నందమూరి కల్యాణ్ రామ్ తో పూరి జగన్నాథ్ ‘ఇజం’ తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తవగానే మహేష్ బాబుతో ‘జనగణమణ’ సెట్స్ పైకి తీసుకెళ్తారని అంతా అనుకున్నారు. కానీ అది కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో.. ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని పూరి డిసైడ్ అయ్యారట. ఇదో మల్టీ స్టారర్ అని.. అంతా.. కుర్ర హీరోలతోనే ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా కోసం యువహీరో నాగశౌర్యను ఫైనల్ చేశారని అంటున్నారు. మరో […]
Author: admin
కృష్ణమ్మగా మెరిసిపోతున్న అనుష్క
అనుష్క అంటే అద్భుతమే. గ్లామరస్ హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే, విలక్షణ పాత్రలవైపు ఆసక్తి ప్రదర్శిస్తున్న అనుష్క నేటితరం హీరోయిన్లందరికీ రోల్ మోడల్ అనడం నిస్సందేహం. అందుకే అనుష్కని వెతుక్కుంటూ విలక్షణ పాత్రలు వెళుతున్నాయి. అలా అనుష్కకి దక్కింది ఓ అద్భుతమైన పాత్ర ‘కృష్ణమ్మ’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాలో అనుష్క నటిస్తోంది. ఈ సినిమాలో అనుష్క పాత్ర ఇదీ అంటూ కృష్ణమ్మగా అనుష్కను దర్శకేంద్రుడు పరిచయం చేస్తూ మీడియాకి ఓ లుక్ విడుదల […]
పూజను ఎత్తేస్తున్న హృతిక్
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తాజా సినిమా ‘మొహంజొదారో’. ఈ చిత్రంలో కథానాయిక పూజ హెగ్డే నటన, కాన్ఫిడెన్స్ లెవల్స్ కు ఆశ్చర్యపోయినట్లు హృతిక్ ఓ సందర్భంలో చెప్పారు. తొలి హిందీ చిత్రంలోనే ఇంత ఆత్మవిశ్వాసంతో నటించిన అమ్మాయిని చూడలేదని అన్నారు. అయితే.. హృతిక్ తో మాట్లాడేందుకు పూజ తొలుత కాస్త భయపడిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. 12నే విడుదల అవుతున్న ‘మొహంజొదారో’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు హృతిక్-పూజ. ఈ సందర్భంగా […]
తాప్సి మనసు దోచిందెవరు?
సొట్ట బుగ్గుల సుందరి తాప్సి జోరు దక్షిణాది చిత్రసీమలో మందగించింది. అయితేనేం.. అమ్మడికి బాలీవుడ్ ఆఫర్లు బాగానే ఉన్నాయి. దాదాపు ఏడాది కాలం తీరిక లేని షెడ్యూల్ ఉంది ఈ ఢిల్లీ బ్యూటీకి. ఇదిలా ఉంటే.. ఈ సుందరి ఎఫైర్ పై బాలీవుడ్ లో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాప్సి సాకిబ్ సలీమ్ తో డేటింగ్ చేస్తోందంటూ వార్తలొస్తున్నాయి. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తున్నారని.. ఒకరి కంపెనీని మరొకరు ఇష్టపడుతున్నారని అంటున్నారు. టీ-సిరీస్ కోసం తీసిన […]
నత్తతో పోటీపడుతున్న పుష్కర పనులు
కృష్ణా పుష్కరాల ఘాట్ల నిర్మాణ పనులు నిర్ధేశించిన గడువు ముగిసినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ముందు పనులు చేయండి తరువాత నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ మాట్లాడుతున్న తీరుతో కాంట్రాక్టర్లు ఘాట్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు సుముఖంగా లేరు. పద్మావతి ఘాట్, దుర్గా ఘాట్, పున్నమి ఘాట్, పున్నమి ఘాట్, కృష్ణవేణి తదితర ఘాట్లలో కాంక్రీట్ పనులతోపాటు మట్టి పనులు సైతం ఇప్పటికీ నడుస్తున్నాయంటే పనుల తీరు ఏవిధంగా ఉందో […]
నయన తార ను ఆ హోటల్స్ బాన్ చేశాయట
దక్షణాది 4 రాష్ట్రాలలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ నయనతార అటు గ్లామర్‌తోనూ, ఇటు పెర్ఫార్మెన్స్‌తోనూ అభిమానులను అలరిస్తుంటుంది.. అలాగే విమర్శలుకూడా ఎక్కువగానే ఎదుర్కొంటుంది. సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరు కాదు. ఇటీవలె వెంకటేష్ సరసన ‘బాబూ బంగారం’ సినిమాలో నటించిన నయన్.. ఆ యూనిట్ సభ్యులకు చుక్కలు చూపించిందట. డేట్లు ఇచ్చి కూడా షూటింగ్‌కు హాజరుకాకుండా ఇబ్బందులు పెట్టిందట. ఇప్పుడు హైదరాబాద్ స్టార్ హోటల్స్ యజమానులు నయనతార వల్ల ఇబ్బందులు పడుతున్నారట. ఎందుకంటే నయనతార కి […]
ప్రత్యేక హోదా కథ ముగిసినట్టే నా?
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కథ ముగిసినట్లే భావించాలి. ద్రవ్యబిల్లు అనే సాకుతో రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్ జరగకుండా చేయడంలో భారతీయ జనతా పార్టీ సఫలమయ్యాక, కాంగ్రెసు పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినాసరే ఏ మార్గంలోనూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకుండాపోయింది. మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు లభిస్తోంది. ‘అంతకు మించి’ అంటూ అసలుదానికి పాతరేయడం ద్వారా టిడిపి, బిజెపి ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తున్నాయనే […]
కత్రినాకి అదేం కొత్త కాదు
తెలుగులో వెంకటేష్‌తో ‘మల్లీశ్వరి’ సినిమాతో తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ కత్రినా కైఫ్. ఈ సినిమాలో ఆమె నటనకు, డాన్సులకు చాలా విమర్శలు ఎదుర్కొంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన కత్రినా కైఫ్‌కి తొలి నాళ్లలో నటన పట్ల అంతగా అవగాహన లేదు. అలాగే డాన్సుల్లో కూడా ఆమె చాలా వీక్. అయినప్పటకీ తొలి సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరో సినిమా చేయలేదు. బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. […]
మోడీ టూర్‌పై కేసీఆర్ వ్యూహాలేంటో!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు నరేంద్రమోడీ హాజరుకానున్నారు. తొలిసారి ప్రధాని తెలంగాణకు వస్తున్న సందర్భంలో, ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది. అయితే, పార్టీల పరంగా ఉన్న రాజకీయ విభేదాల కారణంగా ఇలాంటి విషయాల్లో ఆచి తూచి వ్యవహరిస్తుంటారు. అయితే ఆ హద్దులేవీ లేకుండా నరేంద్రమోడీ టూర్‌ని విజయవంతం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్, మంత్రులందర్నీ మోహరిస్తున్నారు. […]