విశ్వసనీయవర్గాల సమాచారం … టీడీపీలోకి వంగవీటి..?

స‌మైక్య రాష్ట్రంలో వంగ‌వీటి రంగా పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. ఎన్టీఆర్ ప్ర‌భుత్వం సైతం ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డానికి కార‌ణ‌మైన ఈ ఫ్యామిలీకి కాంగ్రెస్‌లో ఎంతో పేరుంది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు జ‌రిగిన వంగ‌వీటి రంగ హ‌త్య త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. రంగ హ‌త్య త‌ర్వాత ఆయ‌న భార్య ర‌త్న‌కుమారి రెండుసార్లు అదే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నిక‌ల్లో దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అండ‌దండ‌ల‌తో కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా […]

” కాట‌మ‌రాయుడు ” వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌

కాట‌మ‌రాయుడు టీజ‌ర్ యూ ట్యూబ్‌ను షేక్ చేస్తుంటే…అటు ప్రి రిలీజ్ బిజినెస్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ప‌వ‌న్ చివ‌రి సినిమా స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ ప్లాప్ అయినా కాట‌మ‌రాయుడు మాత్రం క‌త్తిదూస్తోంది. మ‌రో ట్విస్ట్ ఏంటంటే స‌ర్దార్‌ను మించిన రేంజ్‌లో కాట‌మ‌రాయుడు ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 105 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోన్న‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. ఏరియాల వారీగా కాట‌మ‌రాయుడు బిజినెస్ ఇలా ఉంది…. నైజాం – […]

జగన్ కు పెద్ద షాక్ ఇచ్చిన వ్యూహకర్త

ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. కృష్ణా జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందిన వారిని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన ఆయ‌న‌.. క‌లెక్ట‌ర్‌తో వాగ్వాదానికి దిగ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. అలాగే ఆయ‌న‌తో వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌జ‌ల‌తో పాటు పార్టీ నాయ‌కుల‌నే విస్మ‌యానికి గురిచేసింది. ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్న ప్ర‌శాంత్ భూష‌ణ్ కూడా జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చారు. జ‌గ‌న్‌కు ఎన్ని స‌ల‌హాలు ఇచ్చినా.. వాటిని పట్టించుకోర‌ని.. త‌న మొండి వైఖ‌రి త‌న‌దే […]

బాబు దూకుడుకు బ్రేక్ వేసిన న‌ర‌సింహ‌న్‌

ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించ‌కుండా వారికి మంత్రి ప‌దవుల్ని క‌ట్ట‌బెట్టేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌న్నాహాలు ప్రారంభిస్తున్న స‌మ‌యంలో.. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ గ‌ట్టి షాక్ ఇచ్చారు. త‌న‌లో ఉన్న రెండో కోణాన్ని బ‌య‌ట‌పెట్టారు. రెండేళ్ల క్రితం తెలంగాణ‌లో జ‌రిగిన విష‌యాన్ని నేత‌లు మ‌రిచిపోయినా.. తాను మాత్రం మ‌రిచిపోలేద‌ని స్ప‌ష్టంచేశారు. నాడు రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని కేక‌లు, నిర‌స‌న‌లు, విమ‌ర్శ‌లు చేసిన వారే.. నేడు అదే చేస్తుంటే ఎలా అని ప్ర‌శ్నించారు. వారితో రాజీనామాలు చేయించి.. ఆమోదం పొందిన […]

అందరి లెక్క స‌రిజేస్తున్న కేసీఆర్‌

త‌న వ్యూహాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తుచేస్తూ బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదుగుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్పుడు అంద‌రి లెక్క‌లు స‌రిచేస్తున్నారు. ముఖ్యంగా రెండేళ్ల‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో… టీఆర్ఎస్‌ను తిరుగులేని శ‌క్తిగా.. మార్చ‌డంతోపాటు.. అన్ని వ‌ర్గాల‌ను పార్టీ వైపే ఉండేలా చేసేలా వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ దిశ‌గా చ‌ర్య‌లు ప్రారంభించారు. కేసీఆర్ క్యాస్ట్ ఈక్వెష‌న్స్ గురించి తెలిసిన వారు `ఔరా` అన‌క మాన‌రంటే అతిశ‌యోక్తి కాదేమో!! క‌మ్మ‌, రెడ్డి, బీసీ, బ్రాహ్మ‌ణ‌, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ ఇలా […]

