టీడీపీలో సీఎం చంద్రబాబు తర్వాత ఎవరు? అంటే వెంటనే సందేహం లేకుండా వినిపించే పేరు నారా లోకేష్! అలాగే టీఆర్ఎస్‌లో సీఎం కేసీఆర్ తర్వాత సెకండ్ స్థానంలో ఉన్నదెవరంటే.. కేటీఆర్ పేరు వినిపిస్తుంది. మరి వైసీపీలో జగన్ తర్వాత ఎవరు? అంటే మాత్రం సందిగ్ధం తప్పదు!! ఈ ప్రశ్నకు ఇప్పుడు ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరి మధ్యే పార్టీలో తీవ్ర పోటీ జరగుతుందనడంలో సందేహమే ఉండదు. వారిలో ఒకరు జగన్ వదిలిన బాణాన్ని అని పాదయాత్ర […]
Author: admin
కట్టప్ప ప్రశ్నకు..ఏపీ మంత్రికి లింకేంటి..!
కేబినెట్‌లో ఆ ఒక్క సీనియర్ మంత్రి ఏకాకిగా మారిపోయారు. ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదు సరికదా ఆయన తరఫున ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నా.. రాజధాని భూ కేటాయింపుల కమిటీలో చోటు దక్కించుకోలేకపోయిన ఆయన మరెవరో కావు కేఈ కృష్ణమూర్తి! కేబినెట్లో జూనియర్, సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్‌కు దక్కింది.. మరి సీనియర్ అయిన ఆయనకు మొండిచెయ్యి ఎదురైంది. దీనికి వివరణ ఇస్తున్న మంత్రులు కూడా.. కేఈని సైడ్ చేసి మాట్లాడుతున్నారు. […]
చిరుకు మళ్లీ సేమ్ టు సేమ్ కష్టం
మెగాస్టార్ చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాను స్టార్ట్ చేసినప్పుడు అన్నీ సెట్ అయినా హీరోయిన్ మాత్రం సెట్ కాలేదు. చివరకు ఎంతోమంది పేర్లు పరిశీలించి చివరకు కాజల్‌ను సెట్ చేశారు. చిరు 151వ సినిమా విషయంలో కూడా ఇదే ఇబ్బంది ఎదురవుతోందట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆథారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ముందుగా మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. ఆమె పేరు అలా ఉండగానే హాట్ హీరోయిన్ విద్యాబాలన్ పేరు […]
ధూళిపాళ్ల నరేంద్ర గెలుపుకు అడ్డు ఎవరు..!
గుంటూరు జిల్లా పొన్నూరును ధూళిపాళ్ల ఫ్యామిలీ తన అడ్డాగా చేసుకుంది. పొన్నూరు నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తోన్న నరేంద్రకు చంద్రబాబు మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. 1994 – 1999-2004-2009-2014లలో వరుసగా ఐదుసార్లు గెలిచిన నరేంద్ర వచ్చే ఎన్నికల్లో వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే నరేంద్ర ఆరోసారి విజయానికి ఓ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేకులు వేస్తుందా ? అన్న చర్చలు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో గతంలో వరుసగా […]
బన్నీకి ప్లస్ అయిన బాహుబలి
బాహుబలి 2 దెబ్బతో తెలుగు సినిమాలకు ఇండియా వైజ్‌గా సూపర్ క్రేజ్ వస్తోంది. బాహుబలి రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు ఉన్న అన్ని సినిమాల రికార్డులకు చెదలు పట్టించింది. దీంతో నార్త్ టు సౌత్ అన్ని భాషల చిత్ర పరిశ్రమలో ఉన్న వారు ఇప్పుడు తెలుగు సినిమాల వైపే చూస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్నాడు. […]
చంద్రబాబు నిర్ణయాలే బొత్సకు వరం!
విజయనగరం, శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగల నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు తీసుకున్న ఒక నిర్ణయంతో ఆయన స్ట్రాంగ్ అవుతున్నారు. మంత్రి వర్గ విస్తరణలో సీఎం పాటించిన కొన్ని సమీకరణాలు.. బొత్స సత్యనారాయణకు వరాలుగా మారుతున్నాయట. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయట. చంద్రబాబు నిర్ణయాలతో 2014 ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్.. స్వేచ్ఛ ఇవ్వకవపోవడంతో బొత్స […]
ఎన్టీఆర్ పాలిటిక్స్‌పై లోకేష్ షాకింగ్ కామెంట్స్
హరికృష్ణ- చంద్రబాబు కుటుంబాల మధ్య గ్యాప్ మరింత పెరుగుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే హరికృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే! ఇదేసమయంలో ఆయన తనయుడు, మంత్రి లోకేష్.. జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అంతేగాక తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్‌ను పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని లోకేష్ వ్యాఖ్యానించడం అటు పార్టీలోనూ.. ఇటు రాజకీయాల్లోనూ తీవ్రంగా చర్చకు దారి తీసింది. […]
బాహుబలి-2 సునామీలో `ఖాన్`ల రికార్డులు చెల్లాచెదరు
బాలీవుడ్ `ఖాన్`ల రికార్డులు సునామీలో కొట్టుకుపోయాయి. ప్రపంచం నివ్వెర పోయేలా.. అందరూ అవాక్కయ్యేలా.. ఒక తెలుగు సినిమా కలెక్షన్ల దండయాత్ర చేస్తోంది. ఒక్క బాలీవుడ్ హీరోలు, దర్శకులకే సాధ్యమనుకున్న 1000కోట్ల మార్కును అందుకునేందుకు తెలుగు సినిమా ఒకే అడుగు దూరంలో నిలిచింది. `ఇది తెలుగొడి సత్తా` అని చాటుతోంది బాహుబలి-2. తెలుగువాళ్లంతా సగర్వంగా ఇది మా సినిమా అనుకునేలా భారతీయ సినీ చరిత్రలో అద్భుత చిత్రంగా నిలిచింది. దర్శక ధీరుడు రాజమౌళి అద్భుత సృష్టికి ప్రేక్షకులు సలామ్ […]
బాలయ్యను వైసీపీ టార్గెట్ చేయడం వెనక!
సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో బలపడేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం, సమస్యలను పరిష్కరించకపోవడంతో నియోజకవర్గ ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఇదే సమయంలో బాలయ్యను టార్గెట్ చేసేందుకు స్థానిక వైసీపీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తూ.. బాలయ్యను వీక్ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రముఖ సినీ నటుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం […]