రాష్ట్రపతి పదవి రేసులో ఉన్న బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే.అద్వానీకి ఇది నిజంగా షాక్ లాంటిదే. వివాదస్పద కట్టడం బాబ్రీమసీదు కూల్చివేత కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో అద్వానీతో పాటు మురళీమనోహర్ జోషీ, ఉమాభారతితో సహా మొత్తం 16 మందిని కుట్రదారులుగా సుప్రీంకోర్టు నిర్దారించింది. గత రెండున్నర దశాబ్దాలుగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి లక్నో ట్రయిల్ కోర్టును కేసు […]
Author: admin
రివర్స్ అవుతోన్న టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్
గత యేడాదిన్నర కాలంగా ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ యమ జోరుగా సాగింది. అధికార టీడీపీ విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను విడతల వారీగా తన పార్టీలో చేర్చేసుకుంది. దివంగత నేత భూమా నాగిరెడ్డితో స్టార్ట్ అయిన ఈ జంపింగ్‌ల పర్వంలో మొత్తం రెండు విడతల్లో 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలే సైకిలెక్కేశారు. ఈ జంపింగ్ ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా లభించాయి. వచ్చే ఎన్నికలకు మరో రెండేళ్ల టైం మాత్రమే మిగిలిన ఉన్న వేళ […]
మహాభారతంలో మహేష్
ప్రస్తుతం ఇండియన్ సినిమా హిస్టరీలో మహాభారతం పెద్ద సెన్షేషనల్ ప్రాజెక్టు అయిపోయింది. బాహుబలి సినిమాతో ఇండియా వైజ్‌గా క్రేజ్ తెచ్చుకున్న దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన చిరకాల కోరిక మహాభారతం తెరకెక్కిస్తానని చెపుతున్నారు. ఎప్పటికైనా మహాభారతాన్ని తెరకెక్కించడమే తన లక్ష్యమని రాజమౌళి ఇప్పటికే పలుసార్లు ప్రకటించాడు కూడా. రాజమౌళి మహాభారతంలో తాను కృష్ణుడు పాత్ర పోషించాలనుకుంటున్నట్టు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. ఇక మరో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తాను సైతం మహాభారతాన్ని తెరకెక్కించాలనుకుంటున్నట్టు […]
చంద్రబాబు – పవన్ – టీవీ9 సీక్రెట్ ఎజెండా..?
ఏపీలో అధికార టీడీపీ, పవన్‌కళ్యాణ్ జనసేన మధ్య ఏదైనా సీక్రెట్ ఎజెండా ఉందా ? ఈ ఎజెండాకు సంబంధించి ఇంటర్నల్‌గా ఏదైనా వర్క్ జరుగుతోందా ? తాజాగా జరుగుతోన్న పరిణామాలు ఈ రెండు పార్టీల సీక్రెట్ ఎజెండాకు సంబంధించిన అనుమానాలను బలపరుస్తున్నాయా ? అంటే అవుననే ఆన్సర్ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇటీవల పవన్‌కళ్యాణ్ కాటమరాయుడు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌తో పాటు ఎన్టీవీ అధినేత తుమ్మల నరేంద్రచౌదరి హాజరయ్యారు. ఈ సభలో రవిప్రకాశ్ మాట్లాడుతూ […]
కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్
చిన్న వయస్సులోనే స్టార్ హీరో అయిన నందమూరి హీరో ఎన్టీఆర్…మూడు పదుల వయస్సు కూడా రాకుండానే పొలిటికల్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. రెండు పదుల వయస్సులోనే సింహాద్రి లాంటి బ్లాక్‌బస్టర్ మూవీతో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ తర్వాత 2009లో టీడీపీకి ప్రచారంలో స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు అటు నందమూరి ఫ్యామిలీతోను, ఇటు నారా ఫ్యామిలీతోను గ్యాప్ వచ్చింది. రాజకీయంగా తన కొడుకు లోకేశ్‌కు ఎన్టీఆర్ పోటీ వస్తాడని చంద్రబాబు, ఇటు సినీరంగంలో […]
లోకేశ్ అడిగారు….బాబు ఇచ్చారు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌కు జరిగినంత సులువుగా ఏ వారసుడి పొలిటికల్ ఎంట్రీ జరగదేమో..? చట్టసభల్లోకి ఎమ్మెల్సీగా ఎంట్రీ ఇచ్చిన లోకేశ్ మూడు రోజులకే ఏకంగా కేబినెట్ మంత్రి అయిపోయాడు. వడ్డించే వాడు మనవాడైతే వరుసలో ఎక్కడ కూర్చున్నా ఒక్కటే అన్న సూత్రం లోకేశ్‌కు నూటికి నూరుశాతం వర్తిస్తుంది. కేవలం చంద్రబాబు కుమారుడు అన్న ఒక్క అండతోనే లోకేశ్ ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా మంత్రి అయిపోయాడు. ఇక కేబినెట్‌లోకి వచ్చిన […]
బాహుబలి వరల్డ్ వైడ్ క్రేజ్ ఉహకే అందట్లేదుగా….
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి – ది కంక్లూజన్ సినిమాపై వస్తోన్న క్రేజ్ ఊహకే అందట్లేదు. స్కైను టచ్ చేసే రేంజ్ క్రేజ్‌తో బాహుబలి దూసుకుపోతోంది. అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న బాహుబలి 2 ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.600 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందంటే ఓ తెలుగు సినిమాకు ఎలాంటి ఘనత దక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఇక బాహుబలి – […]
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్: కలువపూడి శివ – ఉండి
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాలమ్‌లో భాగంగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు (కలువపూడి శివ) ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. ఉండి నుంచి 2009లోను, 2014లోను వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ఏంటి ? శివకు అక్కడ ఉన్న అనుకూల, వ్యతిరేకాంశాలేమిటో చూద్దాం. తననియోజకవర్గంలో రైతులు కరెంటు బాధలతో బాధపడుతుంటే మండుటెండలో కంకరరాళ్ల మీదే సబ్‌స్టేషన్ ముందే బైఠాయించాడు. […]
పవన్-త్రివిక్రమ్ ” ఇంజనీర్‌బాబు ” కు కొత్త టైటిల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో టాలీవుడ్ సర్కిల్స్‌లోను, ట్రేడ్‌వర్గాల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలో బిజీగా ఉన్న ఈ సినిమాపై టైటిల్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ఇప్పటికే ” ఇంజనీర్‌బాబు ” అనే టైటిల్ ఫైనల్ […]