ప్రభాస్, పూజా లుక్ అవోసమ్.. సెకండ్ సింగిల్ సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ ..!

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ఇవాళ విడుదలైంది. హిందీ భాషలో విడుదలైన ‘ఆషికి ఆగయీ’ అని సాగే పాటకు అభిమానుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలి కాలంలో ఇంత గొప్ప మెలోడీ సాంగ్ రాలేదనే చెప్పాలి. ఎంతో గొప్పగా ఉంది ఈ పాట. సాంగ్ చిత్రీకరణ కూడా చాలా బాగుంది. ప్రభాస్, పూజా హెగ్డే జంట తెరపై […]

మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు.. మొదలైన అంతిమయాత్ర..!

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమ యాత్ర ప్రారంభమైంది. నిన్న సాయంత్రం ఆయన కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇవాళ తెల్లవారు జామున సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ చాంబర్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఆయనకు సినీ,రాజకీయ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళి అర్పించారు. టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, […]

హీరో అబ్బవరం కిరణ్ ఇంట విషాదం..!

తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. వారం కిందట ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు మృతి చెందగా, నాలుగు రోజుల కిందట ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూయడంతో యావత్ చిత్ర పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు సిరివెన్నెల భౌతికకాయానికి నివాళులు అర్పించారు.ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ […]

ఆచార్య విజువల్ ట్రీట్ మామూలుగా ఉండదట..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆచార్య. ఇందులో మరో కీలకమైన పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ పాత్రను పరిచయం చేస్తూ సిద్ధ సాగా టీజర్ కూడా విడుదల చేశారు. […]

బాస్.. ఏంటీ స్పీడు..షాకవుతున్న కుర్ర హీరోలు..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దూకుడు మీద ఉన్నారు. వరుసగా ప్రాజెక్టులను ఓకే చేయడమే కాకుండా.. వేగంగా సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఒకే ఏడాది మూడు సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్ రూపొందించాడు. చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా 2022 లో విడుదల కానున్నాయి. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన తెరపైకి రానుంది. […]

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారిన అక్కినేని వారసుడు..!

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు అక్కినేని మనవడు సుమంత్. ఆరంభంలో సుమంత్ పై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉండగా అవి నిలబెట్టుకోవడంలో సుమంత్ విఫలమయ్యాడు. ఇన్నేళ్ల కెరీర్లో సుమంత్ సత్యం, గోదావరి సినిమాలతో మాత్రమే గుర్తింపు సంపాదించుకున్నాడు. గోల్కొండ హైస్కూల్, మళ్ళీరావా సినిమాలు కూడా పర్వాలేదనిపించాయి. ఇటీవల సుమంత్ సినిమాలు చేయడం కాస్త తగ్గించారు. ఆశ్చర్యకరంగా ఆయన ఓ సినిమాలో హీరో క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పారు. 1983లో దేశానికి వరల్డ్ […]

భీమ్లా నాయక్ సాంగ్ రిలీజ్ వాయిదా.. కారణం ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా ఆధారంగా ఈ మూవీ రీమేక్ అవుతోంది. రానా ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడు. వీరిద్దరికి జోడీగా నిత్యామీనన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, […]

ఆలూ..లేదు.. చూలూ లేదు..

బీజేపీ నాయకులు చాలా ఉత్సాహంలో ఉన్నట్టున్నాడు.. ఎంత ఉత్సాహమంటే.. రాష్ట్రంలో అప్పుడే ఎన్నికలు జరిగినట్లు.. ఫలితాలు వచ్చినట్లు.. బీజేపీ విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్నంటు.. కమలం నాయకులు ఇంకా ఓ అడుగు ముందుకేసి తొలి సంతకం ఉచిత విద్యపై చేస్తామని చెప్పడం మాత్రం విడ్డూరంగా ఉంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయముంది..అయితే బీజేపీ మాత్రం ఇప్పటినుంచే గ్రౌండ్‌ వర్క్‌ మొదలుపెట్టింది. ఇటీవల హైదరాబాదులో రెండు రోజుల పాటు పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ఆ […]

‘జూనియర్‌’ను ఏమీ అనకండి

తన కుటుంబంపై దాడి జరిగింది.. తనభార్యకు అవమానం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సంఘటన ఇంకా గుర్తుంది. మహిళలను నిండు సభలోనే అవమానిస్తారా? అని మీడియా ముందు చంద్రబాబు ప్రశ్నించారు. ఈ రోదన కథను అలాగే కంటిన్యూ చేయాలని టీడీపీ శ్రేణులకు పార్టీనుంచి ఆదేశాలందాయి. భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ నందమూరి కుటుంబసభ్యులు కూడా బయటకు వచ్చి వైసీపీ నాయకుల మాటలను ఖండించారు. ఆ తరువాత […]