తాప్సీని అలా చూడగలమా?

మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోం షర్మిల. సుదీర్ఘ కాలం పాటు ఆమె నిరాహార దీక్ష చేశారు. ఏళ్ళ తరబడి ఎలాంటి ఆహారమూ ఆమె తీసుకోలేదు. ఆమె సంకల్పం అలాంటిది. భద్రతాదళాలకు ప్రత్యేక అధికారాల్ని కట్టబెట్టే చట్టాన్ని ఆమె వ్యతిరేకించారు. ఆ చట్టం ద్వారా మణిపూర్‌లో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులే ఆమె ఉద్యమబాట పట్టేలా చేశాయి. అయితే సుదీర్ఘకాలం నిరాహార దీక్ష చేసి, ఇటీవలే దీక్ష విరమించిన ఇరోం షర్మిల, రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తన స్నేహితుడ్ని […]

మెగా ఛాన్స్‌ కొట్టేసిన కృష్ణవంశీ.

చిరంజీవి ప్రస్తుతం 150వ సినిమాలో నటిస్తున్నారు. ‘ఖైదీ నెం.150’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే చిరు కోసం పలు డైరెక్టర్లు తమ తమ స్టైల్లో కథలు రెడీ చేసుకుంటున్నారు. వారిలో ఇప్పుడు క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ కూడా చేరిపోయారు. కృష్ణవంశీ ఇప్పటికే బాలకృష్ణతో 101వ చిత్రం చేయడానికి కమిట్‌ అయ్యారు. ఈ సినిమాకి ‘రైతు’ అనే టైటిల్‌ని కూడా ప్రకటించారు. బాలకృష్ణ ‘శాతకర్ణి’ సినిమా […]

చంద్రబాబు దెబ్బకి జగన్‌ షాక్‌!

శాసనసభ సమావేశాలకు ముందు వైసిపి ఊహించని షాక్‌ ఇది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ముఖ్య నేత కూడా అయిన భూమన కరుణాకర్‌రెడ్డిని తుని విధ్వంసం కేసులో ఆంధ్రప్రదేశ్‌ సిఐడి విచారిస్తుండడంతో పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తొలి రోజు విచారణ ముగియగా, రెండో రోజు కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి అధికారులు భూమనను ఆదేశించారు. అయితే తనకేమీ భయం లేదని, విచారణకు హాజరవుతానని భూమన చెప్పారు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ. అయినప్పటికీ […]

మెగాస్టార్‌ సినిమాలో ఎమ్మెల్యే స్పెషల్‌!

ఎమ్మెల్యే కేథరీన్‌ ట్రెసా మెగాస్టార్‌తో ఆడిపాడనుంది. ‘ఖైదీ నెంబర్‌ 786’ సినిమాలో కేథరీన్‌ నటిస్తోందని సమాచారమ్‌. అల్లు అర్జున్‌ ఆమెకు ఈ ఆఫర్‌ ఇప్పించాడని సమాచారమ్‌. బన్నీకి ఈ అమ్మడితో మంచి స్నేహం ఉంది. ఇప్పటికూ తన ప్రతీ సినిమాలోనూ ఛాన్సుంటే ఈ ముద్దుగుమ్మకి ఆఫర్‌ ఇచ్చేలా ప్లాన్‌ చేస్తూ ఉంటాడు. అలాగే అల్లు అర్జున్‌తో కేథరీన్‌ ఇప్పటికే మూడు సినిమాలు చేసింది. ‘యూ ఆర్‌ మై ఎమ్మెల్యే’ అంటూ ‘సరైనోడు’ సినిమాలో పాటేసుకున్నాడు కేథరీన్‌తో అల్లు […]

చూస్తే తప్పు కాదు, చేస్తేనే తప్పు.

