ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి `వాల్తేరు వీరయ్య` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతోంది. […]
Author: Anvitha
వెంకీతో `కేజీఎఫ్` భామ రొమాన్స్.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే నోరెళ్లబెడతారు!
కేజిఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి.. ఇటీవల `కోబ్రా` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే తాజాగా ఈ బ్యూటీ తెలుగులో ఓ ప్రాజెక్టుకు సైన్ చేసిందని అంటున్నారు. నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న విక్టరీ వెంకటేష్ తన తాతపరి చిత్రాన్ని హిట్, హిట్-2 చిత్రాలతో మంచి పేరు […]
`నాటు నాటు` సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. చరిత్ర సృష్టించిన `ఆర్ఆర్ఆర్`!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్` గత ఏడాది విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్.. అంతర్జాతీయ సినిమా వేదికపై చరిత్ర సృష్టించింది. అమెరికాలోని కాలిఫోర్నియా బెవర్లీహిల్స్ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ వరించింది. […]
`వారసుడు`కు విజయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? బాలీవుడ్ హీరోలు కూడా దిగదుడుపే!
ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్న చిత్రాల్లో `వరిసు(తెలుగులో వారసుడు)` ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్, శ్యామ్, శరత్ కుమార్, జయప్రద, ప్రభు, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తమిళం తెలుగుతో పాటు హిందీలో విడుదల కాబోతోంది. అయితే తమిళంలో జనవరి 12న ఈ సినిమా విడుదల కానుండగా. […]
వైజాగ్ లో చిరంజీవి కొనుగోలు చేసిన స్థలం విలువ తెలిస్తే షాకే!
మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. వైజాగ్ నగరమంటే […]
నభా నటేష్‌కు యాక్సిడెంట్.. వరసగా సర్జరీ.. ఇప్పుడెలా ఉందంటే?
డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ నభా నటేష్ యాక్సిడెంట్ కు గురైందట. ఈ విషయాన్ని నభా స్వయంగా తెలిపింది. అయితే యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు కాదు.. గత ఏడాది. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యమా జోరు చూపించిన ఈ ఇస్మార్ట్ పోరి.. గత ఏడాది ఒక్క సినిమా […]
నాగార్జునకే చుక్కలు చూపించిన డబ్యూ డైరెక్టర్.. టాలీవుడ్‌లోనే తొలిసారి ఇలా!?
అక్కినేని మన్మధుడు నాగార్జున సోలోగా హిట్ అందుకుని చాలా కాలం అయిపోయింది. ఈయన నుంచి చివరిగా వచ్చిన `ది ఘోస్ట్` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ మూవీ అనంతరం నాగార్జున సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇది నాగార్జున కెరీర్ లో తెరకెక్కబోయే 99వ ప్రాజెక్ట్. అయితే ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై నాగార్జున ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్‌తో నాగార్జున […]
ఇంట్లో రష్మికను ఏమని పిలుస్తారో తెలుసా..? అస్సలు ఊహించలేరు!
నేషనల్ క్రషర్ రష్మిక ఈ ఒక్క నెలలోనే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయింది. ఈమె నుంచి రాబోతున్నారు రెండు చిత్రాల్లో `వారసుడు` ఒకటి. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అలాగే రష్మిక బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో `మిషన్ మజ్ను` అనే మూవీ చేసింది. స్పై థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం రష్మిక ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ తో […]
`శాకుంతలం`లో సమంతనే ఎందుకు తీసుకున్నారో తెలుసా?
`యశోద` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం సమంత నుంచి రాబోతున్న మరో భారీ చిత్రం `శాకుంతలం`. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఆధారంగా గుణశేఖర్ రూపొందించిన మైథలాజికల్ లవ్ స్టోరీ ఇది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందించాడు. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజు దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో […]