జక్కన్న రాజమౌళి సిల్వర్ స్క్రీన్ మాయాజాలానికి కాసులు కురిపిస్తున్నారు. తొలి భాగంలో కంటే.. ద్వితీయ భాగం ఇంకా అద్భుతంగా తెరకెక్కించాడనే వార్త.. అటు బయ్యర్లలోనూ, ఇటు డిస్ట్రిబ్యూటర్లలోనూ భరోసా కల్పిస్తోంది. దీంతో ఖర్చుకు వెనుకాడటం లేదు. ఆంధ్ర, నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో బాహుబలి-2 సినిమాను ఫ్యాన్సీరేట్లకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు పార్ట్ టూ కూడా అలాగే వుంటుంది అన్నారు సాయి. ఆయన ఈ సినిమాను సీడెడ్, కృష్ణ, వైజాగ్ ఏరియాలకు ఫ్యాన్సీ రేట్లకు కొన్నారు. బాహుబలి-1 విడుదలకు […]
Author: admin
టీఆర్ఎస్‌లో బాబు మోహన్ పనైపోయిందా..!
సినీనటుడు బాబు మోహన్.. టీఆర్ఎస్‌లో చేరి ఆందోల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ నాయకులందరితోనూ ఆయనకు సత్సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. కానీ ఆయన నియోజకవర్గంలో మాత్రం ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సర్వేలో బాబూ మోహన్‌కు అతి తక్కువ మార్కులే రావడం.. ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతోంది. అంతేగాక ఆయన నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు ఎక్కువ మార్కులు పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక టీఆర్ఎస్‌లో ఆయన శకం దాదాపు ముగిసినట్టేననే […]
ఆ జిల్లాపై జగన్ ఆశలు వదులుకున్నాడా..!
వెనుకబడిన జిల్లాగా పేరొందిన సిక్కోలులో వైఎస్సార్ సీపీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. నేతల మధ్య అంతర్గత రాజకీయాలు, విభేదాలు, సమన్వయ లోపం ఇవన్నీ పార్టీని మరింత దిగజారుస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేతల పట్టు ఈ జిల్లాపై తగ్గుతూ ఉంటే.. అధికార పార్టీ నాయకుల హవా నానాటికీ పెరుగుతోంది. ఇంత జరుగుతున్నా.. వైసీపీ అధినేత జగన్ జిల్లా రాజకీయాలపై దృష్టిపెట్టకపోవడం ఇప్పుడు అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జిల్లాలో కీలకమైన నాయకులు పొంతన లేకుండా వ్యవహరిస్తున్నా.. వాటన్నింటినీ సరిజేసి ఏకతాటిపైకి […]
ఫిరాయింపు మంత్రికి టీడీపీ నేతల షాక్
ప్రతిపక్ష వైసీపీలో గెలిచి.. సైకిలెక్కి మంత్రి పదవి పొందిన మంత్రులకు స్థానిక టీడీపీ నేతలు షాక్ ఇస్తున్నారు. ఇటీవలే వీరికి మంత్రి పదవులు ఇవ్వడంపై ఆగ్రహ జ్వాలలు చెలరేగడం.. వాటని తన చాకచక్యంతో సీఎం చంద్రబాబు అణగదొక్కడం ఇవన్నీ తెలిసిందే! అయితే పరిస్థితి అంతా సద్దుమణిగిందని భావించినా.. ప్రస్తుతం ఇంకా ఈ జ్వాలలు ఇంకా చల్లారలేదు. ఆ మంత్రులను తమలో కలుపుకునే పరిస్థితి టీడీపీలో లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి సుజయ్ కృష్ణ […]
టీడీపీలో అన్నదమ్ముల ఫైటింగ్
