తెలంగాణ టీడీపీలో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఇప్పుడు ఒంటరి వాడైపోయారట. ఇప్పుడు ఆయన ఎవరికీ ఏమీ కానివాడిగా మిగిలిపోయారట. నిజానికి ఒకప్పుడు అన్నగారి హయాం నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చక్రం తిప్పిన మోత్కుపల్లి.. ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారో తెలిస్తే.. ఆశ్చర్యం వేయక మానదు. తాజాగా తెలంగాణలో గురువారం మహానాడు జరిగింది. దీంతో ఇన్నాళ్లూ వార్తల్లో లేని మోత్కుపల్లి మళ్లీ తెరమీదికి […]
Author: admin
చంద్రబాబు అభివృద్ధి బీజేపీ అక్కౌంట్‌లోకా..
రాష్ట్రంలో రోజుకు 18 గంటలు కష్ట పడుతూ.. తాను పడుకోకుండా.. అధికారులను కూడా పడుకోనివ్వకుండా ఆరు పదుల వయసు దాటి మనవడిని, కుటుంబాన్ని సైతం వదిలి రాష్ట్ర ప్రజల కోసం కష్టిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కష్టం మొత్తం ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి చేరిందా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో 2014 ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన బాబు.. తీవ్ర కష్ట నష్టాలు సహా రాజధాని సైతం లేని ఏపీని అభివృద్ధి బాట పట్టించేందుకు ఎన్నో […]
షా కామెంట్లతో మోడీకి కేసీఆర్ ఝలక్!!
పోక చెక్కతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా.,. అనేది ప్రాచుర్యంలో ఉన్న సామెత! అచ్చు ఇప్పుడు ఈ సామెతనే ఒంట బట్టించుకున్నా తెలంగాణ సీఎం కేసీఆర్. రెండు రోజుల కిందట తెలంగాణలో పర్యటించిన బీజేపీ సారధి అమిత్ షా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా ఆయన పాలనపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లక్ష కోట్లకు పైగా ఇచ్చామని, అనేక పథకాలు అమలు చేస్తున్నామని, అయినా ఎక్కడా రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని అన్నారు. నిజానికి తెలంగాణపై ఎవరు ఏ […]
మహానాడు ఎఫెక్ట్.. రేవంత్ రేటింగ్ పెరిగింది!
పొలిటికల్‌గా కొంత ఫైర్ బ్రాండ్‌గా ఉండే తెలంగాణ టీడీపీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇప్పుడు సెంటారాఫ్‌ది టాపిక్‌గా మారిపోయాడు. రెండు రోజుల కిందట తెలంగాణలో టీడీపీ మహానాడు జరిగింది. దీనికి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు హాజరయ్యారు. దీనికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా హాజరై దిశానిర్దేశం చేశారు. అయితే, ఈ సందర్భంగా చోటు చేసుకున్న కొన్ని పరిణాలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి. ఈ కార్యక్రమానికి మొత్తం రేవంత్ అన్నీ తానై […]
బీజేపీ గుప్పెట్లో ఏపీ లీడర్లు
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని ఒంటబట్టించుకున్న తెలుగు నేలపై ఉత్తర ఆధిపత్యం పెరుగుతోందా? మళ్లీ ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్ పాలన దిశగా ఏపీ అడుగులు వేస్తోందా? అంటే ఇప్పుడు ఔననే సమాధానం వస్తోంది!! నిజానికి రాష్ట్రంలో టీడీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టినా.. ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం అజమాయిషీనే చెల్లుబాటు అవుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్‌గా నిన్నటికి నిన్న విజయవాడ నడిబొడ్డున బహిరంగ సభ నిర్వహించి కమల దళాధిపతి అమిత్ షా.. ఏపీకి తామే అంతా […]
రారండోయ్ వేడుక చూద్దాం TJ రివ్యూ
సినిమా : రారండోయ్ వేడుక చూద్దాం రేటింగ్ : 2.75/5 పంచ్ లైన్ : చూసేసిన వేడుకే నటీనటులు : నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సంపత్ రాజ్, కౌసల్య, వెన్నల కిశోరె, చలపతి రావు, ప్రిథ్వి తదితరులు.. కథనం : సత్యానంద్ ఛాయాగ్రహణం : ఎస్.వి.విశ్వేశ్వర్ కూర్పు : గౌతంరాజు పాటలు : రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి ఆర్ట్ : సాహి సురేశ్ ఫైట్స్ : రామ్- లక్ష్మణ్ సంగీతం : దేవిశ్రీప్రసాద్ నిర్మాత : […]
చంద్రబాబు గ్రాఫ్ తగ్గుతోందా…
ఏపీలో అధికార టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీ ఒకే వరలో ఇమడని కత్తుల్లా పోట్లాడుకుంటున్నాయి. పైకి ఈ రెండు పార్టీలు మిత్రపక్షంగా కనిపిస్తున్నా రెండు పార్టీల నాయకులు మాత్రం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. టీడీపీతో పొత్తు లేకుండా వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామని బీజేపీ నాయకులు చెపుతున్నారు. బీజేపీకి ఎవరితోను పొత్తులు అక్కర్లేదని..ఏపీకి బీజేపీ ముఖ్యమంత్రే కావాలని బీజేపీలో కొందరు నాయకులు అధిష్టానానికి నూరి పోస్తున్నారు. ఇక టీడీపీ నాయకులు అయితే బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే టీడీపీకి […]
మగధీరపై వెనక్కి తగ్గేది లేదంటున్న ‘రబ్తా’
టాలీవుడ్‌లో మెగాపవర్‌స్టార్ రాంచరణ్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ మగధీర గత నాలుగైదు రోజులుగా జాతీయ మీడియాలో సైతం వార్తల్లోకి ఎక్కింది. మగధీర సినిమా ఎప్పుడో 2009లో వచ్చింది. సినిమా సూపర్ హిట్ అయ్యింది. కట్ చేస్తే బాలీవుడ్‌లో ఇప్పుడు రబ్తా సినిమా తెరకెక్కుతోంది. ధోని ఫేం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, వన్ నేనొక్కడినే ఫేం కృతీసనన్ నటించిన ఈ సినిమా జూన్ 9న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఇటీవల […]
టీడీపీతో పొత్తుకు టీ కాంగ్రెస్‌లో వార్
వచ్చే ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోను రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో జనసేన ఎంట్రీతో టీడీపీ – వైసీపీ – జనసేన మధ్య ట్రయాంగిల్ ఫైట్‌కు తెరలేస్తోంది. ఇక బీజేపీ – టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా ? లేదా ? అన్న దానిపై కూడా రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో నిన్నటి వరకు టీఆర్ఎస్ దూకుడుతో వార్ వన్‌సైడ్‌గానే ఉంటుందని అందరూ […]