సుకుమార్ పరిస్థితి ఏమిటి? ‘పుష్ప’ విషయంలో ఏం చేయబోతున్నాడు?

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి మాటల్లో చెప్పుకోలేం. ఓ మూస ధోరణితో సినిమాలు పోతున్నవేళ కాస్త వెరైటీ కధనంతో ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడు సుక్కు. ఓవైపు సినిమాలను డైరెక్ట్ చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా చిత్ర పరిశ్రమకు సేవలు చేస్తున్నాడు. అలాంటి సుకుమార్ నుండి గత కొన్ని నెలలుగా తన అప్ కమింగ్ సినిమాల విషయాలు గానీ మరియు తన ప్రొడక్షన్ లో రూపొందే చిత్రాలకు సంబంధించి కానీ ఎలాంటి రెగ్యులర్ అప్డేట్స్ రాలేకపోవడం […]

మహేష్ అభిమానులకు శుభవార్త… పోకిరి సినిమా మళ్ళీ రాబోతోందోచ్!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన పోకిరి సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. పూరీ దర్శకత్వం గురించి మాట్లాడుకోవలసిన పనిలేదు. ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుకోవాలంటే.. “మహేష్ అంటేనే పోకిరి, పోకిరి అంటేనే మహేష్” అన్న మాదిరి పెర్ఫామెన్స్ ఇచ్చాడు ఈ సినిమాలో. ఆ సినిమాతో మహేష్ బాబు నిజమైన సూపర్ స్టార్ గా అవతరించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదలై దాదాపు 16 సంవత్సరాలు […]

క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇంత లగ్జరీ అవసరమా? ఎందుకవన్నీ?

ప్రస్తుతం టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల రెమ్యూనరేషన్ హీరోల రెమ్యూనిరేషన్ కి ధీటుగా ఉంటోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇదే విషయం ఇపుడు సినిమా నిర్మాతలను పట్టి పీడిస్తోందని టాలీవుడ్ టాక్. సినిమా ప్లాప్ అయితే హీరోకి, నిర్మాతకు, దర్శకుడికి మాత్రమే ఎక్కువ నష్టం. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు పోయేది నిజంగా ఏమి ఉండదు. అలాగని వారు లేకుండా సినిమాలు ఎవరు తీయలేరు. టాలీవుడ్ లో కీలకమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల డిమాండ్లు ఇప్పుడు దారుణంగా […]

నిహారిక కొణిదెలకు వయసై పోయిందంటున్న ట్రోలర్స్… ఇదే కారణం!

నిహారిక కొణిదెల.. పరిచయం అక్కర్లేని ఫిగరు. మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక ఒక అమ్మాయిగా ఎదుర్కొనవలసిన ఛీత్కారాలు అన్నీ ఎదుర్కొని తెలుగు సినిమా పరిశ్రమలో త‌న‌కంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది. చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు, సినిమాలు ఆడకపోవచ్చు. కానీ తనకంటూ ఓ స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌ర‌చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హోమ్లీ రోల్స్ చేస్తూ కుటుంబ ఆడియన్స్ ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఆమె చేసిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు […]

ఆ షోలో సమంత సీక్రెట్ చెప్పేసిందా.. అక్కినేని ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

టాలీవుడ్‌లో తనదైన సినిమాలతో అలరించిన సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. ఆమె నాగచైతన్యతో విడిపోయాక ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. ఈ సంవత్సరం తన కాఫీ విత్ కరణ్‌ షోలో ఆమె అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమంలో నటుడు అక్షయ్ కుమార్‌తో కలిసి ఆమె షోలో పాల్గొంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో కరణ్ జోహార్‌ను ఆమె వేలెత్తి చూపించింది. వివాహాలు సంతోషంగా లేకపోవడానికి అతనే కారణమని పేర్కొంది. ఇప్పటి వరకు […]

అందరి మధ్యలో ఎగిరిపోయిన రష్మిక డ్రెస్.. నెట్టింట దారుణంగా ట్రోలింగ్

పుష్ప సినిమా హిట్‌తో రష్మిక మందన్నా దేశవ్యాప్తంగా బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. రణబీర్ కపూర్, వరుణ్ ధావన్ వంటి స్టార్లతో సినిమాలు చేస్తుంది. కోలీవుడ్‌లో విజయ్ సరసన ఓ సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగు సినిమాలు చేసే అవకాశం కూడా లేదు. రెండేళ్ల పాటు ఆమె కాల్షీట్లు బాగా బిజీగా ఉన్నాయి. ఇంతలా ఆమె బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో ఇటీవల ముంబైలో జరిగిన ఓ […]

పవన్ కొడుకు అకీరా పుట్టుకపై వైసీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఇటీవల కాలంలో సినిమాల కంటే రాజకీయాలపై తన పూర్తి సమయాన్ని పవన్ కళ్యాణ్ కేటాయిస్తున్నారు. జనసేన పార్టీ తరుపున రైతు భరోసా యాత్రలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇదే కాకుండా ‘జనవాణి’ అనే కార్యక్రమాన్ని కూడా పెట్టారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాను సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్తున్నారు. ఈ కారణంగా ఆయన చేయాల్సిన […]

సోషల్ మీడియాలో సైలెంట్‌గా సమంత.. అభిమానుల్లో ఆందోళన

టాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. తరచూ సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటూ తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె పంచుకుంటూ ఉంటారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తన మకాం ముంబైకు మార్చేసింది. బాలీవుడ్‌ల పాగా వేసేందుకు తన వంతు యత్నాలు చేస్తోంది. అక్కడి ప్రముఖులు కూడా సమంతకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా మంచి పాత్రలు ఇచ్చేందుకు చొరవ చూపుతున్నారు. హీరోయిన్‌గానే కాకుండా పుష్పలోని ‘ఊ […]

అడ్వర్టైజ్‌మెంట్లలోనూ తగ్గేదెలే అంటున్న బన్నీ

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించింది. రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, సెలబ్రెటీలు ఈ సినిమాలోని డైలాగ్‌లను నిత్యం వల్లె వేసేవారు. ఆయా డైలాగ్‌లను తమ మేనరిజంతో చెప్పి అలరించే వారు. ఇక ఈ సినిమాలోని పాటలను యువత రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఇది ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. అంతలా ఈ సినిమా మొత్తం దేశంపై ప్రభావం […]