నాయి.అరెస్టైన వారి విడుదల కోసం ముద్రగడ పదమూడు రోజుల పాటు దీక్ష చేశారు.దీనిపై […]

సౌత్ లో రేంజ్ పెంచిన పరిణీతి

బాలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉన్నా.. అక్కడి ముద్దుగుమ్మలు దక్షిణాది సినిమాల్లోకి వచ్చారంటే ఓ రేంజ్ ప్రదర్శిస్తుంటారు. ఈ స్థాయి రెమ్యూనరేషన్ లోనే తెలిసిపోతుంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా కూడా ఇదే ఇష్యూతో వార్తల్లో నానుతోంది. ప్రిన్స్ మహేష్ బాబు సరసన తొలిసారి సౌత్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న ఈ భామ రూ.4కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏఆర్ మురుగదాస్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ మూవీ […]

స్వామి ‘రామాయణం’లో నిజమెంత?

సుబ్రహ్మణ్యస్వామి అంటే దేశ రాజకీయాల్లో సంచలనం. బిజెపి నాయకుడిగా, రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయన ఎందరో రాజకీయ ప్రముఖులకు ముచ్చెమటలు పట్టించిన ఘనుడు. జయలలితను జైలుకు పంపడమే కాకుండా, సోనియాగాంధీతోపాటు ఆమె తనయుడు రాహుల్‌గాంధీని రాజకీయంగా ఇరకాటంలో పెట్టాడీయన. ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ రెండోసారి ఆ బాధ్యతలు నిర్వహించకుండా అడ్డుపుల్ల వేసింది కూడా ఈ స్వామే. ఈయనగారికి రామయణం గురించి వివాదం సృష్టించాలనిపించినట్లుంది. రామాయణంలో రాముడు, రావణుడి కాళ్ళు నరికేశాడు, మళ్ళీ వాటిని రప్పించాడు. ఎందుకు? అంటూ […]

వైజాగ్ లో రామ్ సందడి

నేను శైలజ’ హిట్ తరువాత కొంత గ్యాప్ తీసుకుని రంగంలోకి దిగాడు రామ్. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో ఒక పాటతో పాటూ యాక్షన్ ఎపిసోడ్, కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. పాటలో కొంత పార్ట్ ను ఇప్పటికే చిత్రీకరించారు. మరో 15రోజులు వైజాగ్ లోనే షూటింగ్ సాగనుంది. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కథానాయికగా రాశిఖన్నా నటిస్తోంది. […]

జులై 7న ర‌ష్మి ‘అంతం’

గుంటూరు టాకీస్ లాంటి హిట్ చిత్రంతో యువ‌తను ఆకట్టుకుంది రష్మి గౌతమ్. ఆమె ప్రదాన‌పాత్రలో న‌టించిన చిత్రం అంతం జులై 7 న విడుద‌లవుతోంది. ద‌ర్శక‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ తెరకెక్కించిన స‌స్పెన్స్ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకోవడం ఖాయమని చిత్రబృందం చెప్తోంది. అంతంలో గ్లామర్ తో పాటూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో రష్మి నటించింది. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ మూవీకి ‘ఏ’ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ సర్టిఫికేట్ వివరాలు చెప్పిన కళ్యాణ్ మా అంతం చిత్రం ఇప్పటివరకు రాని […]