పైరసీ సినిమాలు చూడటం కూడా నేరమే. అయితే అది నిన్నటి మాట. కొత్త మాట ఏంటంటే పైరసీ సినిమాలు చూడచ్చు. ఆన్‌లైన్‌ పైరసీకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ముంబై హైకోర్టు సంచలన తీర్పులో ఈ విషయం వెల్లడించింది. కానీ ఆన్‌లైన్‌ ద్వారా పైరసీకి పాల్పడరాదని, అలా చేస్తే తీవ్రమైన నేరం కిందనే పరిగణించవలసి ఉంటుందని హైకోర్టు స్పష్టతనిచ్చింది. సినిమాకి పైరసీ అనేది పెనుభూతంగా మారింది. సినిమా విడుదలైన మరుక్షణం అది ఇంటర్నెట్‌లో దర్శనమిస్తోంది. ఒక్కోసారి సినిమా విడుదలకు […]

హాలీవుడ్‌ హీరోలా ఉన్నావ్‌ బాసూ

పాత్ర కోసం ఎంత కష్టమైనా పడే హీరోల్లో కళ్యాణ్‌రామ్‌ ఒకడు. అభిరుచిగల నిర్మాతగా విలక్షణ సినిమాలు చేసిన ఈ నందమూరి హీరో, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఇజం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కళ్యాణ్‌రామ్‌ జర్నలిస్ట్‌గా కనిపించనున్న విషయం తెలుసు కదా. అయితే కళ్యాణ్‌రామ్‌ సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌తో వీరోచిత పోరాటాలు చేస్తుండడం చూస్తోంటే, పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ మూవీలా కనిపిస్తోంది. ‘ఇజం’ టీజర్‌ని వినాయక చవితి కానుకగా విడుదల చేశారు. టీజర్‌ వచ్చిన తరువాత అందరిదీ […]

నాలుక చీరేస్తారట, ఎందీ నిజమేనా?

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఇప్పుడంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారుగానీ, ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడే. ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు పదవిలో ఉన్నదే తెలుగుదేశం పార్టీ కారణంగా. అది ఆయన మర్చిపోతే ఎలా? రాజకీయాల్లో పార్టీ మారడం ఫ్యాషన్‌ అయిపోయింది. పార్టీ మారాక, కెసియార్‌ – తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కి ‘దేవుడైపోయారు’. అంతకు ముందైతే, కెసియార్‌ని పట్టుకుని నానా విమర్శలు చేసేసిన ఘనుడే ఈ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌గారు కూడా. తప్పదండీ, గారు అని సంబోధించకపోతే ఈయనగారికి ఒళ్ళు […]

సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ అట

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నాడట..అవును మీరు నమ్మినా నమ్మక పోయినా..ఇది నిజం.ట్విట్టర్ లో స్పందించడం..6 నెలలకో ప్రెస్ మీట్ పెట్టి కామెడీ చేయడం అలవాటుగా చేసుకున్న పవర్ స్టార్ రూట్ మార్చబోతున్నారట..నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో తనదయిన ముద్ర వేసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టేస్తారేమో చూడాల్సిందే. మొన్న తిరుపతి సభ చూసారు కదా.పవన్ మాటల ధాటి..ఎవరి పైన అని మాత్రం అడక్కండి..అది ఆయనకే క్లారిటీ లేదు..ఎప్పటిలాగే చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ ని ఆ […]

బన్నీ సినిమాలో హన్సిక?

బన్నీ హీరోగా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్‌ కోసం వెతుకులాట కొనసాగుతోంది. కాజల్‌, కేథరీన్‌, మెహరీన్‌, ఇలా పేర్లు విన్పిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పాలబుగ్గల ముద్దుగుమ్మ హన్సిక పేరు వినిపిస్తోంది. తెలుగులో హన్సికకు ప్రస్తుతం సినిమాలేమీ లేవు. చాలా కాలంగా టాలీవుడ్‌కి బైబై చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ తమిళంలో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. తాజాగా ఇప్పుడే మళ్లీ ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తోంది. బన్నీతో తొలి సినిమా ‘దేశముదురు’లో నటించింది హన్సిక. ఆ […]