మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు- ఇది తెలంగాణకి చెందిన ఓ కవి ఆవేదన! నానాటికీ మనిషిలో మానవత్వం చచ్చిపోతోందని, పాపం.. అనే మాటను సైతం మరిచిపోయే పరిస్థితికి మనిషి దిగజారి పోతున్నాడని కవి కార్చిన కన్నీటి బిందువులు.. ఇలా అక్షరాలై.. వేదనను పంచాయి. ఇప్పుడు ఈ అక్షరాలను నిజం అని నిరూపించారు తెలంగాణకే చెందిన మంత్రి ఒకరు. తన కళ్ల ముందు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని సైతం పలకరించేందుకు ఆయనకు మనసు […]
Author: admin
ఆ యుద్ధక్షేత్రంపై జగన్ గురి..!
ఏపీ రాజధాని జిల్లా గుంటూరు లక్ష్యంగా వైకాపా అధినేత జగన్ భారీ ఎత్తున రాజకీయానికి తెరదీస్తున్నారా? ఈ జిల్లాను టార్గెట్ చేయడం ద్వారా టీడీపీకి పెద్ద షాక్ ఇవ్వాలని భావిస్తున్నారా? ప‌్రస్తుతం రెండు నియోజకవర్గాలకే పరిమితం అయిన వైకాపాను జిల్లా మొత్తం విస్తరించాలని పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారా? అంటే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఔననే అనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరు జిల్లా గుండెకాయ వంటిది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సహా మంత్రులు పత్రిపాటి […]
తన రెమ్యునరేషన్ లెక్క చెప్పిన రానా
టాలీవుడ్‌లో దగ్గుపాటి వారి వారసుడు, ఆరడుగుల అజానుబాహుడు, భయంకరత్వానికి ప్రతిరూపం భళ్లాలదేవుడు దగ్గుపాటి రానా ప్రస్తుతం బాహుబలి 2, ఘాజీ సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే యేడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు మనుమడిగా, దగ్గుపాటి సురేష్‌బాబు తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా తనకంటూ ఓ డిఫరెంట్ స్టైల్‌తో దూసుకుపోతున్నాడు. రానా ఇప్పుడు తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ ప్రజలకు కూడా తన సినిమాలతో బాగా […]
రూ.650 కోట్ల కుంభకోణంలో ఏపీ మంత్రి
ఏపీ మంత్రిపై భారీ ఎత్తున కుంభకోణం ఆరోపణలు వచ్చాయి. రూ.650 కోట్ల కుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కూరుకుపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. అంతేకాదు, దీనిని నిరూపించేందుకు తమ వద్ద సాక్ష్యాలు సైతం ఉన్నాయని ఆయన చెప్పడం రాష్ట్రంలో సంచలన సృష్టిస్తోంది. నిజానికి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న గంటాపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. విద్యాశాఖలో బదిలీల సందర్భంగా పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగిందని, ఉపాధ్యాయులు తాము కోరుకున్న […]
మిలియన్ రేసులో చిరు – బాలయ్య
ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇద్దరు అగ్ర హీరోలు పందెం కోళ్లలా తమ కేరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమాలతో తలపడేందుకు రెడీ అవుతున్నారు. చిరు 150వ సినిమా ఖైదీ నెం 150, బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రెండూ సంక్రాంతి బరిలో దూకనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై ఏపీ, తెలంగాణ ఏ రేంజ్లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాలపై అంచనాలకు తగ్గట్టుగానే ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో […]
రాంచరణ్‌కు ఆ ఇద్దరు హీరోలంటే పడదా..!
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ ప్రస్తుతం ధృవ హిట్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. రెండు వరుస ప్లాపుల తర్వాత మనోడి ఖాతాలో ధృవ రూపంలో హిట్ రావడంతో ఆనందానికి అవధులే లేవు. రాంచరణ్‌కు టాలీవుడ్‌లో మిగిలిన యంగ్ హీరోలతో కూడా మంచి రిలేషన్ ఉంది. ఇతర హీరోల సినిమాలు హిట్ అయినప్పుడు చరణ్ వారికి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెపుతుంటాడు. చరణ్‌కు టాలీవుడ్ స్టార్ యంగ్ హీరోలు అయిన మహేష్, ఎన్టీయార్, అఖిల్, ప్రభాస్, రానాతో చరణ్‌కు మంచి […]
టీడీపీలో దేవినేనిని తొక్కేస్తున్నారా..!
రాజకీయల్లో తొక్కేయడాలు… అణిచేయడాలు.. జూనియర్లకే కాదు.. సీనియర్ నేతలకూ ఉంటాయని చెప్పడానికి తానే ఓ ఉదాహరణ అని ఇటీవల కాంగ్రెస్ నుంచి చంద్రబాబు చెంతకు చేరిన విజయవాడ సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ ఉరఫ్ నెహ్రూ తెగ ఇదైపోతున్నారట!! తాను తలపండిన రాజకీయ నేతనని పలుమార్లు చెప్పుకొనే ఆయనకు.. కొందరు జూనియర్లు సెగ పెడుతున్నారట. దీంతో ఆయన ఏదో ఆశించి చేరిన టీడీపీలో ఏదీ నెరవేరడం లేదని నెహ్రూ తన అనుచరుల వాపోతున్నారు. కాంగ్రెస్‌లో […]
టీడీపీలోకి వైకాపా మహిళా ఎమ్మెల్యే జంప్!
వైకాపా అధినేత జగన్‌కి షాక్ మీద షాక్ తగులుతోందా? వైకాపాలో జంపింగ్‌లకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదా? అంటే ఔననే సమాధానమే వస్తోంది! వైకాపాలో కీలకంగా ఉన్న ఓ మహిళా ఎమ్మెల్యే జంపింగ్ బాట పడుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి వైకాపా నుంచి అధికార టీడీపీలోకి జరిగిన జంపింగ్‌లు అందరికీ తెలిసిందే. క్యూ కట్టుకుని మరీ వైకాపా నేతలు టీడీపీలోకి వెళ్లిపోయారు. దాదాపు నాలుగు నెలల కిందట జరిగిన ఈ వరుస జంపింగ్‌లు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర […]
నయీం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రంలో చెలరేగిపోయి.. అటు పొలిటీషియన్లని, ఇటు కాంట్రాక్టర్లని ముప్పుతిప్పలు పెట్టిన గ్యాంగ్‌స్టర్ నయీం హతమయ్యాడు. కానీ, అతను సృష్టించిన నేరసామ్రాజ్యం మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఇక, ఈ నేరసామ్రాజ్యాన్ని ఆసరాగా చేసుకుని నయీం సంపాదించిన ఆస్తులపై ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నయీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 143 కోట్లట! ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం శీతాకాల సమావేశాలు […]