సాయి తేజ్ కి మరో రెండు సర్జరీలు ..!

నెల రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా సాయి తేజ్ త్వరలోనే డిశ్చార్జి అవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సాయి దసరా పండుగ తర్వాతే సాయి తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినాయక చవితి రోజున ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్లిన సాయి తేజ్ […]

బాలయ్యకు గాయం ..నందమూరి అభిమానుల్లో కలవరం!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఒక చేతికి కట్టు కట్టుకుని కనిపించడం అభిమానులను కలవరపరుస్తోంది. ఆయనకు ఏమైంది..అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం బాలకృష్ణ ఆహా యాప్ కోసం హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ క్రిష్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి అఫీషియల్ గా ప్రకటన అయితే రాలేదు. కానీ ఆహా […]

చిరంజీవి లైనప్ లో అసలు విషయం ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య తో పాటు గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మిగిలిన రెండు సినిమాలు రీమేక్ లే. అందులో ఒకటి మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ ఆధారంగా గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తుండగా.. దీనికి తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాను మెహర్ […]

ప్రత్యర్థినే తొలి ఇంటర్వ్యూ చేయనున్న బాలయ్య..ఆ హీరో ఎవరంటే..!

నందమూరి బాలకృష్ణ తొలిసారి ఒక ఓటీటీలో హోస్టుగా అవతారం ఎత్తనున్న సంగతి తెలిసిందే. టాక్ షో లో హోస్ట్ గా చేయాలని ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా బాలయ్య ను సంప్రదించగా అందుకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాక్ షో ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో సాగుతుందని సమాచారం. ఆహాలో అతి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాలో […]

వేల నామినేషన్లన్నారు.. చివరకు 61 మాత్రమే వేశారు

ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వేల మందితో నామినేషన్లు వేయిస్తాం.. ప్రభుత్వానికి మా సత్తా చూపుతాం అంటూ పలువురు నాయకులు, ప్రజాసంఘాలు, నిరుద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లు గతంలోపేర్కొన్నారు. అందరూ.. నామినేషన్ వేస్తే బ్యాలెట్ పేపర్ కాదు కదా.. బ్యాలెట్ బుక్ తయారు చేయాలని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఉప ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది.. నామినేషన్ల గడువు కూడా ముగిసింది. తీరా ఎన్ని నామినేషన్లు దాఖలు చేశారంటే.. కేవలం 61 మాత్రమే. అదీ […]

హుజూరాబాద్ ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు?

అవును మీరు చదివింది నిజమే.. ఈనెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు పోటీచేస్తున్నారు. అదేంది ఉన్నది ఒక్క రాజేందరే కదా అనే అనుమానం రావడం సహజం. వారందరూ రాజేందర్లే అయినా.. అందరూ ఈటల రాజేందర్లు కాదు.. కాబట్టి పెద్ద టెన్షనేం అవసరం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఇది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ […]

ఆదిమూలాలు ఇక కదులుతాయి?

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు రాబోయే రోజుల్లే టెన్షనే.. మీడియా ముందుకు వచ్చి తనకు నచ్చని నాయకులను ఏకిపారేసే మంత్రి సురేష్ ఇపుడు ప్రతిపక్ష నేతల నోళ్లకు చిక్కాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మంత్రి దంపతులకు ఇబ్బందిగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి, ఆయన భార్య విజయలక్ష్మిపై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని కేసు నమోదైంది. దీనికి సంబంధించి సీబీఐ 2017లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే.. తమపై నమోదైన […]

విచారణకు ఆశిష్ మిశ్రా.. దీక్ష విరమించిన సిద్దూ

ఉత్తరప్రదేశ్​ లఖీంపూర్​ ఖేరీ లో నిరసన తెలుపుతున్న రైతుల పైకి కారు దూసుకెళ్లిన సంఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా పేరు బలంగా వినిపించిన విషయం తెలిసిందే. ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్ట్​ చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్​ చేస్తూ.. పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్​ సింగ్​ సిద్దూ నిరాహార దీక్ష చేపట్టారు. శనివారం ఉదయం అజయ్ […]

ఏపీ బీజేపీ సంగతి మళ్లీ చూద్దాం

భారతీయ జనతా పార్టీ.. మోదీ ప్రధాని అయిన తరువాత పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఓ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒంటిచేత్తో పార్టీని గెలిపించి ప్రధాని పదవిని చేపట్టారు. మోదీ చేతిలోకి పార్టీ వచ్చిన తరువాత తనకు అత్యంత ఆప్తుడైన అమిత్ షాను పార్టీ చీఫ్.. ఆ తరువాత హోం మంత్రిగా చేశారు. ఇపుడు బీజేపీ అధిష్టానం ఎవరంటే ముందుగా మోదీ.. తరువాత అమిత్ షా పేరు బయటకు వస్తుంది. ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న […]