బన్నీ చేసిన పనికి మెగా ఫ్యాన్స్ చిందులు..!

ఇప్పటికే పవన్ కళ్యాణ్ విషయంలో పలు సార్లు మెగా ఫ్యాన్స్ ను కెలికి నెత్తి మీదకు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఓ రేంజ్ లో వార్ జరుగుతూనే ఉంది. ఇటీవల సాయి ధరంతేజ్ కి రోడ్డు ప్రమాదం జరగ్గా.. ఇండస్ట్రీలోని అందరూ ఆస్పత్రికి వెళ్లి తేజ్ ని పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లలేని వాళ్ళు ట్విట్టర్ ద్వారా పరామర్శించారు. కానీ సొంత బంధువైన అల్లు అర్జున్ […]

భారీ భవంతిని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. కాస్ట్ ఎంతంటే ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో కొత్తగా ఓ బంగ్లా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఈ భవనం కొనుగోలుకు రూ. 12 కోట్ల మొత్తాన్ని వెచ్చించి నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36 లో నివాసం ఉంటున్నారు. అలాగే ఆయనకు నగర శివారులో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. తాజాగా పవన్ జూబ్లీహిల్స్ ఒక బంగ్లాను రూ 12 కోట్లకు కొనుగోలు చేసినట్లు […]

పవన్ భజన చేస్తున్న టీడీపీ దళాలు!

జనసేనాని పవన్ కల్యాణ్ షూటింగుల విరామంలో ఒక సినిమా ఫంక్షన్ కు హాజరయ్యారు. చాన్నాళ్ల తర్వాత.. ఎదురుగా షూటింగు కెమెరాలు కాకుండా ప్రజలు కనిపించారు. చాన్నాళ్ల తర్వాత మైకు దొరికింది. మైకు దొరకడమే తడవుగా.. అది సినిమా ఫంక్షన్ అనే సంగతిని మర్చిపోయి.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎడా పెడా తూర్పారపట్టేశారు. యావత్ సినీ పరిశ్రమకు తాను రక్షకుడు అన్న రీతిలో.. పరిశ్రమ తరఫున తానొక్కడే గళంవినిపిస్తున్నాననే రీతిలో.. గర్జించారు. ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. ఇదంతా ఒక […]

” లవ్ స్టోరీ ” పబ్లిక్ టాక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ఈ రోజున విడుదలై మంచి సక్సెస్ బాటలో నడుస్తున్నది.ఈ సినిమా అచ్చమైన పల్లెటూరి కథ తో సాగే చిత్రంగా తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి జనాలలో విశేష ఆదరణ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక ఇందులో నాగచైతన్య ఎంతో అద్భుతంగా నటించాడు, సాయి పల్లవి డాన్స్ తో ప్రేక్షకులను […]

జగన్ గారూ.. చురుగ్గా స్పందించాల్సిందే!

అమ్మాయిల మానరక్షణ కోసం, దుర్మార్గుల వెన్నులో వణుకు పుట్టించడం కోసం ‘దిశ’ వంటి కఠినమైన చట్టాలను తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మరి ఆయన పార్టీకి చెందిన వారే.. అకృత్యాలకు పాల్పడితే ఏం చేయాలి? పార్టీ ఎలా స్పందించాలి? ఆరోపణలు వచ్చిన తక్షణమే స్పందించి, చర్యలు తీసుకుంటే తప్ప.. ఇతరత్రా దక్కుతున్న మంచిపేరును ప్రభుత్వం నిలబెట్టుకోవడం కష్టం. విశాఖ జిల్లా సీలేరులో ఒక దుర్మార్గం జరిగింది. ఆ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చిన్న […]

పరువు పోయె : వెల్లంపల్లి ప్రకటనతో మరిన్ని సందేహాలు

కోర్టులనుంచి వరుస ఎదురుదెబ్బలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందికరమైనవి. భారీ సంఖ్యలో టీటీడీకి ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమిస్తూ జగన్ సర్కారు జీవో ఇవ్వగా, ఆ జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసింది. ఇదంతా ఒక ఎత్తు. కోర్టుల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడం పెద్ద విషయమేమీ కాదు. కొత్త సంగతి కూడా కాదు. అయితే […]

నాన్న బాటలో.. పాదం కదపనున్న షర్మిల..

తెలంగాణ రాజకీయాలకు సంబంధించి.. తాను ఆషామాషీగా పార్టీ పెట్టలేదని.. వైఎస్ షర్మిల రాష్ట్రప్రజలకు నిరూపించబోతున్నారు. జననేతగా తెలంగాణ వ్యాప్తంగా కూడా జనం హృదయాల్లో గుర్తింపు ఉన్న తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే అడుగులు కదపనున్నారు. అచ్చంగా వైఎస్ తరహాలోనే షర్మిల కూడా చేవెళ్ల నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించడానికి షెడ్యూలు కూడా ప్రకటించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన తర్వాత షర్మిల చురుగ్గా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ప్రతిమంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షను చేస్తున్నారు. […]

పవన్ కల్యాణ్ కు మరీ అంత అజ్ఞానమా..?

మూడు రోజుల కిందట ఒక తమాషా జరిగింది. సినిమా హీరో పవన్ కల్యాణ్, సినిమా డైరక్టర్/ రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి మహాకవి శ్రీశ్రీ గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరూ మాట్లాడుకున్నారు అనడం కంటె.. పవన్ కల్యాణ్ శ్రీశ్రీ గురించి అడిగాడు.. త్రివిక్రమ్ తనకు తోచినదేదో చెప్పాడు అని అంటే బాగుంటుంది. వారిద్దరూ అలా శ్రీశ్రీగురించి మాట్లాడుకోవడమే.. ఒక ఘనకార్యం అన్నటలుగా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల అయింది. పవన్ అభిమానులందరూ ఆహాఓహో అంటూ భజన […]

విజయాన్ని ఏకపక్షంగా నిందిస్తే ఆత్మవంచనే..!

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దారుణమైన పరాజయభారాన్ని మూటగట్టుకుంది. సాధారణంగా ఏ ఎన్నికలలో అయినా ఓడిపోయిన పార్టీ.. తమ ఓటమిని ప్రజల తీర్పుగా అంగీకరించడం జరగదు. గెలిచిన పార్టీ చేసిన అక్రమాలకు ఫలితంగా అభివర్ణిస్తుంది. మామూలు పరిస్థితుల్లోనే అలాంటి కాకమ్మ కబుర్ల చెప్పే పార్టీల నేతలు.. ఈసారి ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగిన ప్రత్యేక పరిస్థితుల్లో, మెజారిటీ ఏకగ్రీవాలు కావడం, చాలా చోట్ల తెలుగుదేశానికి పోటీకి దింపడానికి అభ్యర్థి కూడా లేకుండా పోయిన […]