జాబు కావాలంటే.. బాబు రావాలి! ఆయనొస్తున్నారు.. మన సమస్యలన్నీ తీర్చేస్తారు!! ఖచ్చితంగా మూడేళ్ల కిందట ఎన్నికల ప్రచారంలో హోరెత్తిన నినాదాలివి! టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున మీడియా పనిగట్టుకుని చేసిన ప్రచారంలో మచ్చుకు రెండు స్లోగన్లు మాత్రమే ఇవి! అయితే, నిజానికి బాబు వచ్చాక జాబులొచ్చాయా? ఆయనొచ్చారు కాబట్టి.. సమస్యలు తీరిపోయాయా? అంటే నీళ్లు నమలాల్సిన పరిస్థితి దాపురించింది. ఏపీలో బాబు పాలనకు శుక్రవారంతో ముచ్చటగా మూడేళ్లు నిండిపోయాయి. దీంతో అప్పట్లో ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు, […]
Author: admin
భువనగిరి ఎమ్మెల్యే సెంట్రిక్‌గా పాలిటిక్స్ జరుగుతున్నాయా?!
అవును! టీఆర్ ఎస్‌కు పెట్టని కోట భువనగిరిలో కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడు, స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సెంట్రిక్‌గా ఇప్పుడు పొలిటికల్ సీన్ రగులుతోంది! జిల్లా మొత్తంమీద ఇప్పుడు శేఖర్ గురించే ప్రతి ఒక్క నాయకుడూ మాట్లాడుకుంటున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. నయీం నుంచి ఇతనికి ప్రాణ గండం ఉండడమే! అయితే, నయీం హతమై కూడా పదినెలలు గడిచిపోయాయి కదా? అని అందరిలోనూ డౌట్ ఉంది. కానీ, నయీం అనుచరులు ఇంకా బతికే ఉన్నారుకదా? అందుకే […]
2019లో తారక్ ప్రచారంతోనే టీడీపీ బరిలోకి…
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయనేది ఎవ్వరూ చెప్పలేని విషయం. ముఖ్యంగా పొత్తులు అయితే మరీను. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేని రంగం ఒక్క పాలిటిక్సే. నిన్నటికి నిన్న అమ్మనా బూతులు తిట్టుకున్న నేతలు సైతం అవసరం వచ్చిందంటే.. వాటేసుకుని ముద్దులు కుమ్మరించేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అందునా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఇలాంటి మామూలే!! ఇప్పడు ఇదంతా ఎందుకంటే.. ఏపీలో రాజకీయ పరిస్థితి రానున్న రోజుల్లో అత్యంత రమణీయంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోందికాబట్టి!! […]
కట్టు తప్పుతోన్న తమ్ముళ్లు….పట్టు కోల్పోయిన బాబు
టీడీపీ.. ఏపీలో రాజకీయ సంచలనం సృష్టించిన దాదాపు 36 ఏళ్ల నవ యవ్వనంలో ఉన్న పొలిటికల్ పార్టీ. దీనిని మరిన్ని ఏళ్లపాటు అధికారంలోనే ఉండేలా అధినేత చంద్రబాబు ఇటీవల పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో అధికారం శాశ్వతంగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ఇది బాగానే ఉన్నా.. ఆ పరిస్థితి ఎక్కడో పట్టుతప్పుతున్నట్టే కనిపిస్తోంది! టీడీపీ అధినేత ఆశలకు.. తమ్ముళ్ల ప్రవర్తనకు ఎక్కడా పోలిక ఉండడం లేదు. ఎక్కడికక్కడ తమ్ముళ్ల ఆగడాలు, దందాలు మితిమీరిపోతున్నాయి. దీంతో […]
కాంగ్రెస్ నుంచి విజయశాంతి జంప్….ఆ పార్టీలోకేనా…!
ప్రముఖ సినీ నటి, ప్రస్తుత కాంగ్రెస్ నేత విజయశాంతి మళ్లీ పార్టీ మారుతున్నారా ? ఆమె కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి, తెలంగాణ పాలిటిక్స్‌ను వదిలేసి తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నారా ? అంటే తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. గతంలో పలు పార్టీలు మారిన విజయశాంతి ఇప్పుడు ఏకంగా స్టేటే మారిపోతున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసిన ఆమె ఆ పార్టీ […]
గుడివాడలో ఆపరేషన్ నాని… స్టార్ట్ చేసిన టీడీపీ
కృష్ణా జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఓ ఫైర్ బ్రాండ్. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన నాని 2004 ఎన్నికల్లో రాజకీయారంగ్రేటం చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ గాలిలోను ఆయన గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో రెండోసారి కూడా గెలిచిన నాని ఆ తర్వాత చంద్రబాబు, టీడీపీతో విబేధించి వైఎస్.జగన్ చెంతకు చేరిపోయారు. 2014 ఎన్నికల్లో ముచ్చటగా గుడివాడలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూడు ఎన్నికల్లోను పార్టీలు మారినా నాని గెలిచాడంటే […]
తారక్‌కు పోటీగా వస్తోన్న రవితేజ
మాస్ మహరాజ్ రవితేజ యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కే పోటీగా వస్తున్నాడు. క్రేజ్‌లోను, మార్కెట్‌లోను ఎన్టీఆర్‌తో పొల్చుకుంటే దరిదాపుల్లోకి కూడా రాని రవితేజ రాడు. అలాంటి రవితేజ ఎన్టీఆర్‌తో పోటీ పడడం ఏంటని షాక్ అవ్వొద్దు. వీరిద్దరి సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కావడం లేదు. బెంగాల్ టైగర్ తర్వాత చాలా చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న మాస్ మహరాజ్ రవితేజ ఈ యేడాది రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలోని ‘రాజా ది గ్రేట్’ […]
టీటీడీపీలో ఆయన డమ్మీలకే డమ్మీనా..!
తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎంత దిగజారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఎన్నికల్లో 15 ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటును గెలుచుకున్న టీడీపీకి ఇప్పుడు అక్కడ కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్నా లేనట్టే లెక్క. ఇక టీటీడీపీకి ఓన్లీ అండ్ వన్ మ్యాన్ ఎవరంటే రేవంత్‌రెడ్డి ఒక్కడే. తెలంగాణలో రేవంత్ పార్టీ వాయిస్ వినిపిస్తున్నా పార్టీ పరంగా కన్నా తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకే ఎక్కువుగా తాపత్రయపడుతున్నారన్న చర్చలు కూడా […]
రాజకీయ చాణుక్యుడికి వైసీపీ ఎంపీ టిక్కెట్ ఖరారైనట్టే
ఏపీలో రాజకీయ పోరు నిన్నటి వరకు టీడీపీ, వైసీపీ మధ్యే ఉన్నా పవన్‌కళ్యాణ్ జనసేన ఎంట్రీతో ముక్కోణంగా మారింది. అయితే జనసేన ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందా ? లేదా కొన్ని నియోజకవర్గాలకే పరిమితమవుతుందా ? అని ప్రశ్నించుకుంటే ప్రస్తుతానికి జనసేన ప్రభావం కొన్ని చోట్ల మాత్రమే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వేడి ఎలా ఉంటే గతంలో కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి, ఆ పార్టీలోనే ఉన్న వారు, ఆ పార్టీ నుంచి బయటకు […]