`ఆప‌రేష‌న్ జ‌గ‌న్` అధికార పార్టీ వ్యూహం స‌క్సెస్‌

అనుకున్న‌దే అయింది! క‌థ అడ్డం తిరిగింది! అస‌లు విష‌యం ప‌క్క‌దారి ప‌ట్టింది! ఇప్పుడే కాదు ప్ర‌తిసారీ అలానే జ‌రుగుతోంది! ప్ర‌తిప‌క్ష నాయకుడి వ్యూహం బెడిసికొట్టింది.. విష‌యం పైకి రాకుండా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని కార్న‌ర్ చేయ‌డంలో అధికార ప‌క్షం మ‌రోసారి విజ‌యం సాధించింది! అధికార ప‌క్షం అల్లిన ఉచ్చులో వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుకుపోయారు. ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో దివాక‌ర్ బ‌స్సు ట్రావెల్స్ సంఘ‌ట‌న‌లో కీల‌కమైన విష‌యాలను ప్ర‌జ‌లు పట్టించుకోకుండా.. వారి ఫోక‌స్‌ అంతా జ‌గ‌న్‌పై ప‌డేలా […]

ఏపీలో తొలి ఎమ్మెల్సీ రిజ‌ల్ట్ వ‌చ్చేసింది..

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ బోణీ కొట్టింది. ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తోంది. ఏక‌గ్రీవంగా స్థానాల‌ను ద‌క్కించుకుంటోంది. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగినా.. వారి నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకునేలా నాయ‌కులు బుజ్జ‌గిస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీకి చెందిన బీఎన్ రాజసింహులు.. అలియాస్ దొరబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా తూర్పుగోదావ‌రిలోనూ అటూ ఇటూగా కొంత ఇదే ప‌రిస్థితి ఉన్నా.. స్వ‌తంత్ర అభ్య‌ర్థిని బ‌రిలో నుంచి త‌ప్పించేందుకు నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌టం విశేషం! చిత్తూరు జిల్లా […]

బాహుబలి -2 ఫస్ట్ ప్రేక్షకుడు ఎవరో తెలుసా

రెండేళ్లుగా వెయిట్ చేస్తోన్న ఉత్కంఠ భ‌రిత క్ష‌ణాల‌కు వ‌చ్చే నెల 28న తెర‌ప‌డ‌నుంది. ప్రాంతీయ భాష అయిన తెలుగులో తెర‌కెక్కిన బాహుబ‌లి సినిమా ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. సినిమా రిలీజ్ అయ్యాక బాహుబ‌లి అంచ‌నాల‌కు మించి విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు ఏ నోట విన్నా ‘బాహుబలి-2’ మాటలే. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి అన్నా అతిశయోక్తి కాదు. చివరికి ప్రధాన మంత్రి, బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 కూడా దీనికోసం ఆత్రంగా ఎదురు […]

చంద్ర‌బాబు ఎఫెక్ట్‌: ఏపీ మంత్రికి ఘోర అవ‌మానం

ఏపీ క్యాబ‌నెటిలో సీనియ‌ర్ మంత్రుల‌లో ఒక‌రైన రెవెన్యూ శాఖ శాఖ & డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తికి అటు పార్టీలోను, ఇటు ప్ర‌భుత్వంలోను ప‌దే ప‌దే అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయి. కీల‌క‌మైన డిప్యూటీ సీఎంగాను, రెవెన్యూ శాఖ‌కు మంత్రిగా ఉన్న ఆయ‌న‌కు తెలియ‌కుండా ఆయ‌న శాఖ‌లో నిర్ణ‌యాలు వెలువ‌డిపోతున్నాయి. గ‌తంలో ఆయ‌న శాఖ‌లోని అధికారుల బ‌దిలీల‌కు సంబంధించి జారీ చేసిన ఉత్త‌ర్వులు కేవ‌లం కొద్ది గంట‌ల్లోనే క్యాన్సిల్ అయ్యాయి. లోకేశ్ ఎంట్రీతో కేఈ ఉత్త‌ర్వులు ర‌ద్దు చేస్తూ కొత్త […]