పచ్చని కుటుంబంలో రాజకీయాలు చిచ్చుపెట్టాయి. ఆప్యాయంగా పెరిగిన అన్నతమ్ముళ్ల మధ్య అగాధాన్ని సృష్టించాయి. ప్రస్తుతం ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అన్న ఎదుగుదల చూసి, తొక్కేయాలని భావిస్తున్న తమ్ముడు.. తమ్ముడు ఎక్కడ తనకు పోటీగా మారతాడోనని అన్న.. ఇలా ఒకరినొకరు తీవ్ర పొరపచ్చాలతో రాజకీయాలు చేస్తున్నారు. అన్నతమ్ముళ్ల ఫైటింగ్ ఇప్పుడు టీడీపీ క్యాడర్‌ని అయోమయానికి గురిచేస్తోంది. కొండపల్లి బ్రదర్స్ మధ్య విభేదాలు విజయనగరం జిల్లాలో టీడీపీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. జిల్లాలో ఒకప్పుడు కొండపల్లి పైడితల్లినాయుడు […]
బాహుబలికి ప్రభాస్ రెమ్యునరేషన్ ఇదే
బాహుబలి సినిమా కోసం రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో కష్టపడింది…అంత కమిట్‌మెంట్ చూపించింది ఎవరైనా ఉన్నారంటే ఒక్క ప్రభాస్ మాత్రమే. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా నాలుగు సంవత్సరాల టైం కేటాయించాడు. ఓ మనిషి జీవితంలో నాలుగు సంవత్సరాల టైం అంటే మామూలు విషయం కాదు. ఓ హీరో నాలుగేళ్లలో ఏడెనిమిది సినిమాలు చేసేసి ఉండొచ్చు. ఎంతో సంపాదించి ఉండొచ్చు. కానీ ప్రభాస్ అలా చేయలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించేసి ఇండియా వైజ్‌గా […]
బీజేపీకి ప్లస్.. కేసీఆర్‌కు మైనస్
ప్రత్యర్థులను తన వ్యూహాలతో చిత్తు చేయగల తెలంగాణ సీఎం కేసీఆర్.. తాను తీసుకున్న గోతులో తానే పడబోతున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులను ఇరుకున పెట్టబోయి.. తానే ఇరుక్కబోతున్నారా అని విశ్లేషకులు సందేహపడుతున్నారు. మైనారిటీలకు రిజర్వేషన్ అంశం.. కేసీఆర్‌కు లాభం చేకూర్చబోయి.. నష్టం కలిగిస్తుందా అనే ఆందోళన మొదలైంది. బీజేపీని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అయ్యే అవకాశాలున్నాయనే అనుమానాలు అందరిలోనూ రేకెత్తుతున్నాయి. 2014లోగానీ,మొన్నటి యూపీ ఎన్నికల్లో గానీ బీజేపీ అధికారంలోకి […]
జగన్‌కు మద్దతుగా వైసీపీ ఎంపీ కొత్త న్యూస్ ఛానెల్
రాజకీయ పార్టీలకు మీడియా అండ తప్పనిసరి అయిన రోజులివి. అందుకే ఏదో ఒక పార్టీకి ఏదో ఒక మీడియా.. తన వంతు సాయం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీకి మద్దతు ఇచ్చే మీడియానే ఎక్కువగా ఉండగా.. ప్రతిపక్షాన్ని పట్టించుకునే మీడియా ఒకే ఒక్కటి ఉంది. ఈ ఆంతర్యాన్ని తగ్గించేందుకు వైసీపీ నడుం బిగించింది. వైసీపీని ప్రొజెక్టు చేసేందుకు ఆ పార్టీ ఎంపీ రంగంలోకి దిగారు. ఏకంగా ఇప్పుడు ఆయన ఒక చానెల్‌ను త్వరలో ప్రారంభించబోతున్నారు. […]
లోకేష్ మళ్లీ తడబడ్డాడుగా..
భారీ జనసందోహాన్ని చూసి కంగారు పడుతున్నారో.. లేక అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారో తెలీదు గానీ.. సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ తడబడిపోతున్నారు. ఆయన రాక కోసం ఎదురుచూసిన కార్యకర్తలు, మంత్రులు, క్యాడర్‌కు చుక్కలు చూపిస్తున్నారు. తన వాక్చాతుర్యంతో అందరూ అవాక్కయ్యేలా చేస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో మాటజారిన ఆయన.. మరోసారి పొరపాటు పడ్డారు. విభజన అనంతరం ఏపీలో ఉన్న శాసనసభ స్థానాల విషయంలో మరోసారి నోరు జారారు. ఎవరైనా పొరపాటు చేస్తారు. ఒక్కసారి ఓకే. రెండుసార్లు […]